Toddler adjusting her crown : స్టేజీ మీద చిన్నారి సమయస్ఫూర్తి..ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే

స్టేజీ మీద చిన్నారి చూపిన సమసయస్ఫూర్తి చూస్తే. .ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ర్యాంప్ వాక్ చేస్తుండగా ఆ చిన్నారి చెప్పు ఊడిపోయింది. తలపై కిరీటం పడిపోయింది. అయినా ఆ చిన్నారి తడబడలేదు

Toddler adjusting her crown : స్టేజీ మీద చిన్నారి సమయస్ఫూర్తి..ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే

Toddler Adjusting Her Crown On Ramp Like A Boss Wins

toddler adjusting her crown on stage :  స్టేజీపై మోడల్స్ ర్యాంప్ వాక్ చేసే సమయంలో కొన్ని అనుకోని ఘటనలు జరుగుతుంటాయి.హీల్స్ స్లిప్ అవ్వటం. నడిచేటప్పుడు కొన్నిసార్లు వారి డ్రెస్ జారిపోవటం వంటివి జరుగుతుంటాయి. అయినా వారు తడబడకుండా నడుతుంటారు. అదే చిన్నారులైతే కంగారుపడతారు. భయపడతారు. కానీ ఓచిన్నారి మాత్రం ఏమాత్రం అదరలేదు బెదరలేదు. అసలేమీ జరగనట్లే చక్కగా ధీమామా తన వాకింగ్ ని కంటిన్యూ చేసింది. ఈ చిన్నారి సమయస్ఫూర్తికి వీక్షకులనే కాదు నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు. తెల్లటి దుస్తుల్లో ఏజెంల్స్ లా ఉన్న ఇద్దరు చిన్నారులు స్టేజీమీద వాక్ చేస్తుండగా జరిగిన ఘటనకు జనాలు ఫిదా అవుతున్నారు.

Read more : China Toys Danger : చైనా బొమ్మల్లో ప్రమాదకర రసాయనాలు..చిన్నారుల ప్రాణాలకు ప్రమాదమంటున్న నిపుణులు

స్టేజీమీద ఇద్దరు చిన్నారులు ర్యాంప్‌ వాక్‌ చేస్తుంటారు. తెల్ల దుస్తుల్లో ఎంతో క్యూట్‌గా ఉంటారు చిన్నారులు. అలా వాక్‌ చేస్తుండగా ఉన్నట్టుండి పాప చెప్పు ఉడిపోతుంది. దాన్ని సరిచేసుకుంటుండగా.. తల మీద ఉన్న కిరీటం కూడా జారిపోతుంది. ఈ సంఘటన చూసి అక్కడున్న పెద్దలంతా ఒక్కసారిగా నవ్వుతారు. కూడా ఉన్న పిల్లాడు నవ్వుతాడు.

కానీ ఆ పాప మాత్రం ఏమాత్రం తడబడలేదు. అలా జరగటం సర్వసాధారణం దీన్నెందుకు పట్టించుకుని తన వాకింగ్ ను డిస్ట్రబ్ చేసుకోవటం అనుకుంది. నవ్వినవారంతా ఆశ్చర్యపోయేలా ఆ చిన్నారి ఏ మాత్రం బెదరదు.. కంగారుపడలేదు. వెంటనే తన కిరీటాన్ని సరిచేసుకుంది. తర్వాత తన చెప్పు తొడుక్కుని ర్యాంప్‌ వాక్‌ పూర్తి చక్కగా కంప్లీట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

Read more : Wedding pics deleted : భోజనం చేయనివ్వలేదని..! పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన ఫొటోగ్రాఫర్

ఇది చూసిన నెటిజనులు.. ‘‘ఈ చిన్నారి ఉన్న ప్లేస్ లో పెద్దవారు ఉంటే కాస్తంత తడబడేవారేమో..కానీ ఈ చిన్నారి సమయస్ఫూర్తి మాత్రం అమోఘం అంటున్నారు.చిన్నారి ఎంతో ఆ‍త్మవిశ్వాసంతో.. ఏమాత్రం తడబడకుండా.. పరిస్థితిని చక్కదిద్దుకుని ముందుకు సాగింది. చిన్నపిల్లే అయినా చూసేవారంతా నవ్వినా ఏమాత్రం చలించకుండా చక్కగా సమయస్పూర్తిని ప్రదర్శించింది అంటూ భవిష్యత్తులో కూడా ఈ చిన్నారి ఇలానే పరిస్థితులకు తట్టుకుని ధైర్యంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటూ ప్రశంసిస్తున్నారు.

Read more : Wedding pics deleted : భోజనం చేయనివ్వలేదని..! పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన ఫొటోగ్రాఫర్