Lottery Winner Dead : 33 లక్షలు గెలుపొందిన లాటరీ టికెట్‌తో కొట్టుకొచ్చిన మృతదేహం..షాక్ అయిన పోలీసులు

అదృష్టం వరిస్తుందనే ఆశతో లాటరీ టిక్కెట్ కొన్నాడో వ్యక్తి. కానీ లాటరీ తగిలింది. ఆ ప్రైజ్ మనీ తీసుకోకుండానే ప్రాణలు వదిలాడు. అదృష్టం వరించినా దురదృష్టం వదల్లేదు అంటే ఇదేనేమో..

Lottery Winner Dead : 33 లక్షలు గెలుపొందిన లాటరీ టికెట్‌తో కొట్టుకొచ్చిన మృతదేహం..షాక్ అయిన పోలీసులు

Lottery Winner Dead With $45k Ticket In Pocket

Updated On : September 30, 2021 / 5:30 PM IST

Lottery Winner Dead with $45k ticket in pocket : ‘అదృష్టం వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేలోపు..దురదృష్టం వచ్చి లిప్ కిస్ పెట్టి వెళ్ళిపోయింది’అనే త్రివిక్రమ్ డైలాగ్ చక్కగా సరిపోతుంది ఓ వ్యక్తి. పాపం..అదృష్టం వరిస్తుందనే ఆశతో ఓ లాటరీ టిక్కెట్ కొన్నాడు.ఆశించనట్లుగానే ఆ టికెట్ కు లాటరీ తగిలింది. కానీ ఈలోపే ప్రాణాలు పోయాయి. మరి అతను దురదృష్టవంతుడు అనుకోవాలా? అదృష్టాన్ని అందుకోలేని దురదృష్టవంతుడు అనుకోవాలా? కొన్ని జీవితాలు అంతే అని మాత్రం అనుకోవాల్సి ఉంటుంది..మృతదేహంతో పాటు కొట్టుకొచ్చిన లాటరీ టికెట్టుని చూస్తే..

Read more : 160 టిక్కెట్లు కొంటే అన్నింటీకీ లాటరీ తగిలింది..!! అదృష్టానికి అతను కేరాఫ్ అడ్రస్ లా ఉన్నాడు

కెనడాలోని అంటారియో ప్రావిన్స్‌ పోలీసులు చెప్పిన మాటల్లో.. గత శుక్రవారం (సెప్టెంబర్ 24,2021) కెనడాలోని ఓ బీచ్‌లో ఓ మృతదేహం కనిపించింది. దాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.దాంతో అక్కడికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని వివరాలు ఏమైనా తెలుస్తాయేమోనని..మృతదేహాన్ని పరిశీలించారు. అతని వేసుకున్న దుస్తుల్లో వారికి ఓ లాటరీ టిక్కెట్టు కనిపించింది.

దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతని గురించి వివరాలు తెలుసుకోవటానికి దర్యాప్తు చేపట్టారు. దీంట్లో భాగంగా అతను 57 ఏళ్ల గ్రెగొరీ జార్విస్ అనే వ్యక్తిగా గుర్తించారు. అలాగే అతని వద్ద లభ్యమైన లాటరీ టిక్కెట్లుకు రూ.33 లక్షల 42వేలు లాటరీ గెలుపొందినట్లుగా తెలుసుకున్నారు. సముద్రంలో బోట్‌ అదుపు తప్పి..అతను మృతి చెందాడని..ఆ తరువాత అతని మృతదేహం బీచ్‌కు కొట్టుకొచ్చినట్లుగా గుర్తించారు.

Read more : క్యాన్సర్ పేషెంట్‌కు కోటిన్నర లాటరీ

కాగా గ్రెగొరీ అమెరికాలోని మిచిగాన్‌ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనీ..అతని మృతదేహం వద్ద లభించిన లాటరీ టికెట్‌ సెప్టెంబర్‌ నెల మొదట్లో కొన్నాడని..తెలిపారు పోలీసులు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అతని బంధువుల సమాచారం లభిస్తే ఆ లాటరీ టికెట్ ఇస్తామని తెలిపారు.