Shivakumar : ప్రియాంకతో కంటే ముందే శివకు ఇంకో లవ్ స్టోరీ.. తనకంటే ఏడేళ్లు పెద్ద అమ్మాయితో..
తాజాగా శివకుమార్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక జైన్ కంటే ముందే తనకు ఇంకో లవ్ స్టోరీ ఉందని తెలిపాడు (Shivakumar)
Shivakumar
Shivakumar : మౌనరాగంతో పాటు పలు కన్నడ, తెలుగు టీవీ సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు శివకుమార్. ఆ తర్వాత నటి ప్రియాంక జైన్ లవర్ గా మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోలు, రీల్స్ షేర్ చేస్తూ తమ ప్రేమని అందరికి తెలియచేస్తూ ఉంటారు.
తాజాగా శివకుమార్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక జైన్ కంటే ముందే తనకు ఇంకో లవ్ స్టోరీ ఉందని తెలిపాడు.
శివకుమార్ మాట్లాడుతూ.. 20 ఏళ్ళ అప్పుడు నా మొదటి లవ్. మూడేళ్లు ప్రేమ అది. నా కంటే ఆ అమ్మాయి ఏడేళ్లు పెద్ద. ప్రియాంక జైన్ పరిచయం అయ్యేసరికి నేను ఆమెతో ప్రేమలోనే ఉన్నా. అప్పుడు నాకు ప్రియాంక సపోర్ట్ కూడా చేసింది. ఆ అమ్మాయి బర్త్ డే రోజు కేక్ ప్రియాంకనే తీసుకొచ్చింది. నాకు ఆమెకు ఏడేళ్లు డిఫరెన్స్ ఉండటంతో అప్పట్లో నేను అంత మెచ్యూర్ గా ఆలోచించలేకపోయాను. తను నాకంటే మెచ్యూర్డ్.
తనకు లైఫ్ లో సెటిల్ అవ్వాలి, ఏజ్ పెరిగిపోతుంది అని ఒకటి ఉంది. అందుకే బ్రేకప్ అయింది. తను వెళ్ళిపోయినప్పుడు చాలా ఏడ్చాను. ఆ బ్రేకప్ బాధ నుంచి బయటకు రావడానికి మా అమ్మ, చెల్లి సపోర్ట్ చేసారు. ఇప్పుడు తనకు పెళ్లి అయి పాప కూడా పుట్టింది. ప్రియాంకకు ఇవన్నీ తెలుసు. తను నా గతాన్ని గుర్తు చేయదు అని తెలిపాడు.
