Nara Lokesh : నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి నారా లోకేశ్.. త్వరలో మరో డీఎస్సీ.. జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్..
Nara Lokesh : ఏపీలోని నిరుద్యోగ యువతకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. త్వరలో మరో డీఎస్సీ కూడా ఇవ్వబోతున్నామని చెప్పారు.
Nara Lokesh
Nara Lokesh : మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి.. దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్‌ను పదవినుంచి తప్పించి, వెంటనే సీబీఐ దర్యాప్తును కోరాలంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
లోకేశ్ ట్వీట్ ప్రకారం.. మీ బాధ, ఆక్రోశం నేను అర్ధం చేసుకోగలను జగన్ రెడ్డిగారూ.. మీ ఐదేళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదు, జాబ్ క్యాలెండర్ కూడా జారీ చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం. 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ జారీ విడుదల చేశాం. త్వరలో మరో డీఎస్సీ కూడా ఇవ్వబోతున్నామని లోకేశ్ ప్రకటించారు. తద్వారా నిరుద్యోగ యువత శుభవార్త చెప్పారు.
మరింత బిగ్గరగా ఏడవడానికి సిద్ధంగా ఉండండి జగన్ గారూ! మీరు టెన్త్ పేపర్లు ఎత్తుకెళ్లిన దొంగ అని అందరూ అలాగే ఉంటారనుకోవడం చాలా పెద్ద నేరం. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో నిద్రాహారాలు మాని, చదివి ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన 16వేల మందిని మీరు అనుమానిస్తున్నారు. మెగా డీఎస్సీలో ఎంపికైన టీచర్లు అందరికీ జగన్ లెంపలు వేసుకుని క్షమాపణలు చెప్పాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.
మెగా డీఎస్సీ ఆపాలని 200 కేసులు, గూగుల్, టీసీఎస్ రాకుండా కోర్టులో కేసులు వేయించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, యువతకు ఉద్యోగాలు లేకుండా వారి భవిష్యత్తు నాశనం చేయాలని చూస్తున్న జగన్.. మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరు అంటూ లోకేశ్ ట్వీట్ లో పేర్కొన్నారు.
మీ బాధ, ఆక్రోశం నేను అర్థం చేసుకోగలను @ysjagan గారు! మీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చెయ్యలేదు, జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. మేం 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. త్వరలోనే మరో డీఎస్సీ కూడా ఇవ్వబోతున్నాం. మరింత బిగ్గరగా ఏడవడానికి… https://t.co/yTD3JMck5r
— Lokesh Nara (@naralokesh) May 25, 2026
