Electric Cars: స్మూత్‌గా నడుస్తున్న ఎలక్ట్రిక్ కార్లు.. భారీగా పెరిగిన డిమాండ్.. రూ.15లక్షల్లోపు బడ్జెట్‌లో!

పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఎక్కువగా కనిపిస్తుంది.

Electric Cars: స్మూత్‌గా నడుస్తున్న ఎలక్ట్రిక్ కార్లు.. భారీగా పెరిగిన డిమాండ్.. రూ.15లక్షల్లోపు బడ్జెట్‌లో!

Electric Cars

Electric Cars: పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ కారు, బైక్‌ల విషయంలో వినియోగదారులు కూడా చాలా సంతృప్తిగా ఉండడంతో కొత్తగా కోనేవారి శాతం కూడా బాగా పెరుగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులు చాలా సాఫీగా కారును నడుపుకుంటున్నారు. ఎలక్ట్రిక్ కార్లలో అస్సలు శబ్దం రావట్లేదు. వైబ్రేషన్ లేదు, అలసట తక్కువగా అనిపిస్తుంది. వాహనం లోపల ఏసీ శబ్దం మాత్రమే వినిపిస్తుంది.

మను అగర్వాల్ ఎలక్ట్రిక్ కారు ఎందుకు కొన్నాడు? దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయని ఆయన చెప్పారు, “నా రోజువారీ డ్రైవ్ 70-80 కిమీలు, కొన్నిసార్లు 100 కిమీలు కూడా ఉంటుంది. కాబట్టి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఎల్లప్పుడూ పెరుగుతాయి కాబట్టి నా ప్రయాణ ఖర్చులో కొంత ఆదా చేయడానికి నేను ఆర్థిక మార్గం కోసం చూస్తున్నాను. పతనం.

ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జ్ చేస్తుండడం వల్ల పర్యావరణానికి హాని ఉండదు. పొగ రాదు.. కాబట్టి ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకునేందుకు ఎక్కువగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. పెద్ద కంపెనీలు కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టిపెట్టాయి. ముఖ్యంగా మిడిల్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్లు అంటే, 15లక్షల బడ్జెట్ లోపు కార్ల తయారీపై దృష్టి పెట్టాయి కంపెనీలు.

రూ. 15లక్షల లోపు బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ కార్లు:

1. టాటా టియాగో ఈవీ(Tata Tiago EV):
భారతదేశంలో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల తయారీని వేగంగా విస్తరిస్తోంది. అందులో భాగంగానే భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ కార్లలో టియాగో హ్యాచ్ బ్యాక్ కారు లాంచ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. టాటా టియాగో కొన్ని మార్పులతో టియాగో ఎలక్ట్రిక్ కారును త్వరలో మార్కెట్లోకి తీసుకారావాలని చూస్తుంది సంస్థ. ఎలక్ట్రిక్ కార్ల 6.5 లక్షలకు దగ్గరగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

2. టాటా ఆల్ట్రోజ్ EV(Tata Altroz EV):
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కేటగిరీలో రాబోతున్న ఈ కారును 2019లో స్విట్జర్లాండ్‌లో జెనీవా మోటార్ షోలో ఫస్ట్ టైమ్ ప్రదర్శించింది కంపెనీ. ఈ కారును వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయవచ్చు. టాటా ఆల్ట్రోజ్ EV డిజైన్ సాధారణ ఆల్ట్రోజ్‌ మాదిరిగానే ఉంటుంది. బంపర్ మాత్రం మారవచ్చు. ఆల్ట్రోజ్ EVని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కి.మీ నుంచి 300 కి.మీ మధ్య నడుస్తుంది. DC ఫాస్ట్ ఛార్జింగ్‌తో 80శాతం వరకు ఛార్జ్ చేయడానికి బ్యాటరీకి గంట టైమ్ పడుతుంది. సాధారణ పవర్ సాకెట్‌‌తో ఛార్జ్ చేయడానికి 8 గంటలు పడుతుంది. టాటా ఆల్ట్రోజ్ ఈవీ ధర ₹10.5 లక్షల నుంచి ₹12.5 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

3. మహీంద్రా eKUV100(Mahindra eKUV100):
ఆటో ఎక్స్ పో 2020లో మహీంద్రా eKUV100 ధరను ప్రకటించింది మహింద్ర సంస్థ. ఆ సమయంలో మహీంద్రా & మహీంద్రా eKUV100 ధర రూ. 8.25లక్షల(ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుందని వెల్లడించింది సంస్థ. త్వరలో రాబోయే మహీంద్రా eKUV100 లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్, 54BHP, 120NM గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌తో రానుంది. మహీంద్రా eKUV100 సింగిల్ ఛార్జ్‌పై 147కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌లో నడుస్తుంది. దీనిని ఒక గంటలో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

4. మహీంద్రా ఈఎక్స్‌యూవీ300(Mahindra eXUV300):
రాబోయే సంవత్సర కాలంలో చూడబోయే మరో మహీంద్రా ఈవీ కారు మహీంద్రా eXUV300. ఈ కారును ఆటో ఎక్స్ పో 2020లో ప్రదర్శించగా.. రెండు బ్యాటరీ ఆప్షన్లతో రాబోతున్న ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300కిలోమీటర్ల వరకు వెళ్తుంది. మహీంద్రా eXUV300 లాంగ్ రేంజ్ మోడల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్లు వెళ్లవచ్చు. భారతదేశంలో Mahindra eXUV300 కారు ధరలు సుమారు 12లక్షల 50వేల రూపాల వరకు ఉండవచ్చు.