Food Challenge: రండీ బాబూ రండి.. ఈ ఎగ్ రోల్ 20 నిమిషాల్లో తినండి.. రూ.20,000 గెలుచుకోండి
ఢిల్లీ మోడల్ టౌన్ థర్డ్‌లో ఓ పుడ్ స్టాల్ యజమాని తను తయారు చేసిన కథీ రోల్‌ని 20 నిమిషాల్లో తిని 20 వేలు గెలుచుకోండీ అంటూ రోడ్డుమీద సవాల్ విసురుతు అందరినీ ఆకర్షిస్తున్నాడు.

10kg Kathi Roll 30 Eggs 20 Minutes Get Prize
10kg Kathi Roll 30 Eggs 20 Minutes Get Prize : 4 కిలోల నాన్ వెజ్ థాలీని 60 నిమిషాల్లో తింటే రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ బహుమతిగా ఇస్తామని గతంలో పూణెలోని ఓ రెస్టారెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ రోడ్డు పక్క ఫుడ్ స్టాల్ నడిపే వ్యక్తి భోజన ప్రియులకు ఓ ఛాలెంజ్ విసిరాడు. తన ఛాలెంజ్ ను సక్సెస్ ఫుల్ చేస్తే రూ.20,000లు ఇస్తానని ఆఫర్ కూడా ఇచ్చాడు. మరి ఇంతకీ ఆయన విసిరే ఆ ఫుడ్ ఛాలెంజ్ ఏంటీ..ఏం తినాలి?ఎంత సేపట్లో తినాలి అంటే..
ఓ కథీ రోల్‌ని 20 నిమిషాల్లో తిని 20 వేలు గెలుచుకోండీ అంటూ రోడ్డుమీద సవాల్ విసురుతూ అందరినీ ఆకర్షిస్తున్నాడు. ఢిల్లీ మోడల్ టౌన్ థర్డ్‌లో ఓ పుడ్ స్టాల్ యజమాని తను తయారు చేసిన 10 కేజీల బాహుబలి కాథీ రోల్‌ను కేవలం 20 నిమిషాల్లో తింటే రూ.20,000 ఇస్తానని పుడ్ లవర్స్‌కి బంఫర్ ప్రకటించాడు. ఇక ఆ రోల్ మేకింగ్ వీడియోని సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ ఛాలెంజ్‌కి ఎవరైనా రావచ్చని తెలిపాడు. ఆ రోల్‌ని.. గోధుమపిండితో తయారుచేసి దాంట్లో 30 గుడ్లు ఆమ్లెట్‌గా వేశాడు. ఆ తరువాత నూడుల్స్, కబాబ్స్, సోయా ఛాప్‌తో మస్తుగా కళ్లనిండుగా తయారుచేశాడు ఆ కాథీ రోల్ . దాన్ని ఓ సిల్వర్ పేపర్ లో చుట్టు ‘రండీ ఇది తినండీ రూ. 20వేలు గెలుచుకోండి’ అంటూ ఛాలెంజ్ చేస్తున్నాడు.
Read more : బంపర్ ఆఫర్ : భోజనం తినండి, రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ గెలుచుకోండి
ఆ రోల్ చూస్తుంటే ఎవరికైనా.. నోరు ఊరాల్సిందే. తినాలని ట్రై చేస్తే మాత్రం అయ్యే పనిలా కనిపించట్లేది దాని సైజ్ చూస్తే..ఎందుకంటే ఆ రోల్ 10 కేజీలు బరువు ఉంది. దీన్ని తయారు చేసే విధానాన్ని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారి పుడ్ లవర్స్‌ని నోరూరిస్తోంది. ఛాలెంజ్ ఇంట్రెస్ట్ గానే ఉంది..పైగా రోల్ నోరూరిస్తోంది. కానీ ఆ ఛాలెంజ్ ను సక్సెస్ చేయటం అంటే మాటలు కాదురా బాబూ అని మాత్రం అనిపిస్తోంది దాన్ని సైజ్ చూస్తే..అదే మరి బాహుబలి రోల్ ఛాలెంజ్. ఈ బాహుబలి రోల్‌ని 20 నిమిషాల్లో తింటే రూ.20,000లు ఇస్తానంటున్నాడీ స్టాల్ ఓనర్. ఎవరు తింటారులే దీన్ని అనే నమ్మకంతోనే ఆ సవాల్ విసురుతున్నాడు.
Read more : Rice Bucket Challenge : హైదరాబాద్ మహిళ “రైస్ బకెట్ ఛాలెంజ్”..కరోనా కష్టంలో ఉన్నవారికి భరోసా..
View this post on Instagram