Balakrishna: అవి వాస్తవాలు.. బాలకృష్ణపై తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రశంసలు
నందమూరి బాలకృష్ణ(Balakrishna)పై తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రశంసలు.
Telangana Exhibitors Praise on Nandamuri Balakrishna about single theaters issue
- ఏపీ ఎస్డిసి కమిటీకి అభినందనలు.
- బాలకృష్ణ వ్యాఖ్యలపై చాంబర్ హర్షం.
- సింగిల్ స్క్రీన్ల సమస్యలపై కృతజ్ఞతలు.
Balakrishna: ఏపీ ఎస్డిసి నూతన ఛైర్మన్ గా పి. భరత్ భూషణ్, వైస్ చైర్మన్, డైరెక్టర్లుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సభ్యులకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ హృదయపూర్వక అభినందనలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి దిశగా తీసుకుంటున్న ఈ నిర్ణయం ఎంతో సానుకూలమైన అడుగని పేర్కొంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna) చేసిన వ్యాఖ్యలను చాంబర్ ప్రత్యేకంగా అభినందించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల ప్రస్తుత సంక్షోభ పరిస్థితులపై బాలయ్య వ్యక్తంచేసిన ఆవేదన ఇండస్ట్రీ వాస్తవ పరిస్థితిని ప్రతిబింబిస్తోందని, అనేక థియేటర్లు మనుగడ కోసం పోరాడుతూ మూతపడే పరిస్థితికి చేరుకున్నాయని తెలిపింది.
CM Vijay: సీఎం విజయ్ విప్లవాత్మక నిర్ణయం.. తమిళనాడులో సరికొత్త సినీ రూల్స్
“తెలంగాణ సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు ప్రత్యేక సౌకర్యాలు కోరడం లేదు; థియేటర్లను కాపాడేలా, పరిశ్రమను బలోపేతం చేసేలా న్యాయమైన, స్థిరమైన వ్యవస్థను మాత్రమే కోరుతున్నారు” అని ఫిల్మ్ చాంబర్ స్పష్టం చేసింది. సింగిల్ స్క్రీన్ల సమస్యలను బహిరంగంగా ప్రస్తావించి ఎగ్జిబిటర్లకు మద్దతుగా నిలిచిన నందమూరి బాలకృష్ణకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాయి.
