Russia-Ukraine war : నడిరోడ్డుపై రష్యా ల్యాండ్‌మైన్‌..నోటిలో సిగిరెట్ ఉంచుకునే ఒట్టి చేతులతో తీసేసిన యుక్రెయిన్ పౌరుడు

నడిరోడ్డుపై రష్యా ఏర్పాటు చేసిన ల్యాండ్‌మైన్‌ ను యుక్రెయిన్ పౌరుడు ఒట్టి చేతులతో తీసి పారేశాడు. అదికూడా ..నోటిలో సిగిరెట్ పెట్టుకుని..!

Russia-Ukraine war : నడిరోడ్డుపై రష్యా ల్యాండ్‌మైన్‌..నోటిలో సిగిరెట్ ఉంచుకునే ఒట్టి చేతులతో తీసేసిన యుక్రెయిన్ పౌరుడు

Ukrainian Common Man Removes Landmine With Bare Hands While Smoking

Updated On : March 2, 2022 / 11:48 AM IST

Russia ukraine war : నడిచే దారిలో ల్యాండ్‌మైన్ (బాంబు) కనిపిస్తే భయం భయంగా పక్కనుంచి వెళ్లిపోతాం. సురక్షితంగా వెళ్లిపోయాక బత్రకు జీవుడా అంటూదౌడు తీస్తాం. కానీ యుక్రెయిన్ లో మాత్రం రష్యా సేనలు ఏర్పాటు చేసిన ల్యాండ్‌మైన్ ను చూసిన యుక్రెయిన్ వ్యక్తి దాన్ని ఏదో ఓ చెత్తను తీసి పారేసినట్లుగా తీసి అవతలపారేశాడు.

Also read : Russia Soldier Last Message:గుండెల్నిపిండేసే రష్యా సైనికుడి చివరి సందేశం’సామాన్యులనూ చంపేస్తున్నాం,నాకు బతకాలనిలేదమ్మా..

యుక్రెయిన్ లోని పోర్ట్ సిటీ ఆఫ్ బెర్డయాన్‌స్క్‌ నగరంలో ఉక్రెయిన్‌ యుద్ధ ట్యాంకులను పేల్చాలన్న ఉద్దేశంతో రష్యా సేనలు నడిరోడ్డుపై ఓ ల్యాండ్‌మైన్‌ను ఏర్పాటు చేశాయి. అది గమనించిన యుక్రెయిన్‌ పౌరుడు..తనకు ఏం జరిగినా ఫరవాలేదు..కానీ తమ జవాన్లకు ఏమీ కాకూడదని.. సాహసానికి పూనుకున్నాడు. ఒట్టి చేతులతోనే ల్యాండ్‌మైన్‌ను పట్టుకుని దూరంగా విసిరి పారేశాడు. దీనికి సంబంధించి ఫోటోలు..వీడియోలు బయటకు రావటంతో సదరుయుక్రెయిన్ పౌరుడు వీరుడు,సాహసి..తమ దేశం కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టిన వీరుడు అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Also read : Russia ukraine war : రష్యా యుద్ధ ట్యాంక్ ను ఎత్తుకుపోయిన యుక్రెయిన్ రైతు…లబోదిబోమన్న రష్యన్

38-సెకన్ల వీడియో క్లిప్‌లో నలుపు రంగు జాకెట్..జీన్స్ వేసుకున్న వ్యక్తి రోడ్డుపై ఉన్న ల్యాండ్ మైన్ ను దాన్ని అత్యంత జాగ్రత్తగా పట్టుకుని రోడ్డు దాటి వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. నోటిలో సిగిరెట్ పెట్టుకున్న ఆ వ్యక్తి ఒట్టి చేతులతోనే దాన్ని అత్యంత జాగ్రత్తగా తీసుకుని రోడ్డు పక్కనే ఉన్న చెట్లలోకి వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. కాగా ఏడవ రోజు తరువాత కూడా రష్యా ఓ పక్కన యుక్రెయిన్ తో చర్చలు జరుపుతునే దేశంపై యుద్ధాన్ని కొనసాగిస్తునే ఉంది.