Harassment : బాలుడిపై లైంగిక దాడి.. ఆయాకు 20ఏళ్ల జైలు శిక్ష

ఓ మైనర్ బాలుడిని లైంగికంగా వేధించిన కేసులో ఆయాకు జైలుశిక్ష పడింది. ఆయాకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధించింది న్యాయస్థానం. హైదరాబాద్ లో ఈ లైంగిక వేధింపుల ఘటన జరిగింది.

Harassment : బాలుడిపై లైంగిక దాడి.. ఆయాకు 20ఏళ్ల జైలు శిక్ష

Harassment

Harassemnt On Boy : ఆడపిల్లలకే కాదు మగపిల్లలకు కూడా రక్షణ కరువైంది. బాలురపైనా లైంగిక దాడులు జరుగుతున్నాయి. కొంతమంది మహిళలు వికృతంగా ప్రవర్తిస్తున్నారు. మైనర్ బాలుర పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. బాలుర ప్రైవేట్ భాగాలు తాకి పైశాచిక ఆనందం పొందుతున్నారు. అలాంటి ఓ కేసులో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

Raju Suicide : పోలీసులే పరిగెత్తించి చంపేశారు.. రాజు తల్లి సంచలన ఆరోపణలు

ఓ మైనర్ బాలుడిని లైంగికంగా వేధించిన కేసులో ఆయాకు జైలుశిక్ష పడింది. ఆయాకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధించింది న్యాయస్థానం. హైదరాబాద్ లో ఈ లైంగిక వేధింపుల ఘటన జరిగింది. 9ఏళ్ల బాలుడు పాతబస్తీలో ఓ ప్రైవేట్ స్కూల్ లో చదువుతున్న సమయంలో పాతికేళ్ల ఆయా బాలుడిని లైంగికంగా వేధించింది. ఈ ఘటనపై 2017 డిసెంబర్‌లో చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ లో బాలుడి తండ్రి ఫిర్యాదు చేశాడు.

Horror మూవీలను భయపడకుండా చూస్తే.. ఈ కంపెనీ రూ. 95,500 చెల్లిస్తానంటోంది!

చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్కాస్‌లోని ఒక ప్రైవేట్ స్కూల్ లో జ్యోతి అలియాస్‌ మంజుల అనే మహిళ కేర్ టేకర్‌గా పనిచేస్తోంది. అదే స్కూల్ లో బాధిత బాలుడు చదువుతున్నాడు. బాలుడు వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో.. అతడితో అనుచితంగా ప్రవర్తించింది ఆ మహిళ. అసభ్యకరంగా తాకుతూ ఇబ్బంది పెట్టింది. ఆ బాలుడు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెబుతానంటూ ప్రతిఘటించడంతో ఆయా రెచ్చిపోయింది. బాలుడి ప్రైవేట్‌ భాగాలపై సిగరెట్లు, లైటర్‌తో కాల్చి గాయపరిచింది.

విషయం తెలుసుకున్న బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితురాలిపై పోక్సో చట్టం కింద అభియోగాలు మోపిన పోలీసులు, సాక్ష్యాధారాలు సమర్పించారు. ఈ కేసును విచారించిన బాలమిత్ర కోర్టు ఆయాకు 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది.