Acharya: చిరుతో చరణ్ మ్యాసివ్ సీన్స్.. మెగా ఫ్యాన్స్ వెయిటింగ్!

నెల తిరక్కుండానే మళ్లీ మల్టీస్టారర్ స్టెప్పులేసారు రామ్ చరణ్. ఈసారీ తండ్రి చిరంజీవితో కలిసి చిరుత పులుల చిందాటను చూపించారు.

Acharya: చిరుతో చరణ్ మ్యాసివ్ సీన్స్.. మెగా ఫ్యాన్స్ వెయిటింగ్!

Acharya

Acharya: నెల తిరక్కుండానే మళ్లీ మల్టీస్టారర్ స్టెప్పులేసారు రామ్ చరణ్. ఈసారీ తండ్రి చిరంజీవితో కలిసి చిరుత పులుల చిందాటను చూపించారు. ఒకరు మెగాస్టార్, మరొకరు మెగాపవర్ స్టార్… ఇంకేముంది తగ్గదే లే అన్నట్టు పోటాపోటీగా స్టెప్పులేసి ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ ఇచ్చారు. ఇంకేముంది ఆచార్యలో తండ్రీకొడుకుల కెమిస్ట్రీని ఫుల్ గా చూసేందుకు ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడా అంటున్నారు.

Acharya: ఆచార్య విషయంలో అలా జరగలేదంటోన్న కొరటాల!

పోటాపోటీ స్టెప్పులతో నువ్వా నేనా అనిపించారు చిరూ – చరణ్. సాంగ్ రిలీజ్ కి ముందే తగ్గను గాక తగ్గననుకున్న ఈ తండ్రీకొడుకులు పవర్ఫుల్ మూమెంట్స్ తో ఫ్యాన్య్ కి కావాల్సినంత ట్రీట్ ఇచ్చారు. అయితే మొత్తం సాంగ్ చూడాలన్నా… చిరూ, చరణ్ మ్యాసివ్ సీన్స్ ను ఎంజాయ్ చేయాలన్నా ఆచార్య థియేటర్స్ కి వచ్చేవరకు ఆగాల్సిందే. అందుకే మెగాఫ్యాన్స్ ఎప్పెడెప్పుడా అని ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. కొరటాల మేకింగ్ స్టైల్ లో మెగా హీరోల యాక్షన్ స్టైల్ అదిరిపోతుందనే అంచనాలు పెంచేసుకుంటున్నారు.

Acharya: ఆచార్య మెగా ట్రీట్.. పోటీపడిన తండ్రీకొడుకులు!

తారక్ తో కలిసి వేసిన నాటు స్టెప్పులు ఓవైపు ట్రెండ్ లో ఉండగానే… చరణ్ మళ్లీ ఇలా తనదైన స్టైల్లో దచ్చికొట్టాడని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. సీనియర్ గా మారినా కొడుకుతో పోటీగా చిరూ రంగంలోకి దిగడం అందరికీ కిక్ ఇస్తోంది. గతంలో మగధీర, ఖైదీ నంబర్ 786 వంటి సినిమాల్లో ఈ కాంబో మెరిపించినా… ఈసారి మాత్రం అంతకుమించిన స్టఫ్ తో ఆడియెన్స్ కు మెగా ట్రీట్ ఇవ్వబోతున్నారు. దాదాపు 30 నిమిషాల సేపు ఆచార్యలో కనిపించే మెగాపవర్ స్టార్.. మెగాస్టార్ తో కలిసి చేసిన సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని మేకర్స్ చెప్తున్నారు.