Laughing Banned in NorthKorea :దటీజ్ కిమ్..ఉత్తరకొరియాలో ప్రజలు నవ్వొద్దు, తాగొద్దు,వేడుకలు చేసుకోవద్దు..

ఉత్తర కొరియాలో ప్రజలకు మరో కొన్ని వింత కష్టాలు వచ్చి పడ్డాయి. దేశంలో ప్రజలు నవ్వకూడదు, మద్యం సేవించకూడదు,శుభకార్యాలు చేసుకోకూదని రూల్ పాస్ చేసింది ప్రభుత్వం.

Laughing Banned in NorthKorea :దటీజ్ కిమ్..ఉత్తరకొరియాలో ప్రజలు నవ్వొద్దు, తాగొద్దు,వేడుకలు చేసుకోవద్దు..

Laughing Banned In Northkorea

Laughing or drinking banned in North Korea: ఉత్తర కొరియాలో ప్రజలకు మరో కొన్ని వింత కష్టాలు వచ్చి పడ్డాయి. దేశాధినేత కిమ్ జాంగ్ నియంత పాలన పరాకాష్టకు చేరుతున్నక్రమంలో దేశంలో ప్రజలు నవ్వకూడదు..మద్యం సేవించకూడదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇటువంటి వింత వింత ఆంక్షలతో దేశ ప్రజలు కనీస హక్కులు కూడా కోల్పోతున్న పరిస్థితి కేవలం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఒకే ఒక్క ఉత్తరకొరియాలో మాత్రమే ఉందని చెప్పొచ్చు. దేశంలో ప్రజలు ధరించే బట్టల నుంచి హెయిర్ స్టైల్ నుంచి వారి జీవించే ప్రతీక్షణం జీవనవిధానం అంతా అంతా దేశాధినేత ఇష్టాఅయిష్టాలతోనే ఉండాలి.

Read more : North Korea : The Uncle సినిమా చూసినందుకు బాలుడికి 14 ఏళ్లు జైలుశిక్ష వేసిన ఉత్తర కొరియా ప్రభుత్వం

స్విడ్ గేమ్ సిరిస్ చూసిన కొంతమంది విద్యార్ధులపై అత్యంత కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వం.. ‘ది అంకుల్ ’అనే సినిమా చూసిన ఏడేళ్ల బాలుడికి జైలు శిక్ష విధించిన ప్రభుత్వం ఇలా ఒకటీ రెండూ కాదు ఇటువంటి ఘటనలకు ఉత్తరకొరియాలో అంతే లేదు. ఏ దేశంలోను లేని అనాగరిక శిక్షలు..కఠిన నియమ నిబంధనలు ఉత్తర కొరియాలోనే కొనసాగుతున్నాయి.

ఈక్రమంలో తాజాగా ఉత్తర కొరియా మరోసారి తనదైన శైలిలో ప్రజలపై నియంతృత్వ ఆంక్షలు విధించింది. దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ తండ్రి, ఉత్తరకొరియా మాజీ అధినేత అయిన కిమ్ జాంగ్ చనిపోయి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన్ను స్మరించుకుంటూఉండాలని ఈ క్రమంలో ‘‘ప్రజలెవ్వరు నవ్వకూడదని..మద్యం సేవించి ఖుషీగా ఉండకూడదని కిమ్ ఆదేశాలు జారీ చేశారు. కిమ్ జాంగ్ కు ప్రజలంత 11 రోజుల సంతాప దినాలు పాటించాల్సిందిగా ఆర్డర్ పాస్ చేశాడు.

Read more : Kim Jong Un : ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ చూసినవారికి దారుణ శిక్ష విధించిన కిమ్ జోంగ్

సంతాప దినాలుగా పాటించే ఆ 11 రోజులు దేశంలో ఎవ్వరూ సంతోషంగా ఉండకూడదని..నవ్వకూడదని..మద్యం సేవించకూడదని హుకుం జారీచేశారు సదరు కిమ్ గారు. ఈ 11 రోజులు ప్రజలు కనీసం నవ్వినా..ఆల్కహాల్ సేవించినా..కఠిన శిక్షలు విధిస్తామని అధికారులు హెచ్చరించారు. ఈ ఆంక్షలు ఎంతగా ఉన్నాయంటే..దేశంలో ఎవ్వరు సంతోషకరమైన కార్యక్రమాలు చేసుకోకూడదు..పిల్లలు పుట్టిన రోజులు కూడా చేసుకోకూడదని నిబంధనలు విధించారు.

అంతేకాదు..డిసెంబర్ 17న కిమ్ జాంగ్ 10వ వర్థంతి సందర్భంగా ఉత్తర కొరియా వాసులు ఎవ్వరూ ఆ రోజున నిత్యవసర వస్తువులు కూడా కొనుక్కోకూడదని..కిమ్ జాంగ్ రూల్ పాస్ చేశాడు. అక్కడితో ఆగలేదు వీరి నియంతత్వ పోకడలు..ఈ 11 రోజుల సంతాప దినాల సమయంలో ఎవరి ఇంట్లోనైనా వారి కుటుంబసభ్యులు గానీ..బంధువులు, ఆత్మీయులు చనిపోయినా ఏడవకూడదు. ఎవ్వరింట్లోను శుభకార్యలు జరుపుకోకూడదు. కనీసం పిల్లల పుట్టిన రోజు వేడుకలు చేసుకోకూడదు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఒకటా, రెండా.. కిమ్ జాంగ్ ఉన్ విధించిన నియంత రూల్స్ అన్నీ ఇన్నీ కావు.

తండ్రిని మించిన కిమ్..వీరి వంశమేఅంత..ఒకరిని మించినవారు మరొకరు అన్నట్లుగా ఉంటారు ఈ కిమ్ వంశీకులు. వారి పోకడలన్నీ ప్రజలమీద రుద్దుతుంటారు. కిమ్ జాంగ్ ఉన్ నియంత పోకడ అతడితోనే ప్రారంభమైంది కాదు. అతడి తండ్రి కిమ్ జాంగ్ కూడా ఉత్తర కొరియా నియంతగా 1994 నుంచి 2011 వరకు 17 ఏళ్ల పాటు ఆ దేశాన్ని ఏలాడు. ఉత్తర కొరియాను తన చెప్పుచేతల్లో పెట్టుకుని చెప్పు కింద పురుగులా ప్రజల్ని నలిపేశాడు. ఉత్తర కొరియా ప్రజలకు నరకం అంటే ఏంటో బతికుండగానే చూపించాడు.

అయినా ప్రజలు కిమ్ పేరే తలవాలి. వారినే దేవుడిగా కొలవాలి. కిమ్ వారసుల ఫోటోలు దేశంలో ప్రతీ ఇంటిలోను ఉండాల్సిందే. వారి ఫోటోలకు కనీసం దుమ్ము కూడా పట్టకూడదు. ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి. కిమ్ తండ్రి కిమ్ జాంగ్ చివరకు 69 ఏళ్ల వయస్సులో 2011 డిసెంబర్ 17న కిమ్ జాంగ్ గుండెపోటుతో కన్నుమూశాడు. కిమ్ వంశీకుల పాలనలో ప్రజలు స్వేచ్చ అనే మాటకు అర్థమే తెలియకుండా బతికేస్తున్నారు. కిమ్ నియంత నిర్ణయాలతో..కఠిన శిక్షలతో జనాలు బానిసల్లా జీవిస్తున్నారనే చెప్పాలి.