Russia ukraine war : రష్యా యుద్ధ ట్యాంక్ ను ఎత్తుకుపోయిన యుక్రెయిన్ రైతు…లబోదిబోమన్న రష్యన్

తమపై దాడులు చేయటానికి వచ్చిన రష్యా యుద్ధ ట్యాంక్ ను ఎత్తుకుపోయాడు యుక్రెయిన్ రైతు. అది గమనించిన రష్యన్ లబోదిబోమంటూ ట్రాక్టర్ వెనకాలే పరిగెత్తాడు.

Russia ukraine war : రష్యా యుద్ధ ట్యాంక్ ను ఎత్తుకుపోయిన యుక్రెయిన్ రైతు…లబోదిబోమన్న రష్యన్

Ukraine Farmer Steals Russian War Tank Using Tractor

Russia ukraine war : ఏడవరోజు కూడా యుక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రం చేస్తోంది. భారీ ఆయుధాలు, యుద్ధ ట్యాంకులతో రష్యా బలగాలు యుక్రెయిన్‌ నగరాల్లోకి దూసుకొస్తున్నాయి. ఆ యుద్ధ ట్యాంకులను అడ్డుకోవటానికి యుక్రెయిన్ పౌరులు శతవిధాల యత్నిస్తున్నారు. ‘శక్తి మేరకు ఎదిరించు కాకపోతే..చాకచక్యంగా అయినా శతృవుని బోల్తా కొట్టించు’అనే విషయాన్ని గుర్తు చేసుకున్నాడో ఏమో గానీ యుక్రెయిన్ శతృదేశం రష్యాకు చెందిన ఓ యుద్ధ ట్యాంకునే ఎత్తుకెళ్లిపోయాడు. దీంతో ఓ రష్యన్ యుద్ధట్యాంకును తీసుకుపోతుంటే లబోదిబోమంటూ వెనకాల పరిగెడతున్నట్లుగా ఉంది వీడియోలో. ఏకంగా యుద్ధ ట్యాంకునే ఎత్తుకుపోయిన రైతుపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Also read :  Russia-Ukraine war : నడిరోడ్డుపై రష్యా ల్యాండ్‌మైన్‌..నోటిలో సిగిరెట్ ఉంచుకునే ఒట్టి చేతులతో తీసేసిన యుక్రెయిన్ పౌరుడు

తమ దేశంపై దాడి చేసేందుకు రష్యా బలగాలు యుద్ధ ట్యాంకర్‌తో ఓ ప్రాంతానికి చేరుకున్నట్లు యుక్రెయిన్ రైతు తెలుసుకున్నాడు. ఏదోకటి చేయాలనుకున్నాడు. తన దగ్గర ఉన్న ట్రాక్టర్‌తో యుద్ధ ట్యాంకు ఉన్న చోటికి చేరుకున్నాడు. అంతే గుట్టుచప్పుడు కాకుండా తన ట్రాక్టర్‌కు ఆ యుద్ధ ట్యాంకర్‌ను అనుసంధానం చేసి అక్కడి నుంచి రయ్ మంటూ ట్రాక్టర్ పై దూసుకుపోయాడు.ఊహించని ఈ ఘటనకు బిత్తరపోయి వెంటనే తేరుకున్న రష్యా సైనికుడు ఆ ట్రాక్టర్ వెనుకాలే పరుగెత్తాడు.దీనికి సంబంధించినవీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Also read : Russia Soldier Last Message:గుండెల్నిపిండేసే రష్యా సైనికుడి చివరి సందేశం’సామాన్యులనూ చంపేస్తున్నాం,నాకు బతకాలనిలేదమ్మా..

సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తుల్లో బ్రిటీష్ ఎంపీ జానీ మెర్సర్ ఒకరు. తన ట్విట్టర్ లో ఈ వీడియోను షేర్ చేస్తూ..నిపుణులు కాకపోయినా రష్యన్ దండయాత్ర ప్రత్యేకంగా సాగుతున్నట్లు కనిపించటంలేదు.యుక్రెయిన్ వ్యక్తి రష్యన్ ఏపీసిని దొంగిలించింది అని పేర్కొన్నారు. ఈ వీడియో చూసినవారంతా ఓరినీ అసాథ్యం కూలా..దేశం కోసం ఏకంగా యుద్ధ ట్యాంకునే దొంగిలించాడే రైతు. భలే భలే ఐడియా అంటున్నారు ఈ వీడియో చూసినవారంతా.మరి మీరు కూడా ఓ లుక్ వేయిండీ ఈ రైతుగారి సాహసం వైపు..