Wedding pics deleted : భోజనం చేయనివ్వలేదని..! పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన ఫొటోగ్రాఫర్

పెళ్లిలో ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్ ను భోజనం చేయకుండా వరుడు విసిగించాడు.దీంతో ఒళ్లు మండిన ఫోటోగ్రాఫర్ అప్పటి వరకు తాను తీసిన ఫోటోలన్నీ డిలీట్ చేసిపారేశాడు.దీంతో వరుడికి మతిపోయింది

Wedding pics deleted : భోజనం చేయనివ్వలేదని..! పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన ఫొటోగ్రాఫర్

Wedding Photos Deleted And Shocked Photographer

Wedding photos deleted and shocked photographer : పెళ్లి అంటే బంధువుల, స్నేహితులు, సందళ్లు ఇంత హడావిడిలో కూడా ఫోటో గ్రాఫర్లు వధు వరులను వారి స్నేహితుల్ని, బంధువుల్ని ఎవ్వరిని వదలకుండా కెమెరాలతో క్లిక్ మనిపిస్తారు. వధువరులకు జీవితంతం జ్ఞాపలను అందిస్తారు. ఎన్ని లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నా ఒకరోజులోనే లేదా రెండు మూడు రోజుల్లో ఆ సందడి పోతుంది. కానీ వధువరుల జీవితమంతా గుర్తుండిపోయేవి ఫోటోలే.బంధువులతోను..స్నేహితులతోను పెళ్లిలో తీయించుకున్న ఫోటోలు తీపి గుర్తులుగా మిగిలిపోతాయి. వారి జీవితాల్లో మధురానుభూతుల్ని నింపుతాయి. తరుచు వాటిని చూసుకుంటు పెళ్లినాటి తీపి గుర్తుల్ని తలచుకుని మురిసిపోతుంటారు. అలాంటి జ్ఞాపకాలను అందించే ఫోటో గ్రాఫర్లు ఫోటోలు తీయటానికి వీడియోలు తీయటానికి ఎంతో కష్టపడతారు.యాంగిల్స్ సెట్ చేసుకుంటు అందరిని కవర్ చేస్తు చాలా కష్టపడతారు. పెళ్లిళ్లలకు కాంట్రాక్టులు కుదుర్చుకుని పెళ్లిళ్లలో ఫోటోలు వీడియోలు తీస్తు వారి తిండి మాటే మర్చిపోతారు.

టీలు,టిఫిన్లు, భోజనాలు పానీయాలు ఇలా అన్ని మర్చిపోయే పెళ్లికి వచ్చే బంధువుల్ని, స్నేహితుల్ని,ఆత్మీయుల్ని ఫోటోలు వీడియోలు తీయటంలో బిజిబిజీగా ఉంటారు. వధు వరులు పెళ్లి మండలంలో ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి పెళ్లిళ్లలో పెట్టే భోజనాల వరకు అంత ఏదీ మిస్ అవ్వకుండా కవర్ చేస్తారు. అంత కష్టపడిన ఫోటో గ్రాఫర్లను గౌరవంగా చూసుకోవాలి. పెళ్లి గుర్తులు లేకుండా ఆ జ్ఞాపకాల జాడలే లేకుండాపోతాయి. అటువంటిదే జరిగింది ఓ పెళ్లిలో. ఫోటో గ్రాఫర్ కు పిలిచి భోజనం పెట్టలేదు సరికదా..భోజనం చేస్తానంటే కుదరదు ఇంకా ఫోటోలు తీయాలి అని అన్న వరుడికి సదరు ఫోటో గ్రాఫర్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. అప్పటి వరకు తను తీసిన ఫోటోలన్నీ డిలీట్ చేసి పారేశాడు…!! దీంతో సదరు వరుడికి దిమ్మతిరిగిపోయింది..!!

