Gang war in Prison: జైలులో గ్యాంగ్‌ వార్‌..116కు చేరిన మృతులు

ఈక్వెడార్​లోని గ్వయాక్విల్‌​ ప్రాంతీయ జైలులో రెండు గ్యాంగుల మధ్య జరిగిన ఘర్షణలో మృతుల సంఖ్య పెరిగింది. 24 నుంచి 100 దాటింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది

Gang war in Prison: జైలులో గ్యాంగ్‌ వార్‌..116కు చేరిన మృతులు

Gang War In Prison

Gang War in Prison : ఈక్వెడార్​లోని గ్వయాక్విల్‌​ ప్రాంతీయ జైలులో రెండు గ్యాంగుల మధ్య జరిగిన ఘర్షణలో మృతుల సంఖ్య పెరిగింది. 24 నుంచి 100 దాటింది. గుయాక్విల్ జైలులో కొన్ని రోజుల క్రితం అంటే మంగళవారం (సెప్టెంబర్ 28,2021) రాత్రి రెండు వర్గాలుగా విడిపోయిన ఖైదీల మధ్య ఘర్షణ జరిగిన ఘటనలో 24మంది ఖైదీలు మృతి చెందారు. దాదాపు 100మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా మారి మృతుల సంఖ్య 24 నుంచి  116కు చేరుకుంది.

మంగళవారం రాత్రి సమయంలో రెండు వర్గాల ఖైదీలు మాటా మాటా అనుకున్నారు. అదికాస్తా తీవ్రమైంది. ఘర్షణకు దారి తీసి హింసాత్మకంగా మారింది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు బాంబులు, తుపాకులతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇప్పటివరకు 116 మంది ఖైదీలు మరణించారని అధికారులు మరణించారని అధికారులు తెలిపారు. జైలులో ఖైదీల మధ్య జరిగిన ఈ ఘర్షణ..మృతి ఘటన దేశ చరిత్రలో అత్యంత హీనమైనదిగా మిగిలిపోతుందని అధికారులు విచారం వ్యక్తంచేశారు.

Read more : Gang Clash in Prison : జైల్లో గ్యాంగ్ వార్..24 మంది ఖైదీలు మృతి..48మందికి గాయాలు

కాగా గుయాక్విల్‌ జైలో శిక్ష అనుభవిస్తున్న రెండు డ్రగ్‌ గ్యాంగుల మధ్య మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చెలరేగిన వివాదం ముగియలేదు. అంతకంతకు పెరిగింది. అదికాస్తా ఘర్షణకు దారితీసి అంత్యం హింసాత్మకంగా మారిపోయింది.బాబులు తుపాకులతో దాడి చేసుకునే తీవ్ర స్థాయికి చేరుకుని 116మంది ప్రాణాలు తీసింది. ఖైదీలు చేసుకున్న ఈ దాడులతో జైలు బాంబులు, తుపాకుల మోతలతో దద్దరిల్లిపోయింది. ఈ ఖైదీల వార్ ను అదుపు చేయటానికి సాక్షాత్తు దేశ మిలటరీచే కదిలివచ్చింది. సైనికుల సహాయంతో 400 మంది పోలీసులు రంగంలోకి దిగి పరిస్ధితి అదుపులోకి తీసుకురావటానికి 5 గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది.

Read more : Harassment : బాలుడిపై లైంగిక దాడి.. ఆయాకు 20ఏళ్ల జైలు శిక్ష

కాగా..ఈ దాడుల్లో గాయపడినవారి ఇంకా పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. కాగా..ఈక్వెడార్‌లోని మూడు జైళ్లలో ఇటువంటి ఘర్షణలు, దాడులు సర్వసాధారణంగా మారిపోయాయి. జైళ్లలో ఉన్నా ఖైదీల్లో ఏమాత్రం మార్పు రాకపోగా..మరింత హింసాత్మకంగా మారిపోతున్నారు.

జైళ్లలోనే డ్రగ్ వ్యాపారాలతో పాటు తదితర అసాంఘిక వ్యాపారాలు చేస్తున్నారు. ఈ దందాల్లో ఖైదీలు గ్రూపులుగా ఏర్పడటం ఒక గ్రూపుపై మరొక గ్రూపు ఆధిపత్యం కోసం దందాల్లో చోటుచేసుకునే పలు ఘటనలు ఇలా ఘర్షణలకు దారి తీసి అవికాస్తా దాడుల దాకా వెళ్లటం ఈ దాడుల్లో పలువురు చనిపోవటం జరుగుతుంటుంది. ఇలా గత ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లలో 79 మంది మరణించారు. జూలైలో జరిగిన మరో ఘటనలో 22 మంది ఖైదీలు మృతిచెందారు.