Adivi Sesh : అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన టాలీవుడ్ నటుడు అడివి శేష్..

టాలీవుడ్ యాక్టర్, రైటర్ అడివి శేష్ అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు.. ప్రస్తుతం ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు..

Adivi Sesh : అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన టాలీవుడ్ నటుడు అడివి శేష్..

Adivi Sesh

Adivi Sesh: పాపులర్ టాలీవుడ్ యాక్టర్, రైటర్ అడివి శేష్ అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు.. కొద్ది రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు శేష్.. దీని కారణంగా ప్లేట్ లెట్ల సంఖ్య బాగా పడిపోవడంతో ఆయన ఆరోగ్యం దెబ్బతింది.

ANR Jayanthi : ఏఎన్నార్ లివ్స్ ఆన్.. నాగార్జున ఎమోషనల్ వీడియో..

కుటుంబ సభ్యులు శేష్‌ను ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ప్రస్తుతం వైద్యులు చికిత్సనందిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. 26/11..ముంబై తాజ్ హోటల్‌పై ముష్క‌రులు జరిపిన దాడిలో ఎన్ఎస్‌జీ కమెండో మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ప్ర‌జ‌ల‌ను ప్రాణాల‌ను కాపాడిన సంగతి తెలిసిందే. ఈ రియ‌ల్ హీరో ఉన్ని కృష్ణ‌న్ పాత్ర‌లో టాలెంటెడ్ యాక్టర్ అడివిశేష్ హీరోగా న‌టిస్తున్న సినిమా.. ‘మేజ‌ర్‌’.

MAJOR

తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందుతున్న ఈ సినిమాను ఘ‌ట్ట‌మ‌నేని మ‌హేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చ‌ర్స్‌, ఎప్ల‌స్ఎస్ మూవీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ‘గూఢ‌చారి’ త‌ర్వాత శేష్‌తో శోభిత ధూళిపాల క‌లిసి న‌టిస్తోన్న రెండో సినిమా ఇది.

Samantha : గ్యాంగ్‌తో చిల్ అయిన సమంత..