Acharya: ఆచార్య ప్రీరిలీజ్ బిజినెస్ రిపోర్ట్.. టార్గెట్ ఎంతంటే?

Acharya: ఆచార్య ప్రీరిలీజ్ బిజినెస్ రిపోర్ట్.. టార్గెట్ ఎంతంటే?

Acharya Pre Release Business Report

Acharya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా మరో నాలుగు రోజుల్లో మనముందుకు రాబోతుండటంతో, ఈ సినిమాను చూసేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరికొత్త లుక్‌తో కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ‘ఆచార్య’పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్లు ఈ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ముగిసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

Acharya: బ్యాడ్ న్యూస్.. అక్కడ ఆచార్య ఎంట్రీ లేనట్టే..?

చాలా రోజుల తరువాత మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుండటం.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇందులో నటిస్తుండటం.. ఫెయిల్యూర్ లేని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించడం.. లాంటి అంశాలు ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్‌గా మారడంతో డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో నిర్మాతలు భారీ లాభాలను పొందడం ఖాయమని ఈ ప్రీరిలీజ్ బిజినెస్ ఫిగర్ చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. ఇక తొలిరోజు ఆచార్య సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా వసూళ్లతో అటు డిస్ట్రిబ్యూటర్లకు కూడా లాభాల పంటను తెచ్చిపెట్టడం ఖాయం.

Acharya : కాజల్‌ని ఎందుకు పట్టించుకోవట్లేదు? కనీసం పేరు కూడా పలకట్లేదు?

కొరటాల మార్క్ మేకింగ్, చిరు-చరణ్‌ల కాంబినేషన్, మణిశర్మ మ్యూజిక్ కలగలిసి ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆచార్య సినిమా ఏకంగా రూ.135 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేయగా, ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే రూ.136 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక ఆచార్య సినిమా ప్రపంచవ్యాప్తంగా చేసిన ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి..

నైజం – 38 కోట్లు
సీడెడ్ – 20.05 కోట్లు
ఉత్తరాంధ్ర – 13 కోట్లు
ఈస్ట్ – 9 కోట్లు
వెస్ట్ – 7.5 కోట్లు
గుంటూరు – 9 కోట్లు
కృష్ణా – 8 కోట్లు
నెల్లూరు – 4.2 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 109.2 కోట్లు
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా – 12 కోట్లు
ఓవర్సీస్ – 12 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ – రూ.133.2 కోట్లు