Adipurush : పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్.. ఎన్ని భాషలు, థియేటర్లో తెలుసా!

పాన్ ఇండియా స్థాయిని దాటేసి పాన్ వ‌రల్డ్ రేంజ్‌కి చేరుకున్న ప్రభాస్ ‘ఆదిపురుష్’..

Adipurush : పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్.. ఎన్ని భాషలు, థియేటర్లో తెలుసా!

Adipurush

Adipurush: సినిమా సినిమాకి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ‘బాహుబలి’ తో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రేజ్‌ని, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని అంతకంతకు పెంచుకుంటూ అదిరిపోయే లైనప్ చేశారు. ‘ఆదిపురుష్’ తో డార్లింగ్ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

Prabhas : బాక్సాఫీస్ ‘బాహుబలి’.. రెమ్యునరేషన్‌తో పాటు థియేట్రికల్ షేర్!

రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్, ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్’.. ప్రభాస్, రాముడి పాత్రలో కనిపించబోతున్నారు. సీతగా కృతి సనన్, లంకేశ్వరుడిగా సైఫ్ అలీ ఖాన్, భీముడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు.

Prabhas : మన తెలుగోడురా భయ్.. ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా ప్రభాస్..

పక్కా ప్లానింగ్‌తో అనుకున్న టైంకి షూట్ కంప్లీట్ చేశారు డైరెక్టర్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద ఫోకస్ పెట్టారు. రీసెంట్‌గా ప్రభాస్ ఫ్యాన్స్‌ని, తెలుగు ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు టీం. రూ. 400 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ‘ఆదిపురుష్’ చిత్రాన్ని ఒకే స‌మ‌యంలో 15 దేశీయ‌, అంత‌ర్జాతీయ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు.

Radhe Shyam : రెబల్ స్టార్ రేంజ్.. నార్త్‌లో బిగ్గెస్ట్ రిలీజ్..

కేవ‌లం భార‌త్‌లోనే కాకుండా ఇత‌ర దేశాల్లో క‌లిపి ఏకంగా 20,000 థియేట‌ర్ల‌లో ‘ఆదిపురుష్‌’ను విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. దీన్ని బ‌ట్టి ‘ఆదిపురుష్’ పాన్ ఇండియా స్థాయిని దాటేసి పాన్ వ‌రల్డ్ రేంజ్‌కి వెళ్లిన‌ట్లే మరి.

Shruti Haasan : ప్రభాస్ ప్రేయసి ‘ఆద్య’ గా శృతి హాసన్..