Acharya: ఆచార్య కోసం అందరినీ వాడేస్తున్న కొరటాల!

మరో వారం రోజుల్లో ఆచార్య రిలీజ్ కాబోతోంది. ఎప్పుడో మూడేళ్ల క్రితం మొదలైన ఆచార్యని ధియేటర్ దాకా తీసుకురావడానికి కొరటాల తెగ కష్టపడుతున్నారు.

Acharya: ఆచార్య కోసం అందరినీ వాడేస్తున్న కొరటాల!

Acharya

Acharya: మరో వారం రోజుల్లో ఆచార్య రిలీజ్ కాబోతోంది. ఎప్పుడో మూడేళ్ల క్రితం మొదలైన ఆచార్యని ధియేటర్ దాకా తీసుకురావడానికి కొరటాల తెగ కష్టపడుతున్నారు. చిరంజీవి, చరణ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఆచార్యకు అసలు వీళ్లిద్దరే హైలెట్ అనుకుంటే.. టాలీవుడ్ లో కనపడిన స్టార్ హీరోలందర్నీ సినిమాలో దింపేస్తున్నారు కొరటాల.

Acharya: ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సర్‌ప్రైజ్ గెస్ట్..?

2019లో మొదలైన ఆచార్య మొత్తానికి 2022లో ధియేటర్లోకి రాబోతోంది. ఏప్రిల్ 29న మరో వారం రోజుల్లో సినిమా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చిరంజీవి, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో కొరటాల డైరెక్షన్లో తెరకెక్కిన ఆచార్య సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచే సెన్సేషన్ అయ్యింది. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాలో మరో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుని కూడా యాడ్ చేసి స్టార్ స్టడెడ్ మూవీ చేసేశారు కొరటాల.

Acharya Pre Release Event: అన్న కోసం తమ్ముడు.. అభిమానులకు కన్నుల పండుగ!

కొరటాల శివ ఫస్ట్ చిరంజీవితో ఆచార్యని అనౌన్స్ చేశారు. తర్వాత రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేస్తే బావుంటుందని చరణ్ ని కూడా రంగంలోకి దింపారు. గెస్ట్ రోల్ కాస్తా.. వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ అయిపోయారు రామ్ చరణ్. ఇద్దరు హీరోలకే జనాలు పిచ్చెక్కిపోతుంటే.. లేటెస్ట్ గా మరో స్టార్ హీరో మహేష్ బాబును కూడా సినిమాలో యాడ్ చేశారు. ఆచార్య సినిమాలో నెరేషన్ తో పాటు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వాయిస్ ఇవ్వడానికి ఏకంగా సూపర్ స్టార్ నే రంగంలోకి దింపారు కొరటాల.

Acharya: 6 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ఆచార్య

చిరంజీవి, చరణ్ తోపాటు.. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో సినిమా రేంజ్ నెక్ట్స్ లెవల్ కి వెళ్లిపోయింది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఆల్రెడీ పవర్ స్టార్ ని, స్టార్ డైరెక్టర్ రాజమౌళిని కూడా లైన్లో పెట్టేశారు కొరటాల. ఈశనివారం హైదరాబాద్ యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ని ఫిక్స్ చెయ్యడంతో ఆచార్యకి ఈ రూపంలో మరో స్టార్ హీరో క్రేజ్ తోడయ్యింది. ఇలా చిరంజీవితో మొదలుపెట్టి మహేష్ బాబు వరకూ కనపడిన వాళ్లందర్నీ ఆచార్య కోసం తెగవాడేస్తున్నారు కొరటాల.