Prabhas : మన తెలుగోడురా భయ్.. ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా ప్రభాస్..

ఇండియాలో ఇంత భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న ఏకైక హీరోగా ప్రభాస్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు..

Prabhas : మన తెలుగోడురా భయ్.. ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా ప్రభాస్..

Prabhas Remuneration

Prabhas: ‘బాహుబలి’ రెబల్ స్టార్ ప్రభాస్‌ క్రేజ్‌ని కొండెక్కించింది. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రభాస్‌కి ఫ్యాన్స్ అయ్యారు. తర్వాత ‘సాహో’ సినిమాకి ఎంత హైప్ వచ్చిందో తెలిసిందే. ఇక డార్లింగ్ టాలీవుడ్‌కి మాత్రమే పరిమితం కాదు. ‘ఆదిపురుష్’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.

Radhe Shyam : చార్టర్డ్ ఫ్లైట్‌లో ప్రభాస్.. ప్లాన్ అదిరిందిగా!

‘బాహుబలి’ తీసుకొచ్చిన పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌ని కాపాడుకోవడానికి ఎంతలా కష్టపడాలో అంతా పడుతున్నాడు ప్రభాస్. ‘రాధే శ్యామ్’ కోసం కేవలం ఒక్క నార్త్‌లోనే 3,500 స్క్రీన్లు బుక్ చేశారంటే రెబల్ స్టార్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ‘సలార్’, ‘ప్రాజెక్ట్-K’, ‘స్పిరిట్’ సినిమాలతో మన తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచబోతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.

Radhe Shyam : రెబల్ స్టార్ రేంజ్.. నార్త్‌లో బిగ్గెస్ట్ రిలీజ్..

ఇంతటి క్రేజ్.. వరుసగా పాన్ ఇండియా అండ్ పాన్ వరల్డ్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ రెమ్యునరేష్ ఎంత ఉంటుంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. డార్లింగ్ ఒక్క సినిమాకి అక్షరాలా రూ.150 కోట్లు తీసుకుంటున్నారు. ఇండియాలో ఇంత భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న ఏకైక హీరోగా ప్రభాస్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు.

Adipurush : పక్కా పాన్లింగ్.. అనుకున్న టైంకే ‘ఆదిపురుష్’

డిసెంబర్ నుండి ‘రాధే శ్యామ్’ ప్రమోషన్స్ కోసం ఇండియాలోని ప్రధాన నగరాల్లో పర్యటించనున్నారు రెబల్ స్టార్. సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ‘సలార్’ సమ్మర్‌లో, ‘ఆదిపురుష్’ ఆగస్టులో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Prabhas : ప్రభాస్ ఫ్యామిలీ గొప్పదనం.. పనిమనిషికి సన్మానం..