Acharya: ఆచార్యతో యంగ్ హీరో పోటీ.. అవసరమా అంటోన్న ఫ్యాన్స్!

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్ర యూనిట్....

Acharya: ఆచార్యతో యంగ్ హీరో పోటీ.. అవసరమా అంటోన్న ఫ్యాన్స్!

Sree Vishnu Bhala Thandanana To Clash With Acharya

Acharya: మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్ర యూనిట్, ఈ సినిమాను ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్‌ను రాబడుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆచార్యతో పోటీకి రెడీ అయ్యాడు ఓ యంగ్ హీరో.

Acharya: ఆచార్య సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ ఎంతంటే?

తనదైన పాత్రలు చేస్తూ మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘భళా తందనాన’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను చైతన్య దంతులూరి డైరెక్ట్ చేయగా, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ‘భళా తందనాన’ రాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచగా, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Bhala Thandanana: యాక్షన్‌లోకి దిగిన శ్రీవిష్ణు.. లుక్ అదిరిందిగా!

ఈ సినిమాను ఏప్రిల్ 30న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈమేరకు రిలీజ్ డేట్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. అయితే ఏప్రిల్ 29న ఆచార్య చిత్రం రిలీజ్ అవుతుండటంతో, అంతటి భారీ మూవీతో శ్రీవిష్ణు ఎందుకు పోటీ పడుతున్నాడని పలువురు కామెంట చేస్తున్నారు. ఇక ఈ సినిమాలోని కంటెంట్‌పై చిత్ర యూనిట్ పూర్తి ధీమాగా ఉండటంతోనే ఈ సినిమాను ఆచార్యకు పోటీగా రిలీజ్ చేస్తున్నారని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా ఆచార్య లాంటి ప్రెస్టీజియస్ మూవీ ముందర ఈ సినిమా నిలబడుతుందా లేదా అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో కేథరిన్ త్రేసా హీరోయిన్‌గా నటిస్తోంది.