Acharya: బాక్సాఫీస్ బరిలో తండ్రి కొడుకులు.. ఎటు చూసినా అంతా పాజిటీవే!

ఆచార్య.. ద మోస్ట్ అవెయిటింగ్ మల్టీస్టారర్ ఆఫ్ ద తెలుగు సినిమా. ఇప్పటి వరకూ అప్పుడప్పుడు కలిసి కనిపించిన తండ్రీ కొడుకులు.. ఫుల్ ఫ్లెడ్జ్ట్ గా నువ్వా నేనా అంటూ పోటీపడుతూ నటించిన ఆచార్య రిలీజ్ కు రెడీఅవుతోంది. టైటిల్ దగ్గరనుంచి పాజిటివ్ వైబ్స్ తో ఉన్న ఆచార్య.. అభిమానుల అంచనాల్నిఅందుకోవడానికి సిద్దమైంది.

Acharya: బాక్సాఫీస్ బరిలో తండ్రి కొడుకులు.. ఎటు చూసినా అంతా పాజిటీవే!

Acharya

Acharya: ఆచార్య.. ద మోస్ట్ అవెయిటింగ్ మల్టీస్టారర్ ఆఫ్ ద తెలుగు సినిమా. ఇప్పటి వరకూ అప్పుడప్పుడు కలిసి కనిపించిన తండ్రీ కొడుకులు.. ఫుల్ ఫ్లెడ్జ్ట్ గా నువ్వా నేనా అంటూ పోటీపడుతూ నటించిన ఆచార్య రిలీజ్ కు రెడీఅవుతోంది. టైటిల్ దగ్గరనుంచి పాజిటివ్ వైబ్స్ తో ఉన్న ఆచార్య.. అభిమానుల అంచనాల్నిఅందుకోవడానికి సిద్దమైంది. ఆచార్య ధియేటర్లోకి రావడానికి అంతా సిద్దమైంది. కొరటాల శివ డైరెక్షన్లో చరణ్, చిరంజీవి కలిసి నటించిన మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ మూవీని చూడడానికి అభిమానులు ఆశగా చూస్తున్నారు. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఆచార్యలో అన్నీ ఇంట్రస్టింగ్ ఎలిమెంట్సే.

Acharya: యూఎస్ లో దుమ్మురేపుతున్న ఆచార్య ప్రీ బుకింగ్స్

ఓ వైపు మెగాస్టార్.. మరో వైపు మెగా పవర్ స్టార్. ఇద్దర్నీ ఒక ఫ్రేమ్ లో చూడడానికే కళ్లు సరిపోవు.. అలాంటిది.. ఇద్దరూ కలిసి యాక్ట్ చేస్తే.. సందడిగా స్టెప్పులేస్తే.. అది ఫాన్స్ కి విజువల్ ట్రీటే. స్టార్ హీరోలు, అందులోనూ కెరీర్ పీక్స్ లో ఉన్న ఇద్దరు తండ్రీకొడుకులు కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ ఆచార్య. ఈ విజువల్ ట్రీట్ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు మెగా ఫాన్స్. ఆచార్య రిలీజ్ టైమ్ కూడా పాజిటివే. పుష్ప, అఖండ, ట్రిపుల్ఆర్, కెజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో ఫుల్ ఫ్లెడ్జ్ట్ గా ధియేటర్లకు రావడం అలవాటైంది ఆడియన్స్ కి. దాంతో మంచి ఓపెనింగ్ కలెక్షన్లు వస్తాయా రావా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. అంతేకాదు డైరెక్టర్ కొరటాల శివకు ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేదు. నాన్ స్టాప్ హిట్స్ తో దూసుకుపోతున్న కొరటాలశివ తన ప్రతి సినిమాలో ఓ మ్యాజికల్ మెసేజ్ ని ఇన్ క్లూడ్ చేసి ఆడియన్స్ కి దగ్గరచేస్తారు.

Acharya: ఆచార్యకు ముందే చరణ్ కోసం కొరటాల కథ.. సెట్స్ మీదకు ఎప్పుడో?

సో.. నాన్ స్టాప్ హిట్స్ ఉన్న కొరటాల చేస్తున్న ఆచార్య మీద కూడా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. చిరంజీవి, చరణ్ చేస్తున్న సినిమా అంటే మేకింగ్ కూడా అంతే గ్రాండ్ గా ఉండాలి. ఇద్దరు హీరోల ఎలివేషన్ కూడా అదే రేంజ్ లో ఉండాలి. అందుకే మెగా ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా భార సెట్స్ తో సినిమా తీశారు ప్రొడ్యూసర్లు. ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ సెట్ వేసి హిస్టరీ క్రియేట్ చేశారు ఆచార్య టీమ్. కోకాపేట్ లో ఇప్పటి వరకూ ఏ సినిమాకూ వెయ్యని రేంజ్ లో 20 ఎకరాల స్తలంలో టెంపుల్ సిటీని ధర్మస్తలి పేరుతో భారీ సెట్ వేసి సినిమా మేజర్ పార్ట్ అంతా అక్కడే షూట్ చేశారు టీమ్.

Acharya: ఆచార్య ప్రీరిలీజ్ బిజినెస్ రిపోర్ట్.. టార్గెట్ ఎంతంటే?

ఆచార్యలో మేజర్ పాజిటివ్ ఎలిమెంట్.. మాస్. ఇద్దరు మెగా మాస్ హీరోలు కలిసి చేస్తున్నారంటే.. మరి యాక్షన్ కూడా అదే రేంజ్ లో ఉండాలి. ఈ విషయంలో ఆడియన్స్ పల్స్ పట్టుకునే కొరటాల.. ఫాన్స్ ఏ సీన్స్ కి ఎగ్జైట్ అవుతారో, ఎలాంటి మాస్ సీన్స్ కి విజిల్స్ పడతాయో.. అలాంటివి సెలక్టివ్ గా పెట్టారు సినిమాలో. ఎంట్రీ దగ్గరనుంచి యాక్షన్ వరకూ హీరోల మాస్ ఇమేజ్ ని రీచ్ అయ్యేలా సీన్స్ ప్లాన్ చేశారు మేకర్స్. అంతే కాదు.. ఈ సినిమాకి ఉన్న మరో ప్లస్ పాయింట్ మహేష్ బాబు వాయిస్. సినిమా స్టార్టింగ్ లోనే సూపర్ స్టార్ వాయిస్ నెరేషన్ తోనే ఆచార్య తన ప్రయాణం మొదలుపెట్టబోతున్నారు. ఇలా ఆల్ మోస్ట్ అన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ తో రిలీజ్ అవుతున్న ఆచార్య.. అదే రేంజ్ లో పాజిటివ్ రిజల్ట్ ఇస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.