160 టిక్కెట్లు కొంటే అన్నింటీకీ లాటరీ తగిలింది..!! అదృష్టానికి అతను కేరాఫ్ అడ్రస్ లా ఉన్నాడు

Virginia Man buys 160 lottery tickets for one drawing, wins : వాడికేంటిరా..అదృష్టవంతుడు..లాటరీ తగిలింది. దెబ్బకు లక్షాధికారి అయిపోయాడు అని అనుకుంటాం. చాలామంది ఆశతో లాటరీ టికెట్లు కొంటుంటారు.కానీ దానికి ప్రైజ్ రావటం చాలా అరుదు. ఒకవేళ వచ్చిన ఎప్పుడోకసారి అదృష్టం కొద్దీ వస్తుంది. మహా అయితే రెండు సార్లు వస్తుంది. కానీ ఓ యువకుడు కొన్న ‘160 లాటరీ టిక్కెట్ల’’కు ప్రైజ్ మనీ తగిలింది.
దీంతో అతను ఏకంగా లక్షాధికారి కాదు కోటీశ్వరుడైపోయాడు. లక్ లక్కలాగా అతుక్కోవటమంటే ఇదేనేమో అనుకునేలా అతను కొన్న 16 టిక్కెట్లకు లాటరీ తగిలింది. నమ్మటానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా జరిగింది నిజం. అతన్ని చూడగా..అదృష్టానికి కేరాఫ్ అడ్రస్ లా ఉన్న అతని పేరు క్వామే క్రాస్.
వివరాల్లోకి వెళితే.. వర్జీనియా చెందిన క్వామే క్రాస్ డిసెంబర్ 5న ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 160 లాటరీ టికెట్లను కొన్నాడు. ఒకదానికి కాకపోతే మరోదానికైనా తగలకపోతుందా? నన్ను అదృష్టం ఒక్క టిక్కెట్ రూపంలో అయిన వరించకపోతుందా? అనే ఆశతో 1,3,4,7 అంకెలు కలిగి ఉన్న 160 లాటరీ టికెట్లు కొన్నాడు.
ఆ టికెట్లకు సంబంధించి డిసెంబర్ 7న డ్రా తీయగా..క్వామే క్రాస్ కొన్న ప్రతి టికెట్ కి లాటరీ తగిలింది. మొత్తం 160 టికెట్లకు తగిలింది. దీంతో అతని ఆశ్చర్యానికి ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. ఇది కలా నిజమా? అనుకునే ఒకటే ఆశ్చర్యపోయాడు. తాను కొన్న 160 టిక్కెట్లలో ఒక్కదానికైనా తగలకపోతుందా? అనుకుంటే మొత్తం అన్నింటికి లాటరీ తగలటంతో ఉబ్బి తబ్బిబైపోయాడు.
ఈ సందర్భంగా క్వామే క్రాస్ మాట్లాడుతూ..నేను ఒక టీవీ షో చూస్తున్నప్పుడు తనకు లాటరీ తగిలినట్లుగా తెలుసుకుని చాలా చాలా సంతోషపడ్డాను. 7314 నెంబర్ కి లాటరీ వచ్చే అవకాశం ఉందని చెప్పడంతో నేను అలానే చేశాను. ఆ తరువా తాను కొన్న ప్రతి లాటరీ తగిలిందని చెప్పడంతో చాల ఆశ్చర్యపోయాను. చెప్పలేనంత సంతోషం కలిగింది. ఇది కల నిజమా అని ఒకటి పది సార్లు చెక్ చేసుకున్నాను.
కాగా క్వామే కొన్న 160 టికెట్ల బహుమతి విలువ మొత్తం $8,00,000 అంటే మన కరెన్సీలో రూ.5.89 కోట్లు. తను కొన్న ఒక్క టికెట్ అయిన లాటరీ తగిలితే ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ పెడదామని అనుకున్నాని క్వామే చెప్పాడు. మరి ఇప్పుడు ఏకంగా రూ.5.89 కోట్లు గెలవడంతో అతను సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఆ డబ్బుతో ఏం చేయాలనేదానిపై ఇంకా నిర్ణయించుకోలేదని..చెప్పాడు.
కాగా..గతంలో ఒక సంఘటనలో రేమండ్ హారింగ్టన్ అనే వ్యక్తి 25 లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేసి 25 సార్లు గెలిచి 1,25,000 డాలర్లు లభించాయి. మరో సందర్బంలో మిచ్ గాన్ కు చెందిన సమీర్ మజాహెమ్ అనే వ్యక్తి కొన్న రెండు లాటరీ టికెట్లకు డ్రాలో లాటరీ తగిలి 1 మిలియన్ డాలర్లు సొంతం చేసుకున్నాడు.