Acharya: ఆచార్య విషయంలో అలా జరగలేదంటోన్న కొరటాల!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే.....

Acharya: ఆచార్య విషయంలో అలా జరగలేదంటోన్న కొరటాల!

Koratala Slams Rumours Of Acharya Re Shoot

Updated On : April 18, 2022 / 9:18 PM IST

Acharya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేయగా ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 29న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Acharya: ఆచార్య మెగా ట్రీట్.. పోటీపడిన తండ్రీకొడుకులు!

తాజాగా ఈ సినిమా నుండి ‘భలే భలే బంజారా’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో సినీ వర్గాల్లో ఓ పుకారు జోరుగా చక్కర్లు కొట్టింది. ఆచార్య సినిమా ఔట్‌పుట్ సరిగా రాలేదని.. దీంతో మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ రీషూట్ చేశారని చిత్ర వర్గాల్లో వార్తలు వినిపించాయి. అయితే ఇవన్నీ కేవలం గాలివార్తలే అని.. ఇలాంటి రూమర్స్ ఏమాత్రం నమ్మాల్సిన అవసరం లేదని దర్శకుడు కొరటాల శివ క్లారిటీ ఇచ్చాడు.

Acharya: ధర్మస్థలి కోసం స్థలాన్ని మార్చిన ఆచార్య..?

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొరటాల ఈమేరకు క్లారిటీ ఇచ్చారు. కొరటాల తెరకెక్కించిన ఏ సినిమా కూడా ఇప్పటివరకు రీషూట్ చేసుకోలేదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా చిరు, చరణ్ కలిసి స్క్రీన్‌పై కనిపించే సీన్స్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తాయని చిత్ర యూనిట్ అంటోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు.