వింత ఆచారం : చనిపోయినవారి ఎముకల్ని కాల్చి సూప్ చేసుకుని తాగాలి

  • Published By: nagamani ,Published On : November 11, 2020 / 02:52 PM IST
వింత ఆచారం : చనిపోయినవారి ఎముకల్ని కాల్చి సూప్ చేసుకుని తాగాలి

Amazon tribe very strange rituals : ప్రపంచంలో ఎన్నో జాతుల ప్రజలు ఆచారాలు ఉన్నాయి. ఇవి చాలా వింతగా విచిత్రంగా ఉంటాయి. మరికొన్ని చాలా భయంకరంగా ఉంటాయి. ఇంకొన్ని ఊహించలేనివికూడా ఉంటాయి. అటువంటి ఓ వింత ఆచారం గురించి ఈరోజు తెలుసుకుందాం..

అమెజాన్ ప్రాంతంలోని యనమామి అనే ఒక గిరిజన తెగ ఉంది. వాళ్ల ఆచారాలు చాలా వింతగాను భయంకరంగాను ఉంటాయి. ఆ తెగలోని ఏ ఇంటిలోనైనా ఎవరైనా చనిపోతే ఆ మనిషి అంటే మృతదేహాన్ని కట్టెల మీద కాల్చి, కాలిన ఎముకల్ని తీసుకుని వాటిని పొయ్యిమీద ఓ గిన్నె పెట్టి నీళ్లు పోసి సూప్ లా తయారు చేసి దాన్ని తాగాలి.

మనిషిని మనిషి అదికూడా చనిపోయిన మనిషిని ఆహారంగా తీసుకోవడం యనమామి గిరిజన తెగ ఆచారంగా కొనసాగుతోంది. ఇది వినేవారికి వింతే గానీ వారు మాత్రం అది తమ బాధ్యతగా భావిస్తారు. ఇలా అమెజాన్ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి.

కాగా గిరిజనులు ఎంతగా అభివృద్ది చెందినా..నాగరిక ప్రపంచంతో సంబంధాలు ఉన్నాగానీ..వారి ఆచార వ్యవహారాలను మాత్రం విడిచిపెట్టరు. నాగరికత పేరుతో తమ సంప్రదాయాలను వదులుకోవటానికి ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇష్టపడరు.

అలా చేస్తే వారికి కీడు జరుగుతుందని నమ్ముతుంటారు. ఆ నమ్మకాలనే కొనసాగిస్తుంటారు. అటువంటి నమ్మకమే ఈ మృతదేహం ఎముకల్ని కాల్చుకుని సూప్ లాంటిది చేసుకుని తాగటం..ఎవరైనా వారి ఆచారాలను అతిక్రమిస్తే వారి ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడరు.