Acharya: ఆచార్య కోసం మహేష్ బాబు.. నిజమేనా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ....

Acharya: ఆచార్య కోసం మహేష్ బాబు.. నిజమేనా?

Is Mahesh Babu Lending Voice Over To Acharya

Acharya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో మరోసారి మెగాస్టార్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీని దర్శకుడు కొరటాల తనదైన మార్క్ టేకింగ్‌తో ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దినట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Acharya: ఆచార్య కోసం వస్తున్న వీరమల్లు..?

అయితే ఆచార్య సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచింది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్‌ను వరుసబెట్టి రిలీజ్ చేస్తూ ఆచార్య చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ 23న నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ వేడుకకు ఎవరు ముఖ్య అతిథిగా వస్తారనే విషయంపై చిత్ర వర్గాల్లో చర్చ సాగుతోంది. కాగా ఆచార్య చిత్రానికి సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్‌గా మారింది.

Acharya: ఆర్ఆర్ఆర్ రూట్‌లో ఆచార్య..?

ఆచార్య చిత్రంలో మహేష్ బాబు సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా కోసం మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది. ఆచార్య చిత్రంలోని ప్రధానమైన పాదఘట్టం ప్రాంతానికి సంబంధించిన విషయాలను మహేష్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. కొరటాల శివతో మహేష్‌కు ఉన్న మంచి రిలేషన్ కారణంగా ఆయన ఈ సినిమాలో వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందిగా కోరగానే, మహేష్ కూడా వెంటనే ఓకే చేప్పినట్లుగా తెలుస్తోంది. మరి నిజంగానే ఆచార్య చిత్రంలో మహేష్ వాయిస్ ఓవర్ ఉండబోతుందా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.