Priyanka Jain : ఇన్నాళ్లు లివ్ ఇన్.. ఇప్పుడు ప్రియాంకతో పెళ్లి అనౌన్స్ చేసిన శివకుమార్.. ఎప్పుడు, ఎక్కడంటే..?
తాజాగా శివకుమార్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ పెళ్లిపై స్పందించాడు. (Priyanka Jain)
Priyanka Jain
- గత కొన్నేళ్లుగా ప్రేమ
- ప్రస్తుతం లివ్ ఇన్ లో ఉన్న ప్రియాంక – శివకుమార్
- పెళ్లి గురించి ప్రకటించిన శివకుమార్
Priyanka Jain : సీరియల్ నటులు ప్రియాంక జైన్ – శివకుమార్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూ లివ్ ఇన్ లో కూడా ఉంటున్నారు. మౌనరాగం సీరియల్ లో పరిచయం అయిన ఈ ఇద్దరూ ఆ సీరియల్ సమయంలోనే ఫ్రెండ్స్ అయి అనంతరం ప్రేమికులుగా మారారు. వీళ్ళిద్దరూ లివ్ ఇన్ లో ఉండటంతో అందరూ పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు.
తాజాగా శివకుమార్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ పెళ్లిపై స్పందించాడు.
Also Read : Shivakumar : ప్రియాంకతో కంటే ముందే శివకు ఇంకో లవ్ స్టోరీ.. తనకంటే ఏడేళ్లు పెద్ద అమ్మాయితో..
శివకుమార్ మాట్లాడుతూ.. మాది ఏడేళ్ల ప్రేమ. తనే ముందు ప్రపోజ్ చేసింది. తను ప్రపోజ్ చేసిన రెండు రోజుల తర్వాత నేను ఓకే చెప్పాను. మేము లివ్ ఇన్ లో ఉండటానికి మా పేరెంట్స్ పర్మిషన్స్ తీసుకున్నాం. వాళ్ళు ఒప్పుకున్నాకే మేము లివ్ ఇన్ లో ఉంటున్నాము.
మేమిద్దరం కలిసి ఒక ఇల్లు కట్టుకుంటున్నాము. త్వరలోనే అది పూర్తవుతుంది. అది అవ్వగానే ఈ సంవత్సరంలోనే పెళ్లి చేసేసుకుంటాము. ఉత్తరాఖండ్ లో యోగి నారాయణ్ టెంపుల్ లో పెళ్లి చేసుకోవాలనుకున్నాము. శివ పార్వతిల వివాహం కూడా అక్కడే జరిగింది అంటారు. అక్కడ పెళ్లి చేసుకొని తర్వాత హైదరాబాద్ లో రిసెప్షన్ చేసుకుంటాము. ఫ్యూచర్ లో మేము కట్టుకునే ఇంట్లోనే నేను మా ఫ్యామిలీతో, తను వాళ్ళ ఫ్యామిలీతో అందరం కలిసే ఉంటాము అని తెలిపాడు.
