North Korea Kim Wife :ఊహాగానాలకు చెక్..5 నెలల తరువాత బయటకొచ్చిన కిమ్ భార్య!చప్పట్లతో మారుమ్రోగిన ఆడిటోరియం

ఉత్తరకొరియా నియంత కిమ్ భార్య కనిపించట్లేదని ఆమెకు ఏమైంది? అంటూ వచ్చే ఊహాగానాలకు చెక్ పెడుతు 5 నెలల తరువాత బయటకొచ్చారు కిమ్ భార్య.

North Korea Kim Wife :ఊహాగానాలకు చెక్..5 నెలల తరువాత బయటకొచ్చిన కిమ్ భార్య!చప్పట్లతో మారుమ్రోగిన ఆడిటోరియం

North Korea Kim Jong Un Wife Ri Sol Ju Makes Public Appearance After 5 Months (1)

North Korea Kim Jong Un Wife Ri Sol Ju : ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ విషయంలో ప్రతీ చిన్న విషయం కూడా విశేషమే. కిమ్ పేరు వినిపిస్తే చాలు ఏదో విషయం ఉండే ఉంటుందనేంత పేరు కిమ్ గారికి. ఆయన గారి పాలనలో స్వేచ్చ అంటే ఎలా ఉంటుందో కూడా మర్చిపోయిన ప్రజల పడే పాట్లు నుంచి అన్ని వార్తా విశేషాలు. ఆ మధ్య కిమ్ కొంతకాలం పాటు కనిపించలేదు. అప్పుడు కిమ్ ఏమయ్యారు? అస్వస్థకు గురయ్యారా? మరి పాలన ఎవరి చేతుల్లోకి వెళుతుంది? కిమ్ కంటే నాలుగు ఆకులు ఎక్కువే అన్నట్లుగా ఉండే ఆయన సోదరి పాలన పగ్గాలు చేపడతారా?అనే వార్తలు హల్ చల్ చేశాయి. కానీ కొంతకానికి బరువు తగ్గిపోయి కొత్త లుక్ తో కిమ్ గారి ప్రత్యక్షమయ్యేసరికి మళ్లీ కిమ్ కనిపించారు. బరువు బాగా తగ్గిపోయారే అంటూ వార్తలు హల్ చల్ చేశాయి. ఇలా కిమ్ విషయంలో అన్ని వింతలే..విశేషాలే.

అటువంటిది గత కొంతకాలంనుంచి కిమ్ గారి భార్య కనిపించట్లేదని..ఆమెకు ఏమైందీ? కనిపింట్లేదు..ప్రెగ్నెంట్ అయ్యారా? అనే ఎన్నో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కిమ్ పక్కన ఆమె ఏ కార్యక్రమాలకు హాజరు కాకపోవటంతో ఆమెకు ఏమైందో అనే ఆసక్తి నెలకొంది. అలా కిమ్ గారి భార్య కనిపించక దాదాపు ఆరు నెలలు కావస్తోంది. ఈక్రమంలో కిమ్ పక్కనే ఆయన భార్య రి సోల్ జు ప్రత్యక్షమయ్యారు. దీంతో కిమ్ భార్య మళ్లీ కనిపించారే అనే వార్తలు వస్తున్నాయి. ఆమె ప్రెగ్నెంట్ అయి ఉండవచ్చు..అందుకే ఏ కార్యక్రమాలకు కిమ్ తో రావట్లేదనే వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలకు చెక్ పెడుతూ కిమ్ భార్య రి సోల్ జు ఓ కార్యక్రమానికి హాజరయ్యారు.

Also read : Laughing Banned in NorthKorea :దటీజ్ కిమ్..ఉత్తరకొరియాలో ప్రజలు నవ్వొద్దు, తాగొద్దు,వేడుకలు చేసుకోవద్దు..

అలా కిమ్ భార్య భార్య రి సోల్ జు ఐదు నెలల తరువాత బయటకు వచ్చారు. చివరిసారి గత ఏడాది సెప్టెంబర్ 9న బయటకు వచ్చిన ఆమె.. మళ్లీ ఐదు నెలల తర్వాత ఇప్పుడు అందరికీ కనిపించారు. లూనార్ న్యూ ఇయర్ సందర్భంగా కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ లోని మాన్సుడే ఆర్ట్ థియేటర్ లో నిర్వహించిన ఆర్ట్ ప్రదర్శనకు కిమ్ తో పాటు ఆమె హాజరయ్యారు.

Also read : North Korea : The Uncle సినిమా చూసినందుకు బాలుడికి 14 ఏళ్లు జైలుశిక్ష వేసిన ఉత్తర కొరియా ప్రభుత్వం

కొరియా అధికారిక పత్రిక కేసీఎన్ఏ ఈ విషయాన్ని వెల్లడించింది. భార్య రి సోల్ జుతో కలిసి కిమ్ వస్తున్నప్పుడు ఆడిటోరియంలోని వారంతా చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారని పేర్కొంది. ప్రదర్శనను ఆసక్తిగా తిలకించిన కిమ్ దంపతులు.. ఆర్టిస్ట్ లతో ఫొటోలు దిగారని, వారికి శుభాకాంక్షలు చెప్పారని తెలిపింది.

వాస్తవానికి కిమ్ తన భార్యలతో కలిసి బయటకు రావడం చాలా అరుదు. కానీ, కిమ్ తో పాటు రి సోల్ జు.. మిలటరీ కార్యక్రమాలు, సామాజిక, వ్యాపార కార్యక్రమాలకు హాజరై అంతర్జాతీయ సమాజం దృష్టిని తనవైపునకు తిప్పుకొన్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఓ కన్సర్ట్ హాజరయ్యాక మళ్లీ ఆమె బయటకు రాలేదు. దీంతో ఆమె ఆరోగ్యం బాగాలేదని, గర్భవతి అని రకరకాల వార్తలు వినిపించాయి. అయితే, సెప్టెంబర్ 9న ఓ వేడుకకు ఆమె రావడంతో ఆ వార్తలకు చెక్ పడినట్లైంది.

Also read : Kim Jong Un : ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ చూసినవారికి దారుణ శిక్ష విధించిన కిమ్ జోంగ్

కరోనా మహమ్మారి వల్ల ఆమె ఇన్నాళ్లూ బయటకు రాలేదని, తన పిల్లలతో కలిసి కాలాన్ని గడిపిందని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఆ దేశ ప్రభుత్వానికి తెలియజేసింది. కిమ్, రి దంపతులకు ముగ్గురు పిల్లలున్నట్టు తన నివేదికలో తెలిపింది.