Wild Bird : 6 అడుగుల ఎత్తు,కత్తుల్లాంటి గోళ్లు..మనుషుల్ని చీల్చి చంపేసే పక్షి గురించి షాకింగ్ విషయాలు

6 అడుగుల ఎత్తు,కత్తుల్లాంటి గోళ్లు..మనుషుల్ని చీల్చి చంపేసే పక్షి గురించితెలిస్తే ఒళ్లు జలదరిస్తుంది. తనుపెంచుకునే యజమానినే గోళ్లతో చీల్చి చంపేసిన రాకాసి పక్షి గురించి ఎన్ని వింతలో

Wild Bird : 6 అడుగుల ఎత్తు,కత్తుల్లాంటి గోళ్లు..మనుషుల్ని చీల్చి చంపేసే పక్షి గురించి షాకింగ్ విషయాలు

Cassowary Bird (1)

Shocking facts about the  cassowary Wild bird : ఈ భూమ్మీద మనుషులతో పాటు కోటానుకోట్ల జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి. కానీ..ప్రకృతి విపత్తులతో కొన్ని అరుదైన అద్భుతమైన భయంకరమైన జీవులు అంతరించిపోగా..ప్రస్తుతం మనిషి చేసే తప్పిదాల వల్ల ఎన్నో అరుదైన ప్రాణులు,జంతువులు,కీటకాలు అంతరించిపోయాయి. అంతరించిపోయే దశలో చాలానే ఉన్నాయి. కానీ అంతరించిపోయిన భారీ జీవుల్ని అంటే డైనోసార్లు వంటివాటిని ఇప్పుడు మనం సినిమాల్లో మాత్రమే చూస్తున్నాం యానిమేషన్ రూపాల్లో. అలాగే పరిశోధకులు జరిపే తవ్వకాల్లో వాటి శిలాజాలను చూస్తున్నాం.

కాగా..ఈ భూమ్మీద రాక్షస బల్లులు అని చెప్పుకునే డైనోసార్లే కాకుండా మనిషికంటే పొడవుగా ఆరు అడుగుల పొడుగు ఉండే ఓ భయంకరమైన పక్షి గురించి మాత్రం పెద్దగా ఎవ్వరికి తెలియదు. ఆ పక్షి గోళ్లు పదునైన కత్తుల్లా ఉండేవట. ఆ గోళ్లతో మనుషుల్ని చీల్చీ చెండాడి చంపేసేదట..!! ఆ భయంకరమైన పక్షి పేరు ‘కాస్సోవరీ’. ఈ పక్షిని రాక్షస బల్లులకు వారసత్వం అని అంటారు.అటువంటి పక్షిగురించి వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అసలు ఆరు అడుగుల పొడుగు ఉండే పక్షా అని ఆశ్చర్యపోతాం. అంటే మనం ఇప్పుడు పక్షులన్నింటిలోను అతి పెద్దది అని చెప్పుకునే నిప్పుకోడి (ఆస్ట్రిచ్) కంటే పెద్దదన్నమాట…!!

Read more : Gang war in Prison: జైలులో గ్యాంగ్‌ వార్‌..116కు చేరిన మృతులు

పరిశోధకలు తవ్వకాల్లో బయటపడిన కోట్ల ఏళ్ల కిందటి శిలాజం ఒకటి..కోట్లాది సంవత్సరాల నాటి జీవికి ప్రతిరూపం ఇంకోటి. రెండూ ప్రమాదమే. రెండూ అత్యంత భయానకమైనవే. ఒకదాని ఆనవాళ్లను పరిశోధకులు తాజాగా కనుగొనగా.. మరోటి ఎప్పట్నుంచో మన మధ్యే ఉన్నా దానికి సంబంధించిన కొత్త సంగతులు ఇప్పుడే బయటపడ్డాయి. ఈ రెండింటిలో ఒకటి ‘సెరాటోసుచోప్స్‌ ఇన్ఫెరోడియోస్‌’ అనే రాక్షసబల్లి. మరోటి ఆ రాక్షస బల్లుల వారసత్వంగా మిగిలిన ‘కాస్సోవరీ’ అనే అరు అడుగుల పొడుగుతో కత్తుల్లాంటి పదునైన గోళ్లతో ఉండే పక్షి. ఈ విశేషాలు వివరాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

