Accident : షాకింగ్ యాక్సిడెంట్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఇప్పటివరకు చూసి ఉండరు..

కొన్ని ప్ర‌మాదాలు చాలా విచిత్రంగా జ‌రుగుతుంటాయి. ఊహకందని రీతిలో, రెప్పపాటులో జరిగిపోతాయి. అంతేకాదు ప్ర‌మాదంతో ఎలాంటి సంబంధం లేని వ్య‌క్తుల వాహనాలు..

Accident : షాకింగ్ యాక్సిడెంట్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఇప్పటివరకు చూసి ఉండరు..

Accident

Accident : రోడ్డు మీద డ్రైవింగ్ చేసే సమయంలో ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఒక్కోసారి యాక్సిడెంట్లు జ‌రుగుతూనే ఉంటాయి. కాగా, కొన్ని ప్ర‌మాదాలు చాలా విచిత్రంగా జ‌రుగుతుంటాయి. ఊహకందని రీతిలో, రెప్పపాటులో జరిగిపోతాయి. అంతేకాదు ప్ర‌మాదంతో ఎలాంటి సంబంధం లేని వ్య‌క్తుల వాహనాలు సైతం డ్యామేజ్ అవుతుంటాయి. తాజాగా జరిగిన ఓ యాక్సిడెంట్ అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఆ యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమాదం జరిగిన తీరు ఒళ్లుగగుర్పొడిచేలా ఉంది. ఇలాంటి యాక్సిడెంట్‌ను బ‌హుశా ఎప్పుడూ చూసి ఉండ‌ర‌ని అనుకోవ‌చ్చు.

Computer Work : గంటల కొద్దీ కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌లతో గడిపేవారికి వచ్చే వ్యాధులు ఇవే

అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఇండియానాపోలిస్ లో అక్టోబర్ 17న ఈ యాక్సిడెంట్ జ‌రిగింది. ట్రాఫిక్ సిగ్న‌ల్‌ దగ్గర వేగంగా వ‌చ్చిన ఓ కారు మ‌రో కారును ఢీకొట్టింది. దీంతో ఆ కారు ఎగిరి అవ‌త‌ల ప‌డింది. అలా ఎగిరిపడిన కారు కింద‌ప‌డ‌కుండా మ‌రో కారు ముందున్న బానెట్‌పై ప‌డింది. యాక్సిడెంట్‌తో ఎలాంటి సంబంధం లేని ఆ కారు ముందుభాగం దెబ్బ‌తింది.

Beware Of Children : టీవి, సెల్ ఫోన్లతో గడిపే చిన్నారులతో జాగ్రత్త!….ఎందుకంటే

ఈ ప్ర‌మాదానికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఈ ప్రమాదంలో ఆరు వాహనాలు దెబ్బతిన్నాయి. మరింత ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే.. ఇంత ఘోర ప్రమాదం జరిగినా అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. ప్రమాదంలో కనీసం ఎవరికీ గాయాలు కూడా కాలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఈ ప్రమాదం నుంచి ఓ వ్యక్తి తృటిలో తప్పించుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తి రోడ్డు దాటుకుంటూ వెళ్తున్న సమయంలో కారు ఎగిరి వచ్చి పడింది. అది గమనించిన అతడు వెంటనే పక్కకి తప్పుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు ఏమాత్రం కాస్త నిదానంగా నడిచినా అతడి ప్రాణాలు పోయేవని నెటిజన్లు అంటున్నారు. అతడు చాలా లక్కీ అన్నారు.