Rice Bucket Challenge : హైదరాబాద్ మహిళ “రైస్ బకెట్ ఛాలెంజ్”..కరోనా కష్టంలో ఉన్నవారికి భరోసా..

‘ఐస్ బకెట్ ఛాలెంజ్’ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. కానీ దానికంటే ఈకరోనా కష్టంలో ‘రైస్ బకెట్ ఛాలెంజ్’వల్ల ఎంతోమంది ఆకలి తీరుతుందని ఆలోచించారు హైదరాబాద్ కు చెందిన మంజులతా కళానిధి అనే మహిళ. ఈ ‘రైస్ బకెట్ ఛాలెంజ్’ ఈ కరోనా కష్టంలో ఎంతోమందికి ఆకలి తీరుస్తోంది. అవసరాలు తీరుస్తోంది. కష్టంలో ఉన్నవారికి మేమున్నామంటోంది.

Rice Bucket Challenge : హైదరాబాద్ మహిళ “రైస్ బకెట్ ఛాలెంజ్”..కరోనా కష్టంలో ఉన్నవారికి భరోసా..

Manju Latha Kalanidhi Rice Bucket Challenge

Manju Latha Kalanidhi Rice Bucket Challenge : కరోనా వల్ల ఎంతోమంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కష్టం ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి. తినటానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాయి ఎన్నో కుటుంబాలు. ఆకలితో అల్లాడిపోతున్నాయి. వారికి మనం ఏం చేసి వారి కడుపులు నింపాలి? అని ఆలోచించే తీరికే లేదు మనలో చాలామందికి. కానీ హైదరాబాద్ కు చెందిన మంజులతా కళానిధి అనే మహిళ అలా అనుకోలేదు. మనవంతుగా కరోనా కష్టంలో ఉన్నవారికి ఏం చేయాలా అని ఆలోచించింది. మంచి ఉద్ధేశ్యం ఉండాలేగానీ అది నెరవేరకుండాపోతుందా? చెప్పండీ పైగా అన్నార్తులకు ఆకలి తీర్చాలనే పెద్ద మనస్సుతో ఆలోచిస్తే కచ్చితంగా అయి తీరుతుంది.

ఒకప్పుడు ‘ఐస్ బకెట్ ఛాలెంజ్’ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. కానీ దానికంటే ఈకరోనా కష్టంలో ‘రైస్ బకెట్ ఛాలెంజ్’వల్ల ఎంతోమంది ఆకలి తీరుతుందని ఆలోచించారు హైదరాబాద్ కు చెందిన మంజులతా కళానిధి అనే మహిళ. నేడు సోషల్ మీడియా ఎంతగా ట్రెండ్ అయ్యిందో తెలియనిది కాదు..తన ‘రైస్ బకెట్ ఛాలెంజ్’ను సోషల్ మీడియానే వేదికగా చేసుకున్నారు మంజులత. ‘రైస్ బకెట్ ఛాలెంజ్’కు అంతా కలిసి కట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియా ద్వారా విన్నవించారు. పేద ప్రజలకు సాయం చేయాలని పెద్దమనస్సు కలవారు స్పందించాలని..వారు ‘రైస్ బకెట్ ఛాలెంజ్’ లో పాల్గొనాలని కోరారు.

రైస్ బకెట్ చాలెంజ్ ఉద్దేశం
రైస్ బకెట్ చాలెంజ్ ఉద్దేశం ఏమంటే..ఈకరోనా సమయంలో ఉపాధి లేక ఆకలితో బాధపడేవారికి భోజనం సదుపాయంతో పాటు..అవసరమైన రోగులకు మందులు సమకూర్చడం. దీనికి ఆమె ఫేస్ బుక్ ద్వారా స్నేహితుల సాయం కోరారు. పేదలకు అన్నం పెట్టాలనుకునేవారు ఆ ఆహారాన్ని సొంతంగా తయారు చేసిగానీ..లేదా మరే ఏదైనా పద్దతిలో గానీ ఆహారాన్ని సమకూర్చుకుని..వారికి దగ్గరలో ఉన్న పేదలకు అందజేయాలి. లేదా పేదలు ఉండే ప్రాంతాలకు వెళ్లి వారికి ఆహారం అందించాలి. అలాగే కష్టంలో ఉండి మందులు కొనుక్కోని వారికి అసవరమైన మందులు అందజేయవాలి. వారికి నేరుగా మందులు కొని ఇవ్వటం కుదరకపోయినా లేదా మరో రకంగా సహాయం చేయాలనుకున్నా..ఒక్కొక్కరూ కనీసం రూ.100 తక్కువ కాకుండా మందులను ఇవ్వొచ్చుని తెలిపారు.