రెండు కొత్త డైనోసార్లు
ఖడ్గమృగం లాంటి బలమైన కొమ్ము.. మొసలిలాంటి తల..పది మీటర్ల పొడవు.. శత్రువులను చీల్చేసే బలమైన కోరలు ఇవీ ఓ భయంకరమైన కొత్త డైనోసార్‌ ని వర్ణిస్తే కళ్లముందు కదలాడే రూపం. ఇటీవలే యూనివర్సిటీ ఆఫ్‌ సౌతాంప్టన్‌ సైంటిస్టులు ఇంగ్లండ్‌ పరిధిలోని ‘ఐసిల్‌ ఆఫ్‌ వెయిట్‌’ ద్వీపంలో దీనికి సంబంధించిన శిలాజాలను కనుగొన్నారు.

దానికి ‘సెరాటోసుచోప్స్‌ ఇన్ఫెరోడియోస్‌’ అని పేరుపెట్టారు. అదేకాకుండా మరో కొత్త డైనోసార్‌కు ‘రిపరోవెనటార్‌ మిల్నెరీ’ అని పేరుపెట్టారు. 12.5 కోట్ల ఏళ్ల కింద ఇవి భూమ్మీద యదేశ్చగా తిరుగాడాయని.. వీటిలో సెరాటోసుచోప్స్‌ భయంకరమైనదని పరిశోధలనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త క్రిస్‌ బార్కర్‌ వెల్లడించారు. వీటి పొడవు 29 అడుగుల వరకు ఉంటుందని..అందులో తల పొడవే ఏకంగా 3 అడుగులు అంటే ఒక మీటరు పొడవు ఉంటుందని తెలిపారు. హెరోన్‌గా పిలిచే ఓ కొంగ వంటి పక్షి తరహాలో ఈ రెండు డైనోసార్లు కూడా చేపలను, ఇతర జంతువులను వేటాడి ఉంటాయని పరిశోధకులు అంచనా వేశారు.

Read more : Lottery Winner Dead : 33 లక్షలు గెలుపొందిన లాటరీ టికెట్‌తో కొట్టుకొచ్చిన మృతదేహం..షాక్ అయిన పోలీసులు

వింతలకు నియలం ఇంగ్లండ్ ‘ఐసిల్‌’ ఆఫ్‌ వెయిట్‌ ద్వీపం.
ఇంగ్లండ్‌ పరిధిలోని ఐసిల్‌ ఆఫ్‌ వెయిట్‌ అనే ద్వీపం వింతలకు విశేషాలకు నిలయంగా ఉంది. ఈ ద్వీపంలో ఎన్నో పురాతన శిలాజాలకు, వింతలకు ఆలవాలంగా ఉంది. ఇక్కడే పరిశోధకలు కోట్ల ఏళ్లనాటి శిలాజాలను ఎన్నో గుర్తించారు. మనం చెరువుల్లో, నదుల్లో ఉండే నత్తలు నాలుగైదు అంగుళాలుంటాయి. కానీ ఐసిల్‌ ద్వీపంలో లభ్యమైన నత్తలు 20 అంగుళాలు ఉండేవట. కోట్ల ఏళ్లనాటి భారీ అమ్మోనైట్‌ (నత్త గుల్ల వంటి జీవి) శిలాజాన్ని 2020లో పరిశోధకులు గుర్తించారు. 20 అంగుళాలు ఉన్న ఈ శిలాజం 95 కిలోలకుపైగా బరువు ఉంది. అంటే ఆ నత్తలు ఎంత భారీగా ఉండేవో అర్థం చేసుకోవచ్చు.ఈ ద్వీపంలో నీయోవెనటర్, టెరోసార్‌ వంటి డైనోసార్లు, సూపర్‌టెరోసార్‌గా పిలిచే భారీ డైనోసార్‌ పక్షి, కాకి పరిమాణంలో ఉండే మరో చిన్న డైనోసార్‌ పక్షి, కోట్ల ఏళ్ల నాటి మొసళ్లు, ఇతర జీవుల శిలాజాలను పరిశోధకులు గుర్తించారు. వాటన్నింటితో ఓ మ్యూజియం ద్వారా వీటిని సాధారణ ప్రజలు చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

