Tribe Dangerous feat : కడుపు నింపుకోవటానికి ప్రాణాలు పణంగా పెడుతున్న గిరిజనులు

ఒడిశాలోని ముండ‌పోత కేల తెగకు చెందిన గిరిజనులు ‘బుక్కెడు బువ్వ కోసం..గుక్కెడు నీళ్ల కోసం ప్రాణాల‌నే ఫ‌ణంగా పెడుతున్నారు. వారిప్రదర్శనలు చూస్తే శ‌రీరంపై రొమాలు నిక్క‌పొడుచుకోవల్సిందే

Tribe Dangerous feat : కడుపు నింపుకోవటానికి ప్రాణాలు పణంగా పెడుతున్న గిరిజనులు

New Project

Tribe Dangerous feat : గిరిజనులు. అడవితల్లిని నమ్ముకుని జీవించే బిడ్డలు. కొన్ని తెగలకు చెందిన గిరిజనులు సంచార జీవులుగా ఉంటారు. ఊరూ వాడా తిరుగుతుంటారు. వేరే రాష్ట్రాలకు కూడా వలసపోతుంటారు. అక్కడ వారి ప్రదర్శనలతో కడుపు నింపుకుంటుంటారు. అటువంటి వలస జీవులు గడ్డు పరిస్థితుల్లో ఉన్నారు.  ఆకలితో అలమటిస్తున్నారు. కరోనాతో ఎంతోమంది బతుకులు మారిపోయినట్లే గిరిజనులు కూడా ఆకలి కేకలు పెడుతున్నారు. వారిక ఆకలికేకలు అరణ్యరోదనలే అవుతున్నాయి. దీంతో వారు కడుపు నింపుకోవటం కోసం ప్రాణాల్ని పణ్ణంగా పెట్టే విద్యలను ప్రదర్శిస్తున్నారు.వీరి చేసే విన్యాసాలు..ప్రదర్శనలు చూస్తే శరీరంపై రోమాలు నిక్కబొడుకుంటాయి. వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తుంది

కూటి కోసం కోటి విద్యాలు శతకోటి క‌ష్టాలు అన్న‌ట్లుగా ఒడిశాలోని ముండ‌పోత కేల తెగకు చెందిన గిరిజనులు ‘బుక్కెడు బువ్వ కోసం..గుక్కెడు మంచినీళ్ల కోసం ప్రాణాల‌నే ఫ‌ణంగా పెడుతున్నారు. త‌మ‌కు వ‌చ్చిన విద్య‌ను ప్ర‌ద‌ర్శించి..కడుపు నింపుకోవాల్సిన దుస్థితిలో ఉన్నారు. వీరు చేసే ప్రదర్శనల్లో ఏమాత్రం తేడా వచ్చినా..ఏ మాత్రం బెడిసికొట్టినా..ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కాదు కాదు ప్రాణాలు మన్నులో కలిసిపోతాయి. ఆకలి తీర్చుకోవటానికి వారి కుటుంబం ఆకలి తీర్చటానికి గిరిజనులు చేసే ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను చూస్తే మ‌న శ‌రీరంపై రొమాలు నిక్క‌పొడ‌ుచుకుంటాయి.

Read more : వింత ఆచారం : చనిపోయినవారి ఎముకల్ని కాల్చి సూప్ చేసుకుని తాగాలి

ఒడిశాలోని ముండ‌పోత కేల తెగ ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం చేత గుర్తించ‌బ‌డ‌లేదు. కరోనాకు ముందు జీవ‌నం బాగానేఉండేది. కానీ కరోనా తరువాత వారి బతుకులు దుర్భరంగా మారిపోయాయి. క‌రోనా ప‌రిస్థితుల అనంత‌రం వారి జీవ‌న చిత్రం ఛిద్ర‌మైపోయింది. దీంతో మ‌ళ్లీ త‌మకు వ‌చ్చిన విద్య‌తోనే క‌నీస అవ‌స‌రాలు తీరాల‌న్న‌, క‌డుపు నిండాల‌న్న త‌మ‌కున్న నైపుణ్యంతో ఆ విద్య‌ను ప్ర‌ద‌ర్శించక త‌ప్ప‌డం లేదు. అటువంటి ప్రదర్శనల్లో ఒకటి వారు వెల్లకిల్లా పడుకుని తలకింద చిన్న గుంత తీసి ఆ గుంతలో తల పెట్టి మెడవరకు మట్టితో కప్పేస్తారు. అలా కొంతసేపు ఉండిపోతారు. కానీ ఈ ప్రదర్శన చాలా ప్రమాదం. ఊపిరి ఆడదు. ఊపిరి బిగబట్టి ఉండాలి. లేదంటే మట్టి ముక్కులోకి నోటిలోకి కళ్లల్లోకి పోయి ప్రమాదమే తప్పదు. కానీ బతకటం కోసం తినాలిగా..తినాలంటే ఇటువంటి ప్రదర్శనలు తప్పటంలేదని..తమకు ఇంతకంటే వేరే దారి లేదని వాపోతున్నారు ముండపోత కేల తెగ గిరిజనులు.

ఇలా శ్వాస‌పైనే దృష్టి పెట్టి అలా కొన్ని నిమిషాలపాటు ఉండిపోతారు. వారి ధైర్య‌సాహ‌సాలు, ప్ర‌ద‌ర్శ‌న‌కు మెచ్చి.. గ్రామ‌స్తులు కొంత ఆర్థిక సాయం చేస్తూ, బియ్యం, కూర‌గాయ‌లు ఇస్తుంటారు. దాంతో వారు క‌డుపు నింపుకొని జీవనం సాగించ‌డం అల‌వాటుగా మారిపోయింది. అయితే ఇప్పుడున్న ఈ విద్య‌పై ఏమాత్రం ఆసక్తి చూపట్లేదు. ఏదోరకంగా కష్టపడి జీవనం సాగిస్తున్నారు. కానీ కరోనా తరువాత వీరు ఎంతగా ఇటువంటి ప్రదర్శనలు చేసినా పెద్దగా సహాయాలు రావట్లేదట.

Read more : Wild Bird : 6 అడుగుల ఎత్తు,కత్తుల్లాంటి గోళ్లు..మనుషుల్ని చీల్చి చంపేసే పక్షి గురించి షాకింగ్ విషయాలు

ఈ విద్య గురించి తమ పరిస్థితి గురించి మురళీ షికారీ అనే ఓ గిరిజనుడు మాట్లాడుతు..ఈ విద్య ప్ర‌ద‌ర్శించ‌డం త‌మ ప్రాణాల‌కే హానీ.. కానీ బ‌తుకుదెరువు కోసం చేయ‌క త‌ప్ప‌ట్లేదని వాపోయాడు. మ‌ట్టిలో గుంత త‌వ్వి అందులో త‌ల పెడుతాం. త‌మ త‌ల‌పై మ‌ట్టి క‌ప్పి ఉంచుతారు. ఆ స‌మ‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు పాటించాలి. క‌ళ్లు, చెవులు, నోరు, ముక్కులోకి మ‌ట్టి వెళ్ల‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. లేక‌పోతే ప్రాణాల‌కే ప్ర‌మాదం. శ్వాస‌ను కేంద్రీక‌రించ‌డంతోనే ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంద‌న్నాడు ముర‌ళీ షికారీ.