Read more : Friendship parrot : స్కూల్ పిల్లలతో దోస్తీ చేస్తున్న చిలకమ్మ..‘నువ్వూ నేను ఓ జట్టు’అంటోంది

ఆ వివరాల్లోకి వెళితే..ఓ వరుడు తన పెళ్లి ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్‌తో 250 డాలర్లకు కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7:30 వరకు ఫొటోలు తీసేలా మాట్లాడుకున్నారు. ఫొటోగ్రాఫర్ తన పని తను చేసుకుంటున్నాడు. ఆ పనిలో పడి పాపం భోజనం కూడా చేయలేదనే సంగతి మర్చిపోయాడు. అలా సాయంత్రం 5గంటలు అయిపోయింది పాపం అప్పటికే అలసిపోయిన ఆ ఫోటో గ్రాఫర్ భోజనం చేద్దామనుకుని భోజనాలు పెట్టేచోటికి వచ్చాడు.కానీ పాపం అతడిని ఎవ్వరు పట్టించుకోలేదు.కనీసం తిన్నావా అని కూడా అడగలేదు.దీంతో అతను బాదపడ్డాడు.దాన్ని అవమానంగా భావించాడు. కానీ మిగితా వర్క్ పూర్తి చేయాలంటే భోజనం చేయాలి.అప్పటికే నీరసంతో పాపం అల్లాడిపోతున్నాడు. ఎవరన్నా తనను భోజనానికి పిలుస్తారని ఎదురు చూసాడు.కానీ ఎవ్వరు పిలవలేదు.దీంతో అప్పటికే ఆకలితో ఉన్న అతను వరుడి దగ్గరకు వెళ్లి.. తనకు భోజనం చేయాలి కాస్త బ్రేక్ తీసుకుంటానని చెప్పాడు. దానికి వరుడు ఏమాత్రం అంగీకరించలేదు.ఇంకా ఫోటోలు తీయాల్సిందనంటూ పట్టుపట్టాడు.

దీంతో అసలే నీరసనంతో ఉన్న సదరు ఫొటోగ్రాఫర్ కి ఓపిన నశించిపోయింది..ఏంటీ కనీసం భోజనం చేయమని చెప్పకపోగా..సిగ్గు విడిచి నేనే భోజనం చేయాలని అని అడిగితే కుదరదు అంటావా?చూడు ఏం చేస్తానో అంటూ అప్పటివరకూ తీసిన ఫొటోలన్నింటినీ డిలీట్ చేసేపారేశాడు. దీంతో వరుడికి దిమ్మతిరిగిపోయింది. వెంటనే కోపం పొంగుకొచ్చింది. ఫొటోగ్రాఫర్‌ను నిలదీశారు. దాంతో ఇంకా తిక్కరేగిపోయిన సదరు ఫోటో గ్రాఫర్ ‘‘హోటల్లో పది నిముషాలు కూర్చుని..ఏది తిన్నా 250 డాలర్లు అవుతుందని.. అలాంటిది అంత పెద్ద వివాహం చేస్తూ.. తనకు కనీసం భోజనం పెట్టలేదని’’ ఫొటోగ్రాఫర్ వాపోయాడు. కనీసం తాగటానికి ఓ గ్లాస్ వాటర్ కూడా ఇవ్వలేదని వాపోయాడు. అందుకే ఈ కాంట్రాక్టు వద్దు వీరి భోజనం అక్కర్లేదు అంటూ ఏం జరిగితే అది జరిగిందిలే అనుకుని ఫోటోలన్నీ డిలీట్ చేసేసాను ఏం చేస్తావో చేస్కో మంటూతెగేసి చెప్పేశాడు. దీంతో సదరు పెళ్లివారికి వరుడికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది.

Read more : Tribe Dangerous feat : కడుపు నింపుకోవటానికి ప్రాణాలు పణంగా పెడుతున్న గిరిజనులు

దీని గురించి సదరు ఫోటో గ్రాఫర్ మాట్లాడుతు..‘అసలు తను వృత్తి పరంగా ఫొటోగ్రాఫరే కాదని.. కుక్కలు పెంచడం తనకు హామీ అనీ..వాటిని ఫొటోలు తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటానని.. తన ఫ్రెండ్ బిజీగా ఉండడంతో తనను పంపించాడని తెలిపాడు. తర్వాత అతడు తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పలువురు నెటిజన్లు.. ఫొటోగ్రాఫర్‌కు మద్దతు ఇస్తుంటే మరికొందరు ఎంత కోపమొస్తే మాత్రం అలా ఫొటోలు డిలీట్ చేయకూడదని అంటున్నారు.