Whatsapp Beta : వాట్సాప్ వెబ్‌లో ప్రైవసీ సెట్టింగ్స్.. ఆండ్రాయిడ్‌లో Media Shortcut బగ్ ఫిక్స్!
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) మీడియా షార్ట్‌కట్ ఆప్షన్ లో బగ్ ఫిక్స్ చేసింది. వాట్సాప్ డెస్క్‌టాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొత్త బీటా అప్ డేట్ తీసుకొచ్చింది.

Whatsapp Reportedly Adds Privacy Settings On Desktop
Whatsapp New Updates : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) మీడియా షార్ట్‌కట్ ఆప్షన్ లో బగ్ ఫిక్స్ చేసింది. వాట్సాప్ డెస్క్‌టాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొత్త బీటా అప్ డేట్ తీసుకొచ్చింది. డెస్క్‌టాప్ Beta WhatsApp వెబ్‌లో కొత్తగా Privacy Settings ఫీచర్ యాడ్ చేసింది. ఇప్పటివరకూ వాట్సాప్ యాప్‌లో మాత్రమే Privacy Settings ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ఫీచర్ డెస్క్‌టాప్ వెర్షన్‌లో కూడా ప్రవేశపెట్టింది. ప్రస్తుతానికి ఈ డెస్క్ టాప్ ప్రైవసీ సెట్టింగ్స్ ఆప్షన్.. ఎంపిక చేసిన బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. Android యూజర్ల కోసం.. లేటెస్ట్ క్విక్ మీడియా షార్ట్‌కట్ (Quick Edit Shortcut) ఫీచర్ లో బగ్ ఫిక్స్ చేసేసింది.
WABetaInfo నివేదికల ప్రకారం.. WhatsApp డెస్క్ టాప్ బీటా 2.2146.5 వెర్షన్ రిలీజ్ అయింది. ఈ అప్‌డేట్ నేరుగా WhatsApp వెబ్, WhatsApp కోసం డెస్క్‌టాప్ సెట్టింగ్‌లలో Privacy Settings ఫీచర్ యాడ్ చేసింది. ఈ ఫీచర్‌ను యూజర్లు Last Seen, Profile Photo, About Page నేరుగా WhatsApp వెబ్ లేదా WhatsApp డెస్క్‌టాప్ నుంచి యాక్సస్ చేసుకోవచ్చు. అంతేకాదు.. read receipts టోగుల్ (Toggle) చేయవచ్చు. అలాగే గ్రూప్‌లలో ఎవరిని యాడ్ చేయాలో కూడా ఎంచుకోవచ్చు.
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం WhatsApp 2.21.24.9 వెర్షన్ కొత్త బీటా అప్‌డేట్‌ను ప్రవేశపెడుతోంది. ఈ కొత్త అప్‌డేట్ ఒక వారం క్రితమే రిలీజ్ చేసింది. తద్వారా వాట్సాప్ లో క్విక్ మీడియా షార్ట్ కట్ ఫీచర్‌లో బగ్‌ను ఫిక్స్ చేయనుంది. కొంతమంది యూజర్లు క్విక్ షార్ట్ కట్ పని చేయడం లేదంటూ ఫిర్యాదు చేశారు. కొత్త WhatsApp బీటాలో Android 2.21.24.9 అప్‌డేట్ ద్వారా WhatsApp ఇప్పుడు ఆ షార్ట్‌కట్‌ను తొలగిస్తోంది. వాట్సాప్ భవిష్యత్తులో మళ్లీ ఈ మీడియా షార్ట్ కట్ యాడ్ చేసే అవకాశం ఉంది.
Read Also : WhatsApp Web Tricks : వాట్సాప్ వెబ్‌లో ఈ సూపర్ షార్ట్‌కట్స్.. తప్పక తెలుసుకోండి!