Acharya: అంచనాలు పెంచేసిన ఆచార్య.. డబుల్ ఫీస్ట్ రెడీ!

ఆచార్య సినిమా కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. పాటలతో, ట్రైలర్స్ తో ఇప్పటికే సినిమా మీద బజ్ క్రియేట్ చేసిన టీమ్.. లేటెస్ట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఇంకాస్త ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు. మరి ఈ మెగా తండ్రీకొడుకులు యాక్ట్ చేస్తున్న ఆఛార్య మెగా అభిమానులకు డబుల్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారా..?

Acharya: అంచనాలు పెంచేసిన ఆచార్య.. డబుల్ ఫీస్ట్ రెడీ!

Acharya

Acharya: ఆచార్య సినిమా కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. పాటలతో, ట్రైలర్స్ తో ఇప్పటికే సినిమా మీద బజ్ క్రియేట్ చేసిన టీమ్.. లేటెస్ట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఇంకాస్త ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు. మరి ఈ మెగా తండ్రీకొడుకులు యాక్ట్ చేస్తున్న ఆఛార్య మెగా అభిమానులకు డబుల్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారా..?

Acharya: ఆచార్యతో యంగ్ హీరో పోటీ.. అవసరమా అంటోన్న ఫ్యాన్స్!

ఆచార్య బజ్ మామూలుగా లేదు. గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్స్ పీక్స్ కు చేరుకున్నాయి.. ఆచార్య ముహూర్తం షాట్ నుంచే సినిమా పై స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. టీజర్, ట్రయిలర్,సాంగ్స్ వచ్చి, ఆడియన్స్ లో ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ సంఖ్యలో తరలి వచ్చిన ఫాన్స్ సందడి చూస్తుంటే ఆచార్య పై హైప్ అమాంతం పెరిగిపోయింది. ఎస్ ఎస్ రాజమౌళి ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Acharya: ఆచార్య సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ ఎంతంటే?

కరోనా కారణంగా మూడు సార్లు రిలీజ్ వాయిదా పడింది. దాంతో ఆచార్య రిలీజ్ పై కొంత నిరాశకు లోనయ్యారు అభిమానులు. ఫైనల్ గా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఆచార్య. రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రిలీజ్ కు ఇంకా వారం రోజులు కూడా లేదు. అయినా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందాని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.

Acharya: ఆచార్య కోసం అందరినీ వాడేస్తున్న కొరటాల!

దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో భారీ మల్టీస్టారర్ తెరకెక్కించారు కొరటాల శివ. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రైటింగ్, మేకింగ్ తో, తండ్రీ కొడుకుల స్క్రీన్ ప్రజెన్స్ హైఫీస్ట్ కానుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. ఇక పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అయిన ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తోన్న ఆచార్య వరల్డ్ వైడ్ ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేసింది. దాంతో భారీ వసూల్లు సాధిస్తుందని మెగా ఫ్యాన్స్ ఇప్పటి నుంచే లెక్కలేసుకుంటున్నారు.

Acharya: ఆర్ఆర్ఆర్ రూట్‌లో ఆచార్య..?

ఇక మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కాంబినేషన్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్ తో రాబోతున్న సినిమా కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆడియన్స్ ఇంట్రెస్ట్ మొత్తం ఆచార్య మీదే ఉంది. చిరు, కాజల్ జోడి తెరపై ఎలా కనువిందు చేశారో చూడాలనుకుంటున్నారు ఫ్యాన్స్. రంగస్థలంలో జిగేల్ అనిపించిన చరణ్, పూజా హెగ్డే జోడి ఆచార్యలో ఏ రేంజ్లో అలరిస్తుందో అని ఇమాజినేషన్ చేసుకుంటున్నారు. ఆచార్యలో తండ్రీ కొడుకుల స్టెప్పులు, యాక్షన్ ఎపీసోడ్స్ వెండితెరమీద చూసి ఓ రేంజ్ లో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు ఆడియన్స్.