Kim Jong Un : ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ చూసినవారికి దారుణ శిక్ష విధించిన కిమ్ జోంగ్

సంచలనం సృష్టిస్తున్న ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ చూసినవారికి నార్త్ కొరియా అధ్యక్షడు కిమ్ జోంగ్ అత్యంత దారుణ శిక్ష విధించారు.

10TV Telugu News

‘Squid Game’ Kim Jong Un : నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నియంతత్వం గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. కిమ్ క్రూరత్వానికి పరాకాక్ష అనే ఎన్నో వింత వింత శిక్షలు విధించటంలో అతను ఆరితేరినవాడని తెలిపే ఘటనలు జరిగాయి. కిమ్ అంటే క్రూరత్వం అనే మాటే గుర్తుకొస్తుందంటారు. అలా కిమ్ నార్త్ కొరియా అధ్యక్షుడే కదా..అనేంత పేరు ఆయనకు ప్రపంచవ్యాప్తంగా..దేశ పాలనలో ఆయనదో ప్రత్యేక శైలి. వింత వింత రూల్స్ పెట్టటంలో ఆయనతరువాతే ఎవరైనా..వారసత్వంగా వచ్చిన అధికారాన్ని తన వికృత నిర్ణయాలతో డిక్టేటర్ లా వ్యవహరిస్తుంటారు కిమ్.

ఆయన మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఎవ్వరికీలేదు. మనుషులను కిరాతకంగా చంపిన అడాల్ఫ్ హిట్లర్‌ గుర్తుతెస్తుంటారు కిమ్.అణ్వాయుధాల సృష్టికర్తగా పేరుగాంచిన కిమ్ జోంగ్ ఉన్ తప్పు చేశాడని సొంత బాబాయినే పెంపుడు కుక్కలతో చంపించాడంటారు. ఇటువంటి దారుణాలు కిమ్ ఖాతాలో చాలానే ఉన్నాయి. వాటి గురించి చెప్పుకుంటే ఎంతో..ఎంతెంతో..అటువంటి కిమ్ ఓ రూల్ పాస్ చేశాడు దేశంలో అంటే అక్షరాలా పొల్లు కూడా పోకుండా అమలు జరిగాల్సిందే.అది జనాలకు ఇష్టమైనా..కాకపోయినా సరే..ఇంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్న కిమ్ తమ దాయాది దేశం..సరిహద్దు దేశం విషయంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఊరుకుంటాడా..? ఉపేక్షిస్తాడా? తన కిరాతకాన్ని చూపిస్తాడు. అదే చేశాడు. చిన్నదైనా దారుణ శిక్ష వేయకుండా ఉంటాడా? అదే చేశాడు.ఓ వ్యక్తికి కిమ్ అత్యంత కిరాతకమైన శిక్షను విధించాడు. కిమ్ గురించి తెలిసిన ఈ లోకం మొత్తం మరోసారి ఉలిక్కిపడింది. మరోసారి ప్రపంచమంతా షాక్ అయింది..ఓ వ్యక్తికి విధించిన శిక్ష గురించి తెలిసి..ఇంతకీ అతనేంచేశాడు? కిమ్ విధించిన శిక్ష ఏంటీ అంటే..

Read more : North Korea : ఉత్తర కొరియాలో కీలక మార్పులు..కిమ్ సోదరికి అధ్యక్ష బాధ్యతలు?

దక్షిణ కొరియాకు చెందిన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్
నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన ‘స్క్విడ్ గేమ్’వెబ్ సిరీస్. ప్రపంచ వ్యాప్తంగా హోరెత్తిపోతున్న సిరిస్.దక్షిణ కొరియాకు చెందిన ఈ సిరిస్ చూడకూడదని రూల్. ‘‘ఈ ‘స్క్విడ్ గేమ్’వెబ్ సిరిస్ దక్షిణ కొరియా క్రూరత్వాన్ని ప్రతిబింబిస్తోందని.. అది నార్త్ కొరియా సంప్రదాయానికి విరుద్దమని.. అందుకే ఈ వ్యవహారాన్ని ఆదిలోనే అంతం చేస్తున్నామని’ కిమ్ ప్రభుత్వం ఓ కీలక ప్రకటనను విడుదల చేసింది.కానీ పాపం ఓ వ్యక్తి ఆ సిరిస్ చూశాడు. చైనా సర్వర్ల నుంచి డౌన్‌లోడ్ చేసి మరీ చూశాడు. ఈ విషయం మన కిమ్ గారికి తెలిసింది. అంతే ఉగ్రడైపోయాడు. దయాదాక్షిణ్యాలు గురించి తెలియని కిమ్ అతడ్ని సైన్యంతో అతి కిరాతకంగా కాల్చి చంపించాడు. ఓ సామాన్య వ్యక్తి విషయంలో దేశాధ్యక్షుడు అంత కఠినంగా వ్యవహరించటం అది నార్త్ కొరియాలో మాత్రమే జరుగుతుందని అనటానికి ఇదొక ఉదాహరణ.

Read more :Psycho couple: చిన్నారుల్ని దత్తత తీసుకుని..నోరు,చేతులు కట్టేసి..కుక్కల బోనులో బంధించి…బాత్రూమ్ లో.. 

అంతేకాకుండా సదరు వ్యక్తి నుంచి ఫ్లాష్ పెన్ డ్రైవ్స్ ద్వారా ‘స్క్విడ్ గేమ్’ సిరీస్‌ను ఏడుగురు విద్యార్ధులు చూశారు. వారిని కూడా శిక్షించాడు. ఆ ఏడుగురిలో ఒకరికి జీవిత ఖైదు శిక్ష విధించగా..రో ఆరుగురికి ఐదేళ్ల నిర్భంద శిక్షను కిమ్ విధించాడు.అక్కడితో ఆగలేదు కిమ్ గారి ఉగ్రత. సదరు విద్యార్ధులు చదువుతున్న స్కూల్ ప్రిన్సిపల్‌..టీచర్లను డ్యూటీల్లోంచి పీకిపారేశాడు. అక్కడితో అయిపోలేదు కిమ్ గారి స్టైల్ ఆఫ్ శిక్షలు..వారికి ఐదేళ్ల నిర్భంద శిక్ష విధించింది కిమ్‌ ప్రభుత్వం. పాపం వారంతా వారి తమ శిక్షాకాలం ముగిసేవరకు బొగ్గు గనుల్లో, మారుమూల పల్లెల్లో కూలీ పనులు చేసుకుని బతకాల్సిందే. మరే రకంగాను బతకటానికి వీల్లేదు.

Read more : Medical Students Test Positive : రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా..66మంది మెడికల్ విద్యార్ధులకు కరోనా

కాగా..‘స్క్విడ్ గేమ్’ సిరీస్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ప్రపంచ రికార్డులు బ్రేక్ చేస్తోంది.‘స్క్విడ్ గేమ్’ సిరీస్ గురించి ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి. ఇది ఎంటర్టైన్మెంట్ షో అస్సలు కాదు..హింసాత్మకమైన సిరిస్ అని పలువురు అంటున్నారు.కానీ ప్రపంచ వ్యాప్తంగా పేరొందింది.

Read more : North Korea Kim Jong Un : మా స్టైల్లోనే మేము కోవిడ్ తో పోరాడతాం.. వ్యాక్సిన్ అక్కర్లేదు