Radhe Shyam : చార్టర్డ్ ఫ్లైట్‌లో ప్రభాస్.. ప్లాన్ అదిరిందిగా!

క్రిస్మస్ తర్వాత ‘రాధే శ్యామ్’ ప్రమోషన్స్‌ కోసం భారీ ప్లాన్ వేసిన ప్రభాస్..

Radhe Shyam : చార్టర్డ్ ఫ్లైట్‌లో ప్రభాస్.. ప్లాన్ అదిరిందిగా!

Radhe Shyam Promotions

Updated On : November 20, 2021 / 3:07 PM IST

Radhe Shyam: రెబల్ స్టార్, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అభిమానుల మూడేళ్ల ఎదురూచూపులకు మరికొద్ది రోజుల్లో తెర పడనుంది. ‘రాధే శ్యామ్’ 2022 జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక నార్త్‌లోనూ బిగ్గెస్ట్ రిలీజ్ ప్లాన్ చేశారు.

Radhe Shyam : 30 నిమిషాల పాటు భారీ షిప్‌లో

క్రిస్మస్ తర్వాత డార్లింగ్ ‘రాధే శ్యామ్’ ప్రమోషన్స్‌లో పాల్గొనబోతున్నాడు. ‘బాహుబలి’ తరహాలోనే ఇండియాలోని మెయిన్ సిటీస్‌లో ఏర్పాటు చెయ్యబోయే ప్రమోషన్స్‌కి ప్రభాస్ అటెండ్ అవబోతున్నారు. ఇందుకోసం ఓ చార్టర్డ్ ఫ్లైట్ రెంట్‌కి తీసుకోబోతున్నారు రెబల్ స్టార్. ఇటీవల రిలీజ్ చేసిన ‘ఈ రాతలే’ లిరికల్ సాంగ్‌కి అదిరపోయే రెస్పాన్స్ వస్తోంది.

Prabhas Family : ఫ్యామిలీ పెద్దదే డార్లింగ్..!

పూజా హెగ్డే కథానాయికగా నటించగా.. రెబల్ స్టార్ డా.కృష్ణంరాజు కీలకపాత్రలో కనిపించనున్నారు. టీ సిరిస్ సంస్థతో కలిసి.. గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల మీద వంశీ, ప్రమోద్, ప్రసీద (ప్రభాస్ సిస్టర్) ఈ పాన్ ఇండియా సినిమాను భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

ప్రభాస్ చెల్లెళ్ల పెద్ద మనసు.. అత్యధిక విరాళమిచ్చింది రాజుగారి ఫ్యామిలీనే..