Dhee Raju : చైతన్య మాస్టర్ సూసైడ్ ముందు లాస్ట్ కాల్ నాకే.. నేను ఏమైపోతానో అని అందరూ.. రాజు ఎమోషనల్..

డ్యాన్సర్ రాజు ఓ ఇంటర్వ్యూలో చైతన్య మాస్టర్ గురించి మాట్లాడుతూ ఆయనతో ఉన్న అనుబంధం గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు.(Dhee Raju)

Dhee Raju : చైతన్య మాస్టర్ సూసైడ్ ముందు లాస్ట్ కాల్ నాకే.. నేను ఏమైపోతానో అని అందరూ.. రాజు ఎమోషనల్..

Dhee Raju

Updated On : November 9, 2025 / 6:59 AM IST

Dhee Raju : ఢీ షో ఫేమ్ చైతన్య మాస్టర్ రెండేళ్ల క్రితం అప్పుల బాధతో సూసైడ్ చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. ఆయన ఆత్మహత్యతో డ్యాన్సర్స్ అంతా షాక్ అయ్యారు. ఆయనతో అనుబంధం ఉన్నవాళ్లు చాలా బాధపడ్డారు. తాజాగా ఢీ షో ఫేమ్ డ్యాన్సర్ రాజు ఓ ఇంటర్వ్యూలో చైతన్య మాస్టర్ గురించి మాట్లాడుతూ ఆయనతో ఉన్న అనుబంధం గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు.(Dhee Raju)

రాజు చైతన్య మాస్టర్ సూసైడ్ గురించి మాట్లాడుతూ.. చైతన్య మాస్టర్ చనిపోయారు అని నేను నమ్మలేదు. ఆయన దగ్గరకు వెళ్ళేదాకా బతికే ఉంటారు అని నమ్మను. చనిపోయే ముందు నాకు వీడియో కాల్ చేసారు. నాకే చివరి కాల్ చేసారు మాస్టర్. కాల్ చేసి.. జాగ్రత్త నాన్న, మంచిగా ఉండు అని డల్ గా మాట్లాడారు. ఎందుకు అంత డల్ గా ఉన్నారు. అప్పులే కదా తర్వాత తీర్చుకోవచ్చు. ఎందుకు అంత బాధపడతారు. ముందు మీరు హైదరాబాద్ రండి అని ఫోన్ కట్ చేశాను. స్నానం చేసి బయటకు వచ్చేసరికి ఫ్రెండ్ ఫోన్ చేసి చైతన్య మాస్టర్ ఉరి వేసుకున్నారు అన్ని చెప్పడంతో షాక్ అయ్యాను.

ఆయన చనిపోతే అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు నేను ఏమైపోతాను అని. ఆయన నా పేరు రాజు అని పచ్చబొట్టు పొడిపించుకున్నారు. నేను సంవత్సరం బయటకు రాలేకపోయాను దాన్నుంచి. ఆ సమయంలో నేను ఏ షో చేయలేదు. ఇంట్లోనే ఉన్నాను. ఇంత మంచి ఆయన్ని ఎందుకు ముందే తీసుకెళ్లిపోయారు అని అనుకున్నా. కానీ మంచోళ్ళను ముందే తీసుకెళ్ళిపోతారు అని అంటారు. నాకు ఏం జరిగినా ఫోన్ చేసి చెప్పేది ఒకే ఒక్కరు చైతన్య మాస్టర్ కి. ఆయన చనిపోయినప్పుడు డ్యాన్స్ ఐకాన్ కొరియోగ్రాఫర్ గా చేస్తున్నా అప్పుడు. వీడియో కాల్ లో టైటిల్ కొట్టాలి అన్నారు, కొట్టాను. నేను పెళ్లి చేసుకుంటే చైతన్య మాస్టర్ పుడతాడు అనుకుంటున్నా అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.

Also Read : The Great Pre Wedding Show : ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ రివ్యూ.. ఫుల్ గా నవ్వుకోవాల్సిందే..

Dhee Raju

చైతన్య మాస్టరే తనని ఇండస్ట్రీకి తీసుకొచ్చారు అని రాజు చెప్తూ.. స్కూల్ లో డ్యాన్స్ వేయడంతో బాగా పేరొచ్చింది. ఆ తర్వాత వినాయక చవితికి వేసా. అది చైతన్య మాస్టర్ చూసారు. ఆయన తనతో సూర్యాపేటలో ఉంచుకొని మూడు నెలలు డ్యాన్స్ నేర్పించాడు, ఈవెంట్స్ కి తీసుకెళ్లాడు. నేను అన్ని చాలా ఫాస్ట్ గా నేర్చుకున్నాను. నేను ఫాస్ట్ గా నేర్చుకోవడం చూసీ ఢీ షోకి తీసుకొచ్చారు. ఫస్ట్ టైం ఢీ షో ఛాన్స్ వచ్చినప్పుడు నాకు ఫుల్ ఫీవర్, డ్యాన్స్ చేయలేను అనిపించింది కానీ మొదటి ఛాన్స్ పోతే ఎలా అని భయపడి చెప్పలేదు.

బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గానే మొదటి ఛాన్స్. అందరి వెనకాల చేశాను. నేను ఫీవర్ ఉన్నా చేయడానికి వచ్చాను ఆ డెడికేషన్ చైతన్య మాస్టర్ కి ఇంకా నచ్చింది. ఆ సీజన్ తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయని వెళ్ళాను. చైతన్య మాస్టర్, చిట్టి మాస్టర్, సాయితేజ మాస్టర్ మేమే చదివిస్తాం ఢీ షోకి రా అన్నారు. రెండేళ్లు బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా చేశాను. తర్వాత కంటెస్టెంట్ అయి టైటిల్ కొట్టాను అని తెలిపాడు. చైతన్య మాస్టర్ కి జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చాడు రాజు.

Also Read : Samantha : సమంత పెర్ఫ్యూమ్ బ్రాండ్ లాంచ్.. బాయ్ ఫ్రెండ్ తో కలిసి సందడి చేసిన సామ్..