Acharya: ఆచార్య కోసం వస్తున్న వీరమల్లు..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తనదైన మార్క్‌తో....

Acharya: ఆచార్య కోసం వస్తున్న వీరమల్లు..?

Pawan Kalyan To Grace Acharya Pre Release Event

Acharya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 29న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Acharya: ఆర్ఆర్ఆర్ రూట్‌లో ఆచార్య..?

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్‌ను ప్రారంభించారు చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేయగా.. ట్రైలర్, భలే భలే బంజారా పాటలు ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే తాజాగా ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తొలుత ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకకు ఏపీ సీఎం జగన్ వస్తారని.. ఈ ఈవెంట్‌ను విజయవాడలో నిర్వహిస్తారనే వార్తలు వచ్చాయి.

Acharya: చిరుతో చరణ్ మ్యాసివ్ సీన్స్.. మెగా ఫ్యాన్స్ వెయిటింగ్!

కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను హైదరాబాద్‌కు షిఫ్ట్ చేశారని.. అలాగే అన్నయ్య మెగాస్టార్ కోసం తమ్ముడు పవర్ స్టార్ రంగంలోకి దిగుతున్నాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. పవన్‌తో పాటు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి కూడా ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రాబోతున్నాడట. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. మరి నిజంగనే ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తే.. ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌లను చూసేందుకు రెండు కళ్లు చాలవని అంటున్నారు మెగా ఫ్యాన్స్.