Russia Soldier Last Message:గుండెల్నిపిండేసే రష్యా సైనికుడి చివరి సందేశం’సామాన్యులనూ చంపేస్తున్నాం,నాకు బతకాలనిలేదమ్మా..

‘‘అమ్మా.. నేను యుక్రెయిన్ తో యుద్ధంలో పాల్గొంటున్నా. నాకు చాలా భయంగా ఉంది. నగరాలపైనా బాంబులతో విరుచుకుపడుతున్నాం.సామాన్య పౌరులనూ చంపేస్తున్నామమ్మా నాకు చచ్చిపోవాలనిపిస్తోందమ్మా’..

Russia Soldier Last Message:గుండెల్నిపిండేసే రష్యా సైనికుడి చివరి సందేశం’సామాన్యులనూ చంపేస్తున్నాం,నాకు బతకాలనిలేదమ్మా..

Russia Soldier Last Message

Russia Soldier Last Message To His Mother : యుద్ధ చేసే ప్రతీ సైనికుడికి ఓ మనస్సుంటుంది. ఓ కుటుంబం ఉంటుంది. అమ్మా, నాన్నా, అక్కా చెల్లీ..భార్య బిడ్డలు ఇలా ఎన్నో బంధాలుంటాయి. కానీ ఆ బంధాలకు దూరంగా ఎక్కడో శతృదేశంలో సాటి మనుషులపై యుద్ధం చేయటానికి వారిని మట్టు పెట్టటానికి వెళతాడు సైనికుడు. యుద్ధంలో దేశం కోసం పోరాడే క్రమంలో తమ చావును లెక్క చేయడు సైనికుడు..ప్రత్యర్థిని చంపటానికి ఏమాత్రం వెనుకాడు. కానీ ఏదేశం ఏ దేశంమీద యుద్ధం చేసినా..చనిపోయేది ‘మనుషులే’కదా. ఓ మనిషి సాటి మనిషిని చంపటానికి మానసికంగా ఎంతగా నలిగిపోతాడో..ఎంత మానసిక క్షోభకు గురి అవుతాడో యుక్రెయిన్ పై బాంబులతో విరుచుకుపడుతున్న ఓ రష్యా సైనికుడు చివరి సందేశం వింటే అర్థం అవుతుంది.

ఓ రష్యన్ సైనికుడు తన తల్లికి ఇచ్చిన చివరి సందేశం బయటపడింది. ఆ సందేశం గుండెల్ని పిండేస్తోంది. మాకు ఎదురొస్తే చంపేయమని మాకు ఆర్డర్స్ వచ్చాయి.కానీ అమాయకులైన సామాన్య ప్రజల్ని కూడా చంపేస్తున్నాం అమ్మా..నాకిది చాలా కష్టంగా ఉంది.మాకు శతృదేశపు సైనికులు ఎదురొస్తారు..వారిని మట్టు పెట్టాలని చెప్పారు. కానీ మాకు సామాన్య జనాలు కూడా ఎదురొస్తున్నారు.వారు మమ్మల్ని ఎదుర్కోకుండా మమ్మల్ని నిలువరించానికి వచ్చి మా యుద్ధ ట్యాంకుల కింద నలిగిపోతున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశాడా రష్యన్ సైనికుడు..యుక్రెయిన్ ప్రజలు మమల్ని ఫాసిస్టులు అంటున్నారంటూ తల్లికి ఇచ్చిన సందేశంలో మనస్తాపాన్ని వ్యక్తంచేశాడు. ఆ రష్యన్ సైనికుడు తల్లికి ఇచ్చిన సందేశంలో యుక్రెయిన్ రాయబారి ఐరాస సభలో చదివి వినిపించారు.

Also read : Russia Banned: పుతిన్ చేసిన పనికి రష్యా, బెలారస్‌ ప్లేయర్లపై ఒలింపిక్ కమిటీ నిషేదం

ప్రజలపై దాడులు చేయట్లేదని రష్యా పదేపదే ప్రకటిస్తున్నా.. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికే చాలా వరకు ప్రజల నివాస సముదాయాలపై రష్యా దాడులు చేసింది. దాడుల్లో ఇప్పటికే 350 మందికిపైగా పౌరులు చనిపోయారని, అందులో 17 మంది చిన్నారులున్నారని యుక్రెయిన్ ప్రకటించింది. రష్యా ఎన్ని అబద్దాలు చెబుతున్నా..అవి కేవలం అబద్ధాలేనని రుజువు అవుతున్నాయి రష్యా సైనికుడు తన తల్లికి పంపిన చివరి సందేశంలో. రష్యన్ సైనికుడు తల్లికి పంపిన సందేశం ఒకటి బయటకొచ్చి సంచలనం సృష్టిస్తోంది.

Also read : Russia Ukraine War: ఇంకా సీరియస్ అయిన రష్యా: కీవ్ నగరాన్ని బూడిద చేయడమే లక్ష్యంగా అడుగులు

ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశం సందర్భంగా ఆ సందేశాన్ని ఉక్రెయిన్ రాయబారి చదివి వినిపించారు. ఆ సందేశంలో సదరు రష్యాన్ సైనికుడు ‘‘చాన్నాళ్లయింది మాట్లాడి.. ఎందుకు స్పందించట్లేదు? నేను నీకో పార్సిల్ పంపిస్తాను’’ అంటూ ఆ సైనికుడికి తల్లి సందేశం పంపింది. దానికి స్పందించిన ఆ రష్యన్ సైనికుడు.. ‘నాకు ఉరేసుకుని చావాలనిపిస్తోంది అమ్మా’ అంటూ జవాబిచ్చాడు. ఇంకా..‘‘అమ్మా.. నేను ఉక్రెయిన్ తో యుద్ధంలో పాల్గొంటున్నా. నాకు చాలా భయంగా ఉంది. అన్ని నగరాలపైనా బాంబులతో విరుచుకుపడుతున్నాం. సామాన్య పౌరులనూ వదలకుండా చంపేస్తున్నామమ్మా..యుక్రెయినియన్లు మాకు ఎదురొస్తారని మా పై అధికారులు మాకు చెప్పారు..కానీ వాళ్లంతా మా యుద్ధ ట్యాంకుల కిందపడి ప్రాణ త్యాగాలు చేస్తున్నారు. మమ్మల్ని ముందుకు పోనివ్వట్లేదు. మమ్మల్ని ఫాసిస్టులు అని పిలుస్తున్నారు. చాలా కష్టంగా ఉందమ్మా’’ అంటూ తల్లికి మెసేజ్ పంపాడు. ఆ తర్వాత అతడు ఉక్రెయిన్ దళాల దాడుల్లో మరణించాడు.