China Toys Danger : చైనా బొమ్మల్లో ప్రమాదకర రసాయనాలు..చిన్నారుల ప్రాణాలకు ప్రమాదమంటున్న నిపుణులు

చైనాలో తయారై అమెరికాకు దిగుమతి అయిన బొమ్మల్లో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని తేలటంతో అమెరికా అధికారులు ఆ బొమ్మల్ని సీజ్ చేశారు.

China Toys Danger : చైనా బొమ్మల్లో ప్రమాదకర రసాయనాలు..చిన్నారుల ప్రాణాలకు ప్రమాదమంటున్న నిపుణులు

Dangerous Chemicals In China Toys

Dangerous Chemicals In China Toys: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. ప్రపంచ దేశాల్లో చైనా వస్తువులు వాడని దేశమంటూ లేదంటే అతిశయోక్తి కాదు. మేడిన్ చైనా అనే వస్తువు ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది. అదీ చైనా సాధించిన గొప్పతనం. క్రాకర్స్ నుంచి బొమ్మల వరకు..పిన్నీసు నుంచి ఫోన్ వరకు చైనా వస్తువులు లేనివంటూ లేవు. అటువంటి చైనా తన వ్యాపారాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ చేసుకుంటోంది. చైనా వస్తువులు అంటే తక్కువ ధరకు రావటమే దీనికి ప్రధాన కారణం. ఇతర దేశాల్లో తయారయ్యే వస్తువులతో పోలిస్తే..చైనాలో తయారయ్యే ప్రతీ వస్తువుకి ధర తక్కువగానే ఉంటుంది. అందుకే చైనా ప్రపంచ దేశాలన్నింటిలోనే తన మార్కు మార్కెట్ ను కొనసాగించగలుగుతోంది. ఈ క్రమంలో చైనాలో తయారైన చిన్నారులు ఆడుకునే బొమ్మల్లో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్లుగా తేలటంతో వాటిని అమెరికా చైనా బొమ్మలకు చెక్ పెట్టింది. మేడ్‌ ఇన్‌ చైనా బొమ్మలకు అమెరికా చెక్‌ పోస్ట్‌ వేసింది.

Read more : Twitter Trending : చైనా వస్తువులను బ్యాన్ చేయాల్సిందే

చైనా నుంచి ఓడల్లో అమెరికాకు చేరిన బొమ్మల బాక్సులను అమెరికా అక్కడిక్కడే నిలిపివేసింది. వాటిని దేశంలోకి రాకుండా..పోర్టులోనే అడ్డుకుంది. సుమారు ఏడు బాక్స్‌ల బొమ్మలను అమెరికా అధికారులు సీజ్‌ చేయడం విశేషం. ఈ బొమ్మల్లో చిన్నారుల ప్రాణాలకు హాని చేసే ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని గుర్తించటంతో వాటిని దేశంలోకి దిగుమతి అవ్వకుండానే పోర్టులోనే అమెరికా కస్టమ్స్‌ అధికారులు సీజ్ చేశారు.

భారత్‌లో బాగా ఫేమస్‌ అయిన లగోరి డాల్స్ అని పిలుస్తారు. చైనాలో తయారైన ఈ బొమ్మలు కూడా అమెరికాకు వచ్చిన బాక్సుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. జులై 16న చేపట్టిన కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ సేఫ్టీ కమిషన్‌(CPSC), సీబీపీ అధికారులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీలలో చైనా నుంచి దిగుమతి అయిన బొమ్మల్లో ప్రమాదకరమైన కెమికల్స్‌ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.

Read more : చైనాకు బిగ్ షాక్​… భారత్ అధీనంలో కీలక ప్రాంతం

వీటిలో కొన్ని బొమ్మలకు సీసం, కాడ్మియం, బేరియం పూత పూస్తున్నారని..వాటితో ఆడుకుంటే ఆ రసాయనాల వల్ల పిల్లల ప్రాణాలకు ప్రమాదమని నిపుణులు తెలిపారు. గత ఆగష్టు 24న చైనా నుంచి షిప్‌ ద్వారా వచ్చిన కొన్ని బొమ్మల్లోకూడా ఇటువంటి కెమికల్స్‌ ఆనవాళ్లను నిర్ధారించారు. ఈ సమయంలో అక్టోబర్‌ 4న అమెరికాకు చేరుకున్న చైనా బొమ్మల్ని సీజ్‌ చేయడం విశేషం.

ఇదిలా ఉంటే..హాలీడే షాపింగ్‌ సీజన్‌ క్రమంలో యూఎస్‌ కస్టమ్స్‌ అండ్‌ బార్డర్‌ ప్రొటెక్షన్‌(సీపీబీ)వెంటనే అప్రమత్తమైంది. ఇప్పుడంతా ఆన్ లైన్ షాపింగ్ అవ్వటంతో ఇటువంటి ప్రమాకర రసాయనాలు ఉండే బొమ్మలు కొనటంతో ప్రమాదం ఉంటుందని భావించిన అధికారులు ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేప్పుడు పిల్లల బొమ్మల విషయాల్లో జాగ్రత్తగా ఎంచుకోవాలని ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.

కాగా చైనానుంచి వచ్చిన బొమ్మల్లో రసాయనాలు ఉన్నట్లుగా అమెరికా అధికారులు నిర్ధారించటంతో ఈ ప్రభావం చైనా మార్కెట్లపై పడే అవకాశం ఉంది. చైనా బొమ్మల వ్యాపారంపై భారీగా ప్రతికూల ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. మరి దీని కోసం చైనా ఎటువంటి మార్పులు చేయనుందో లేదా..మసిపూసి మారేడు కాయ చేసి విక్రయాలు కొనసాగించనుందో వేచి చూడాలి..