Acharya: బ్యాడ్ న్యూస్.. అక్కడ ఆచార్య ఎంట్రీ లేనట్టే..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ మూవీ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఆచార్య చిత్రాన్ని ఎట్టకేలకు....

Acharya: బ్యాడ్ న్యూస్.. అక్కడ ఆచార్య ఎంట్రీ లేనట్టే..?

Acharya

Acharya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ మూవీ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఆచార్య చిత్రాన్ని ఎట్టకేలకు వేసవి కానుకగా ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను కూడా చిత్ర యూనిట్ ముగించుకోవడంతో, ఆచార్య కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

Acharya : కాజల్‌ని ఎందుకు పట్టించుకోవట్లేదు? కనీసం పేరు కూడా పలకట్లేదు?

అయితే మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఆచార్యను చూసేందుకు కేవలం సౌత్ ఆడియెన్స్ మాత్రమే కాకుండా, నార్త్‌లో కూడా ఎంతో ఆతృతగా ఉన్నారు. కానీ అక్కడి ప్రేక్షకులకు మెగాస్టార్ గట్టి షాకిచ్చాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్న చిత్ర యూనిట్, హిందీ వర్షన్‌లో మాత్రం ఇప్పట్లో రిలీజ్ చేయలేమని అంటున్నారు. ఈ సినిమాలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా ఉన్న రామ్ చరణ్ ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ప్రెస్ మీట్‌లో మాట్లాడిన చరణ్.. ఆచార్య చిత్ర షూటింగ్ తాము అనుకున్నదానికంటే చాలా ఆలస్యంగా అయ్యిందని, అంతేగాక తాను ఆచార్య, ఆర్ఆర్ఆర్ చిత్రాల్లో ఒకేసారి నటిస్తుండటంతో తనకు చాలా తక్కువ సమయం దొరికిందని ఆయన వెల్లడించారు.

Acharya: అంచనాలు పెంచేసిన ఆచార్య.. డబుల్ ఫీస్ట్ రెడీ!

హిందీ వర్షన్ సినిమాను రిలీజ్ చేయాలంటే డబ్బింగ్.. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పడుతుందని.. తమ వద్ద అంత సమయం లేకపోవడంతో ఏప్రిల్ 29 నాటికి ఈ సినిమాను హిందీ వర్షన్‌లో రిలీజ్‌కు రెడీ చేయలేకపోయామని ఆయన అన్నారు. అయితే ఆచార్యి సినిమాను ఖచ్చితంగా హిందీ వర్షన్‌లో రిలీజ్ చేస్తామని.. తన పాత్రకు తానే హిందీ డబ్బింగ్ చెప్పుకుంటానని చరణ్ వెల్లడించాడు. దీంతో ఆచార్య ఎంట్రీ నార్త్‌లో ఇప్పట్లో లేనట్లే అని తేలిపోయింది.