Acharya: ఆచార్య సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ ఎంతంటే?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుస అప్‌డేట్స్‌తో సందడి చేస్తోంది. నిన్నటివరకు కేవలం పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్....

Acharya: ఆచార్య సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ ఎంతంటే?

Acharya Completes Censor Locks Runtime

Acharya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుస అప్‌డేట్స్‌తో సందడి చేస్తోంది. నిన్నటివరకు కేవలం పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ ఉన్న ఆచార్య, ఒక్కసారిగా వేగం పెంచేసింది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లేస్, టైమ్‌ను అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, తాజాగా ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడనే విషయాన్ని కూడా రివీల్ చేశారు. ఇక ఇప్పుడు ఏకంగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ అండ్ రన్‌టైమ్ విషయాలను కూడా చిత్ర యూనిట్ రివీల్ చేసింది.

Acharya: ధర్మస్థలిలో మహేష్.. పవర్‌ఫుల్‌గా మారుతున్న పాదఘట్టం

ఆచార్య చిత్రం తాజాగా సెన్సార్ పనులు ముగించుకోగా, సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. అల్టిమేట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఆచార్య తెరకెక్కడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని సెన్సార్ సభ్యులు కితాబిచ్చినట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి పాత్ర అన్ని ఎమోషన్స్‌ను కలిగి ఉందని, ఆయన ఫ్యాన్స్‌కు ఇది అద్భుతమైన ట్రీట్‌గా రాబోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Acharya: ఆచార్య ఈవెంట్‌లో జక్కన్న మెగా అనౌన్స్‌మెంట్..?

అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని, ఆయన పాత్ర ప్రేక్షకులచే కన్నీళ్లు పెట్టిస్తుందని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఆచార్య చిత్ర రన్‌టైమ్’ను 2 గంటల 34 నిమిషాలుగా లాక్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇలా అన్నీ కలిసొచ్చే అంశాలు ఆచార్య సినిమాకు కుదరడంతో, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తుండగా, ఈ సినిమాను ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.