డైనోసార్లను మరిపించే భారీ పక్షి.. ‘కాస్సోవరీ’
డైనోసార్లు ఎంత భారీ ఆకారంలో ఉంటాయో సినిమాల్లో చూశాం. అలాగే వాటి శిలాజాల ద్వారా వాటి ఆకారాన్ని అంచనా వేస్తున్నాం. కానీ కాస్సో వరీ అనే భారీ పక్షిని చూస్తే డైనోసార్లే గుర్తుకొస్తాయి. పొడవైన ముక్కు.. రెండు కాళ్లకు కత్తుల్లాంటి పొడవాటి పదునైన గోళ్లు, డైనోసార్ల పోలికలతో ఉంటుంది ‘కాస్సోవరీ’గా పిలిచే ఈ పక్షి. ఇది అత్యంత ప్రమాదకరమైన పక్షి. చాలా వైల్డ్. ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపిస్తుంది. మనుషులు కోళ్లు, బాతులకంటే ముందు ఈ ‘కాస్సోవరీ’ పక్షులనే పెంచుకునేవారని పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు.

Read more : Food Challenge: రండీ బాబూ రండి.. ఈ ఎగ్ రోల్‌ 20 నిమిషాల్లో తినండి.. రూ.20,000 గెలుచుకోండి

ఆది మానవుల నివాస ప్రాంతాలపై సీరియస్ గా పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు కొన్ని రకాల గుడ్ల పెంకులు, పక్షుల ఎముకలు లభ్యమయ్యాయి. వాటిపై లేజర్‌ మైక్రోస్కొపీ, ఇతర పద్ధతుల్లో అధ్యయనం చేసి అవి కాస్సోవరీ పక్షులవేనని గుర్తించారు. ఈ అవశేషాల్లో కొన్ని గుడ్లను కాల్చుకుని తిన్నట్టుగా, మరికొన్ని పొదిగి పిల్లలు బయటికి వచ్చినట్టుగా తేల్చారు. సుమారు 18 వేల ఏళ్ల కింద ఆది మానవులు ఈ పక్షుల్ని గుడ్లు కోసం, మాంసం కోసం పెంచుకునేవారని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ క్రిస్టినా డగ్లస్‌ తెలిపారు.

ఆరు అడుగులో ఎత్తు..పదునైనా గోళ్లతో చీల్చేస్తుంది..!
ఈ కాస్సోవరీ పక్షి..ఏకంగా ఆరు అడుగుల ఎత్తు ఉండేదట. ఎత్తుకు తగిన బరువతో 59 కిలోలుండేదట. ఈ కాస్సోవరీ పక్షులు ప్రస్తుతం భూమ్మీద ఆస్ట్రిచ్‌ల తర్వాత అతిపెద్ద పక్షిజాతిగా చెప్పవచ్చని డగ్లస్‌ తెలిపారు. ఈ పక్షి ఇతర పక్షులు, జంతువులతోపాటు మనుషులను కూడా గోళ్లతో చీల్చేసే సామర్థ్యంగలిగినదని తెలిపారు.

యజమానిని చంపేసిన రాకాసి పక్షి
2019లో అమెరికాలోని ఫ్లారిడాలో ఒక కాస్సోవరీ పక్షి.. తనను పెంచుకుంటున్న మార్విన్‌ హజోస్‌ అనే వ్యక్తిని గోళ్లతో చీల్చి చంపేసింది. పర్యావరణ ప్రేమికుడు అయిన మార్విన్ హజోస్ తన ఎస్టేట్ లో ఈ పక్షితో పాటు మరో 100 రకాల పక్షులు, జంతువులను తన ఎస్టేట్‌లో పెంచేవారు. ఆయన మరణం తరువాత వాటన్నింటినీ వేలం వేశారు.