Wine car : వైన్‌తో నడిచే కారు నడుపుతున్న ప్రిన్స్ చార్లెస్..దటీజ్ రాయల్ రాజకుటుంబం రేంజ్

గ్రేట్ బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ రాజకుటుంబం రేంజ్ ఏంటో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అటువంటి చార్లెజ్ ప్రపంచంలోని కార్లకు భిన్నంగా వైన్ తో నడిచే కారును నడుపుతు హాట్ టాపిక్ గా మారారు

Wine car : వైన్‌తో నడిచే కారు నడుపుతున్న ప్రిన్స్ చార్లెస్..దటీజ్ రాయల్ రాజకుటుంబం రేంజ్

Prince Charles car runs on cheese and Wine : కార్లు దేంతో నడుస్తాయి? ఏంటీ పిచ్చిప్రశ్న..పెట్రోల్, డీజిల్ లేదంటే బ్యాటరీతో నడుస్తాయి. కానీ ఓ కారు మాత్రం నాకు .పెట్రోల్, డీజిల్ వద్దు బ్యాటరీ అసలే వద్దు నాకు ‘వైన్’కావాలంటోంది.వైన్ పోస్తేనే ఆ కారు నడుస్తుంది. ఇదేమీ జోక్ కాదు.. ఈ వైన్ కారు గురించి చెప్పిన వ్యక్తి సాదాసీదా వ్యక్తి అసలే కాదు..బ్రిటీష్‌ రాజవంశానికి కాబోయే చక్రవర్తి ప్రిన్స్‌ చార్లెస్‌ చెబుతున్నారు ఈ విషయాన్ని. ప్రిన్స్ చార్లెస్ పెట్రోలు, డీజిల్‌ బదులు వైన్‌తో కారు నడిపిస్తున్నారు.

Prince Charles's Aston Martin Was Converted to Use White Wine as Fuel

కార్లకు ఇంధనంగా వాడేది డీజిల్‌ లేదా పెట్రోల్‌. ఆ తర్వాతి కాలంలో ఈ రెండు ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వచ్చింది సీఎన్‌జీ గ్యాస్‌. కానీ వాతావరణ కాలుష్యం తగ్గించటానికి మార్పులు అవసరం అన్నట్లుగా అదే లక్ష్యంతో ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ కార్లు వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి ఆయా దేశాల ప్రభుత్వాలు. కానీ వీటన్నింటికి భిన్నంగా బ్రిటీష్‌ రాజవంశానికి కాబోయే చక్రవర్తి ప్రిన్స్‌ చార్లెస్‌ పెట్రోలు, డీజిల్‌ బదులు వైన్‌తో కారు నడిపిస్తున్నారు.

Read more : Mahindra xuv700 : కొత్త కారు.. 57 నిమిషాల్లో 25,000 బుకింగ్‌లు

ప్రిన్స్‌ ఛార్లెస్‌ తన 21వ ఏట ఆస్టన్‌ మార్టిన్‌ కారుని గిఫ్టుగా అందుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఈ యువరాజు గ్యారేజీలో మరెన్నో కార్లు వచ్చి చేరినా ఆ పాత ఆస్టోన్‌ మార్టిన్‌ కారు స్టైల్ ఏమాత్రం తగ్గలేదు. దాని వన్నె ఏమాత్రం తగ్గలేదు. యువరాజుకి దానిపై మోజు కూడా తీరలేదు. అందుకే ప్రిన్స్ తనకు వీలు చిక్కినప్పుడల్లా ఆ కారులో షికార్లు కొడుతుంటారు.

Viral Photos: వైన్‌తో నడిచే కారును మీరెప్పుడైనా చూశారా.? నెట్టింట ట్రెండింగ్.!

చార్జెస్‌ తనకారును ఇంజనీర్లతో రీ డిజైన్‌ చేయించుకున్నారు. వారి కృషి ఫలించింది. చార్లెస్ కు ఎంతో ఇష్టమైన ఆ కారు వైన్‌తో నడిచేలా చేశారు. బకింగ్‌హామ్‌ ప్యాలేస్‌లో మిగిలిపోయిన వైన్‌ని ఈ కారు నడిపేందుకు ఉపయోగిస్తున్నారట. అంతేకాదు విరిగిపోయిన పాలతో కూడా ఈ కారులో ఫ్యూయల్‌గా వాడుతున్నారట. ఈ విషయాలను స్వయంగా ప్రిన్స్‌ ఛార్లెస్‌ ఈ ప్రముఖ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరి ఇప్పుడైనా నమ్ముతారా..రాజుగారి కారు వైన్ తో నడుస్తుందని..

Wine Car4

Read more : Electric Cars: స్మూత్‌గా నడుస్తున్న ఎలక్ట్రిక్ కార్లు.. భారీగా పెరిగిన డిమాండ్.. రూ.15లక్షల్లోపు బడ్జెట్‌లో!

ఇకపోతే ప్రిన్స్ చార్లెస్ పై కాలుష్యం గురించి వచ్చిన వివాదంతో విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. ఇటీవల వాతావరణ కాలుష్యంపై ప్రపంచం అంతా గగ్గోలు పెడుతున్నా.. చార్లెస్‌ పెద్దగా స్పందిచలేదు. దీంతో ఆయనపై చాలా విమర్శలు వచ్చాయి. దీంతో తనపై ఉన్న ముద్రను చెరిపేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందరిలా ఎలక్ట్రిక్‌ కార్లు నడిపితే తన రాజకుటుంబ రేంజ్ ఏముంటుంది? అనుకున్నారో..లేదా మా రాయల్‌ రేంజ్‌ తగినట్లుగా ఉన్నారనుకున్నారోగానీ..‘గ్లోబల్‌ వార్మింగ్‌’ ప్రచారానికి ఊతం ఇచ్చేందుకు కర్బన ఉద్ఘారాలను వెదజల్లని వైన్‌ కారు ఫార్ములాను యువరాజు సెలెక్ట్ చేసుకున్నారు. రాజుగారి నిర్ణయంపై గ్లోబల్‌ లీడర్ల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాకపోయినాగానీ..ప్రిన్స్ మాత్రం సోషల్‌ మీడియాలో ఫన్నీ మీమ్స్‌ వెల్లువెత్తుతున్నాయి.

Read more : నో సౌండ్..నో పొల్యూషన్: హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు