Acharya: ఆచార్య మెగా ట్రీట్.. పోటీపడిన తండ్రీకొడుకులు!

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఆచార్య సినిమా మరికొన్ని రోజుల్లో మనముందుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్.....

Acharya: ఆచార్య మెగా ట్రీట్.. పోటీపడిన తండ్రీకొడుకులు!

Acharya

Acharya: మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఆచార్య సినిమా మరికొన్ని రోజుల్లో మనముందుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి మరోసారి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏమిటో ప్రూవ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

Acharya: భలే భలే బంజారా సాంగ్ ప్రోమో.. కేకపెట్టించిన చిరు-చరణ్!

తాజాగా ఈ సినిమా నుండి ‘భలే భలే బంజారా’ లిరికల్ సాంగ్ వీడియోను చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసింది. ఇక ఈ వీడియో సాంగ్‌లో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి చిందులేస్తూ కనిపించారు. తండ్రీకొడుకులు ఇద్దరు కూడా భలే భలే బంజారా పాటకు చాలా గ్రేస్‌గా స్టెప్పులు వేస్తూ అభిమానులను అలరించారు. ముఖ్యంగా చిరంజీవి ఈ వయసులో కూడా వేసిన స్టెప్స్ ఈ పాటకే హైలైట్‌గా నిలుస్తాయని చెప్పాలి.

Acharya: ధర్మస్థలి కోసం స్థలాన్ని మార్చిన ఆచార్య..?

అటు రామ్ చరణ్ కూడా తనదైన ఎనర్జీతో ఈ పాటలో స్టెప్స్ వేశాడు. అయితే ఈ పాట మెగా ఫ్యాన్స్‌కు ఓ ట్రీట్ అని చెప్పాలి. చాలా రోజుల తరువాత మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం వారికి సంతోషాన్ని కలిగిస్తోంది. ఇక ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ పవర్‌ఫుల్ కథతో తెరకెక్కించగా, అందాల భామలు కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 29న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.