Psycho couple: చిన్నారుల్ని దత్తత తీసుకుని..నోరు,చేతులు కట్టేసి..కుక్కల బోనులో బంధించి…బాత్రూమ్ లో..

పిల్లలు లేరని చిన్నారుల్ని దత్తత తీసుకుని వారికి తిండి పెట్టకుండా..నోరు చేతులు టేపులతో బంధించి కుక్కల బోనులో పడేసి చంపిన దంపతుల దారుణాలు పెను సంచలనం కలిగించాయి.

10TV Telugu News

kaluva couple Crime : పిల్లలు లేనిని కొంతమంది అనాధ పిల్లల్ని దత్తత తీసుకుంటారు. వారిని కంటికి రెప్పలా కాచుకుంటారు. కానీ అమెరికాకు చెందిన దంపతులు మాత్రం అలాకాదు. అనాధ పిల్లలను దత్తత తీసుకుని..వారిని హింసించటమే పనిగా పెట్టుకున్నారు. పిల్లల్ని హింసించటానికే దత్తత తీసుకుంటారు. అలా అనాధ పిల్లల్ని దత్తత తీసుకుని వారిలో ఓ చిన్నారిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. వింటేనే ఒళ్లు జలదరించే ఈ సైకో దంపతులు పాపం పండి వారు చేసే దారుణాలు బయటపడ్డాయి. కానీ ఓ చిన్నారి అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయింది.

ముగ్గురు అక్కాచెల్లెళ్లు..తల్లిదండ్రులు వారిని పెంచలేక అనాథాశ్రమంలో చేర్చారు. ఓ రోజు ఇద్దరు దంపతులు వచ్చి.. ఆ అక్కాచెల్లెళ్లను దత్తత తీసుకుంటామన్నారు. తల్లిదండ్రుల ప్రేమ దొరుకుతుందనే ఆశపడ్డారు ఆ చిన్నారులు. కానీ కొత్త అమ్మానాన్నల కూడా వెళ్లిన ఆ చిన్నారుల ఆనందం ఎక్కువ రోజులు మిగల్లేదు. చిన్నారులను దత్తత తీసుకున్న దంపతులు రాక్షసులు. నరరూప రాక్షసులు. సైకోలు. దత్తత తీసుకున్న వారిలో ఓ చిన్నారిని అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన అమెరికాలో సంచలనం సృష్టించింది.హవాయికి చెందిన 52 ఏళ్ల ఐజాక్ కలువా, 43 ఏళ్ల లెహువా కలువా భార్యాభర్తలు. వారు 2008లో ఇసాబెల్లా అనే బాలినకు అనాధ ఆశ్రమం నుంచి తెచ్చుకుని దత్తత తీసుకున్నారు. ఇసాబెల్లా కంటే ముందు ఆమె సోదరిని 2009లో దత్తత తీసుకున్నారు కలువా దంపతులు. ఆ తరువాత ఇసబెల్లా మరో ఇద్దరు తోబుట్టువులను 2018 ఒకరిని..2020లో మరొకరిని దత్తత తీసుకున్నారు.

ఇసాబెల్లా తల్లిదండ్రులు వైమన ప్రాంతంలో జీవిస్తున్నారు. కటిక పేదరికం. పిల్లలకు తిండికూడా పెట్టలేనంత దరిద్రం అనుభవిస్తున్నారు. దీంతో వారు కలువా దంపతలుకు దత్తత ఇచ్చారు. ఇసాబెల్లాను అత్యంత దారుణంగా హింసించేవారు. తిండి పెట్టకుండా ఆకలితో మాడ్చేవారు. ఆకలికి తట్టుకోలేక ఆ చిన్నారి వారు నిద్రపోయాక రాత్రిళ్లు లేచి ఆహారం కోసం ఇంట్లో వెతుక్కునేది.అది చూసిన కలువా దంపతులు ఆ పిల్లను దారుణంగా కొట్టేవారు. ఆ దెబ్బలు భరిస్తూ..బయటపడే దారిలేక అల్లాడిపోయేది. తాము పడుకున్నాక ఆహారం కోసం ఇల్లంతా వెదుకుతోందని..ఓ కుక్కల బోను కొనుక్కొచ్చి.. ఇసాబెల్లాను దాంట్లో బంధించి తాళం వేసేవారు. ఆకలితో అరిచేది పాపం ఆ చిన్నారి. దీంతో ఈ విషయం ఎవరికన్నా తెలుస్తుందని ఆ చిన్నారి నోరు, చేతుల్ని టేప్ వేసి బంధించి కుక్కల బోనులో వేసి ఆ బోనును బాత్రూమ్ లో పెట్టి తాళం వేసేవారు.ఈ విషయం ఇసాబెల్లాకంటే ముందు ఆమె సోదరిని దత్తత తీసుకుని ఇంటికి తీసుకొచ్చిన ఆమె సోదరికి తెలికుండా జాగ్రత్త పడేవారు.

ఈ క్రమంలో ఇసాబెల్లా సోదరి తన చెల్లెలు కోసం వెదుక్కునేది. చెల్లెలు కనిపించకపోవటంతో వారిని అడిగింది. దానికి వారు ఏదోకటి చెప్పేవారు. కానీ ఆమెకు అనుమానం పెరిగింది. రాతుళ్లు చెల్లెలు కనిపించకపోవటంతో ఓరోజు రాత్రి మెల్లగా లేచి ఇల్లంతా వెతికింది. బాత్రూమ్ లో కుక్కల బోనులో ఉన్న ఇసాబెల్లాను చూసి షాక్ అయ్యింది. బోనులోంచి తప్పించి బెడ్ రూంలోకి తీసుకొచ్చింది చప్పుడు చేయకుండా..అప్పటికే ఇసాబెల్లా అపస్మారక స్థితిలో ఉంది. దీంతో భయపడి ఏడుస్తు దంపతులకు చెప్పింది. ‘నా చెల్లెలికి ఏమైంది? అంటూ ఏడ్చింది.దీతో ఇసాబెల్లాను బాత్ టబ్ లో పడుకోబెట్టి నీరు పెట్టారు. కానీ ఇసాబెల్లా మేల్కోలేదు. చనిపోయిందని గుర్తించారు.

ఒంట్లో బాగాలేదు హాస్పిటల్ కు తీసుకెళతామని చెప్పి..మిగతా పిల్లలకు తెలియకుండా బాలిక మృతదేహాన్ని మాయం చేశారు. కానీవారు ఇంటికొచ్చాక అడిగింది నా చెల్లెలు ఏది అని..దానికి హాస్పిటల్ లో జాయిన్ చేశాం. ఏమీ కాదు అని నచ్చచెప్పి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ రోజులు గడిచినా చెల్లెలు మాట వారు ఎత్తకపోవటంతో అనుమానం పెరిగింది. మరోసారి అడగింగి నా చెల్లెలు ఏది నిజం చెప్పండీ అంటూ ..దానికి ఆ రాక్షసులు మీ చెల్లెలు చచ్చిపోయింది. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని ఇసాబెల్లా అక్కను బెదిరించారు.ఆ తరువాత మాత్రూమ్ లో టడ్ ని..కుక్కల బోనును ధ్వంసం చేశారు. ఆ తరువాత ఐజాక్ కలువ తనకు కరోనా లక్షనాలు ఉన్నాయని చెప్పి ఆస్పత్రిలో చేరాడు. 2021, సెప్టెంబర్ 12న ఇసాబెల్లాను హత్య చేసిన నెల రోజుల తరువాత అనగా అక్టోబర్ 12 కలువా దంపతులు అనుమానం రాకుండా ఉండడం కోసం చిన్నారి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు నెల రోజుల పాటు పోలీసులు దర్యాప్తు చేశారు. ఇసాబెల్లా కోసం వందలమంది గాలించారు.

వారి సొంత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి ఉంటుందని వైమన ప్రాంతం అంతా గాలించారు. చిన్నారి మిస్సింగ్ గురించి చిన్న క్లూ కూడా దొరక్కపోవడంతో పోలీసులు డిటెక్టివ్ సాయం కూడా తీసుకున్నారు. విచారణలో భాగంగా ఇసాబెల్లా అక్క జరిగిన దారుణం గురించి డిటెక్టివ్ కు చెప్పింది ఏడుస్తు..ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులకు కలువా దంపతుల Online Order చేసినట్లుగా తెలిసింది. అన్ని ఆధారాలు సేకరించిన హోనలులూ పోలీసు డిపార్ట్ మెంట్ అధికారులు కలువా దంపతులను అరెస్ట్ చేశారు.విచారణలో కోర్టు కలువా దంపతులు క్షమాభిక్షకు ఏమాత్రం అర్హత లేదని ముక్కుపచ్చలారని పిల్లలు అత్యంత పాశవికంగా చంపేసిన ఆ దంపతులకు కఠిన శిక్షకు అర్హలని కోర్టు తీర్పునిచ్చింది. చిన్నారి కనీసం అనాథాశ్రమంలో ఉంటే బతికి ఉండేదని..ఈ హింస అత్యంత దారుణమని..కోర్టు విచారణ వ్యక్తం చేసింది. కలువా దంపతులు కఠిన శిక్ష విధించింది.