Acharya: ఆర్ఆర్ఆర్ రూట్‌లో ఆచార్య..?

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని మరికొద్ది రోజుల్లో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను గతేడాదే రిలీజ్ చేయాల్సి ....

Acharya: ఆర్ఆర్ఆర్ రూట్‌లో ఆచార్య..?

Is Acharya Run Time Locked

Acharya: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని మరికొద్ది రోజుల్లో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను గతేడాదే రిలీజ్ చేయాల్సి ఉన్నా.. కరోనా ప్రభావంతో ఈ సినిమా వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ సినిమాను వేసవి కానుకగా ఈ నెల 29న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.

Acharya: 6 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ఆచార్య

అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రిస్టింగ్ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఆచార్య చిత్రం టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ రూట్‌లో వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆచార్య సినిమాను కూడా ఆర్ఆర్ఆర్ తరహాలోనే భారీ రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట చిత్ర యూనిట్. ఆర్ఆర్ఆర్ మూవీ రన్‌టైమ్ ఏకంగా 3 గంటల 6 నిమిషాలుగా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆచార్య సినిమా రన్‌టైమ్‌ను ఏకంగా 2 గంటల 46 నిమిషాలుగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

Acharya: ఆచార్య విషయంలో అలా జరగలేదంటోన్న కొరటాల!

ఇది రొటీన్ చిత్రాలకంటే కాస్త ఎక్కువనే చెప్పాలి. అయితే కొరటాల శివ చిత్రాల్లో ఇప్పటివరకు ఇంతటి రన్‌టైమ్‌తో సినిమాలేవీ రాలేదు. మరి నిజంగానే ఆచార్య సినిమా ఇంతటి భారీ రన్‌టైమ్‌తో వస్తుందా లేక ఇది కూడా కేవలం పుకారుగానే మిగిలిపోతుందా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఆచార్య చిత్రంలో చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.