Acharya: హీరోయిన్ లేని మెగాస్టార్ సినిమా.. కెరీర్‌లోనే ఇదే ఫస్ట్ టైమ్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Acharya: హీరోయిన్ లేని మెగాస్టార్ సినిమా.. కెరీర్‌లోనే ఇదే ఫస్ట్ టైమ్!

Acharya

Acharya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో, మల్టీస్టారర్ మూవీగా ఆచార్య ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఆచార్య షూటింగ్ లో ఉండగానే చిరు మరో నాలుగు ప్రాజెక్టులను కూడా మొదలు పెట్టాడు.

Acharya: రిలీజ్ ఎగ్జైట్‌మెంట్.. అన్ని అడ్డంకుల్ని దాటుకుని వస్తున్న ఆచార్య!

ఆచార్యతో కలిసి మొత్తం ఐదు సినిమాలు చిరంజీవి ఖాతాలో లైన్లో ఉన్నాయి. మరో ఐదు సినిమాలు కూడా చర్చలలో ఉన్నాయని తాజాగా చిరంజీవిని స్వయంగా చెప్పుకొచ్చాడు. అంటే.. 152 నుంచి 156వ సినిమా వరకు సెట్స్ మీద ఉంటే.. 157 నుండి 161 వరకు చర్చలో ఉన్నాయి. ఇప్పటి వరకు కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు.. మరెన్నో మైలు రాళ్లను అధిగమించిన చిరంజీవి కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ హీరోయిన్ లేకుండా సినిమా తీసుకొస్తున్నాడు. ఒకవిధంగా ఇది మెగా అభిమానులకు షాకిచ్చే అంశమే.

Acharya: బాక్సాఫీస్ బరిలో తండ్రి కొడుకులు.. ఎటు చూసినా అంతా పాజిటీవే!

ఆచార్య సినిమాలో ముందుగా చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసుకొని కొంత షూటింగ్ కూడా చేశారు. కానీ ప్రాముఖ్యత లేని పాత్రను ఇరికించడం.. దాని కోసం కాజల్ లాంటి హీరోయిన్ ను తీసుకోవడం నచ్చని కొరటాల కంప్లీట్ గా ఆ పాత్రను లేపేశాడు. మెగాస్టార్ లాంటి బిగ్ స్టార్ కు హీరోయిన్ లేకపోవడం ఏంటని అభిమానులు కొంత అసంతృప్తిని వ్యక్తం చేసినా స్టోరీ టెల్లర్ గా కొరటాల మాత్రం చిరును ఒప్పించాడు. చిరు కెరీర్ లోనే ఇలా జోడీలేని సినిమా ఇదే కావడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. మరి సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.