ఈ సందర్భంగా మంజులత మాట్లాడుతూ..నేను రాబిన్యూడ్ ఆర్మీ వంటి ఎన్జీవోలతో కలిసి పనిచేస్తున్నామని..చాలామంది తమకు వారి వారి అవసరాల గురించి చెప్పారు. ఆ ఎన్జీవో సంస్థలు డబ్బులు వసూలు చేయకుండా పేదలకు ఉపయోగపడే వస్తువులు ఇస్తే ఉపయోగం ఉంటుందని భావించారు. అదే విషయాన్ని చెప్పగా..”రైస్ బకెట్ ఛాలెంజ్” ద్వారా మేము 400కిలోల బియ్యం, 80 కిలోల పప్పులు, 80 లీటర్ల నూనె పంపించాం. వారు వాటిని సంగీత కళాకారుల బృందానికి పంపుతున్నాము. ఈకరోనా వల్ల పనిలేక కష్టాల్లో ఉన్నవారికి వీటిని అందించామని తెలిపారు. అలాగే జానపద కళాకారులైన సురఖికి సహాయం చేయగలిగామని తెలిపారు. అలాగే ఒకప్పుడు బాగా బతికి వారు కూడా ఈ కరోనా వల్ల ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు. అటువంటివారు బయటకు వచ్చి బహిరంగంగా తమకు సహాయం చేమని అడగలేరు. అటువంటివారికి ఈ “రైస్ బకెట్ ఛాలెంజ్” ద్వారా బియ్యం, నూనె, పప్పులు వంటి నిత్యావసర వస్తువులు అందజేయమని ఎన్జీవోలతో కలిసి పనిచేసే ప్రశాంత్ అనే ఓ టెకీ తెలిపాడని దాంతో తాము అటువంటివారి గురించి తెలుసుకుని సహాయం చేయటానికి యత్నిస్తున్నామన్నారు.

అలాగే మనం కేవలం ఆహారమే ఇవ్వాలని లేదు. అవసరమైనవారికి వారికి ఉపయోగపడేది ఇచ్చినా ఈ “రైస్ బకెట్ ఛాలెంజ్” ఉద్ధేశం నెరవేరినట్లేనన్నారు. చిరువ్యాపారులకు ఈ కరోనా వల్ల ఉపాధి పోయింది. తిరిగి వారు వ్యాపారం ప్రారంభించుకోవాలనుకున్నా చేతిలో డబ్బులు లేక ఉపయోగపడుతున్నారు. అటువంటివారికి అవసరమైన సహాయం చేయవచ్చు. ఒకవేళ దాతలు అందుబాటులో లేకపోతే ఆమే సహాయం కోరినవారికి ‘నో’చెప్పలేరు. ఉదాహరణకు ఓ టీస్టాల్ నడిపే వ్యక్తి తిరిగి లాక్ డౌన్ తరువాత వ్యాపారం ప్రారంభించాలనుకున్నాడు. కానీ పాలు,టీపొడి, చక్కెర కొనటానికి డబ్బుల్లేవు. అతని అవసరం తెలుసుకుని 5 కిలోల టీపొడి ఇచ్చేలా చేయగలిగామని తెలిపారు. అలాని అన్ని ఆమే స్వయంగా చేయకుండా ఎవరు సహాయం చేయాలనుకుంటున్నారో వారి గురించి తెలుసుకుని సహాయం పొందగోరేవారికి ఆ సహాయం అందేలా చేస్తున్నారు.
అలాగే గూగుల్ పే, ఫోన్ పే ల ద్వారా సహాయం చేయాలనుకునేవారు కూడా చేయవచ్చని తెలిపారు.

కాగా ఐస్ బకెట్ ఛాలెంజ్ నుంచి స్ఫూర్తి పొందిన మంజులత రైస్ బకెట్ ఛాలెంజ్ ప్రారంభించారు. ఆ ఛాలెంజ్ ద్వారా ఆమె అనేక జీవితాలను ప్రభావితం చేశారు. రోజువారీ కూలీ సంపాదించేవారికి ఆమె ఒక బకెట్ బియ్యం విరాళంగా ఇచ్చారు. ఆమె సైకిల్‌పై ఇడ్లీ,దోస అమ్మి దానికి సంబంధించిన ఫోటోలను ఫేస్‌బుక్ లో దాని ఫోటోను పోస్ట్ తన స్నేహితులకు కొంతమందిని ట్యాగ్ చేసి, దానిని కొనసాగించమని సవాలు విసిరారు. భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో బియ్యం ప్రధానమైన ఆహారం కాబట్టి ఆమె ఈ రైస్ బకెట్ ఛాలెంజ్ ను ఎంచుకున్నారు. ఈ ఛాలెంజ్ ద్వారా ఆకలితో ఉన్నవారి కడుపుల నింపగలదు. ఈ సవాలును భారతదేశం లోనే విదేశాలలో వేలాది మంది ఈ సవాలును తీసుకొని చురుకుగా పాల్గొన్నారు. చాలా కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు, చాలామంది చురుకుగా ఈ ప్రచారంలో పాల్గొని ఉదారంగా విరాళాలను ఇచ్చారు. వాటిని ఆమె అవసరమైనవారికి అందేలా చేయగలుగుతున్నారు.