Acharya: ధర్మస్థలిలో మహేష్.. పవర్‌ఫుల్‌గా మారుతున్న పాదఘట్టం

అనుకున్నదే అయ్యింది.. మెగాస్టార్ సినిమా కోసం సూపర్ స్టార్ రంగంలోకి దిగాడు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమాలో చిరంజీవి నటిస్తుండటంతో ఈ సినిమా...

Acharya: ధర్మస్థలిలో మహేష్.. పవర్‌ఫుల్‌గా మారుతున్న పాదఘట్టం

Mahesh Babu Voice Over For Acharya Is Official

Acharya: అనుకున్నదే అయ్యింది.. మెగాస్టార్ సినిమా కోసం సూపర్ స్టార్ రంగంలోకి దిగాడు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమాలో చిరంజీవి నటిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో, తండ్రీ కొడుకులను ఒకే స్క్రీన్‌పై చూసేందుకు మెగా ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు.

Acharya: ఆచార్య కోసం మహేష్ బాబు.. నిజమేనా?

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఇండస్ట్రీ వర్గాల్లో వరుసగా పలు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆచార్య చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా భాగం కాబోతున్నాడనే వార్త తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ సినిమాలో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడనే వార్త నిన్న సోషల్ మీడియాలో జోరుగా వినిపించింది. ఇప్పుడు ఈ వార్తను నిజం చేస్తూ ఆచార్య చిత్ర మేకర్స్ ఇదే విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఆచార్య చిత్రంలోని పాదఘట్టంను పరిచయం చేసే క్రమంలో మనకు మహేష్ బాబు వాయిస్ వినిపిస్తుంది.

Acharya: ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సర్‌ప్రైజ్ గెస్ట్..?

ఇక ఈ సినిమా స్టార్టింగ్ రెండు నిమిషాల్లోనే ప్రేక్షకులను ధర్మస్థలిలోకి తీసుకెళ్లేందుకు మహేష్ వాయిస్ బాగా ఉపయోగపడుతుందని చిత్ర దర్శకుడు కొరటాల శివ అంటున్నారు. మహేష్ వాయిస్‌లోని ఇంటెన్సిటీ ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడానికి చాలా సహాయపడుతుందని.. అందుకే తాను ఈ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందిగా మహేష్‌ను కోరగానే.. ఆయన వెంటనే ఓకే అనడంతో చాలా సంతోషంగా ఉందని కొరటాల అన్నారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్న ఆచార్య చిత్రానికి మణిశర్మ బాణీలు అందిస్తున్నారు.

Acharya: ఆచార్య కోసం అందరినీ వాడేస్తున్న కొరటాల!

అయితే గతంలోనూ మహేష్ బాబు పలు సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అప్పట్లో ఓ సెన్సేషన్. ఆ సినిమా విజయంలో మహేస్ వాయిస్ ఓవర్ కూడా బాగా హెల్ప్ అయ్యిందని త్రివిక్రమ్ అన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బాద్‌షా చిత్రంలోనూ మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇక తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘శ్రీశ్రీ’ సినిమా కోసం కూడా మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న ‘మేజర్’ సినిమాలో కూడా మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ఇక ఇప్పుడు ఆచార్యలోనూ మహేష్ వాయిస్ ఓవర్ ఇస్తుండటంతో ఈ సినిమా కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.