Prabhas : ప్రభాస్ ఫ్యామిలీ గొప్పదనం.. పనిమనిషికి సన్మానం..

తమ ఇంట్లో పాతికేళ్లుగా పని చేస్తున్న పద్మను కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించారు..

10TV Telugu News

Prabhas: రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబం అతిథులకు చేసే మర్యాదల గురించి ఇండస్ట్రీలో ఎవరినడిగినా చెప్తారు. ఇక ఆ ఫ్యామిలీతో అనుబంధం ఉన్నవారైతే వారి గొప్పదనం, మంచితనం గురించి కథకథలుగా చెప్తారు. కృష్ణంరాజు నట వారసుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కి కూడా పెదనాన్న నుండి ఈ అలవాట్లు అబ్బాయి.

Prabhas : ప్రభాస్ బిర్యానీకి బాలీవుడ్ భామ ఫిదా..

ఇప్పటికే చాలామంది సినిమావాళ్లు డార్లింగ్ ఫుడ్ పెట్టి చంపేస్తాడు అంటూ సరదాగా కామెంట్స్ చేశారు. ఇటీవల తన బిర్యానీ టేస్ట్ బాలీవుడ్ కపుల్ సైఫ్-కరీనాలకు కూడా చూపించాడు. ఇంటికి వచ్చే అతిథులనే అంత బాగా చూసుకుంటే ఇక ఇంట్లో పనిచేసే వాళ్లని ఎలా చూసుకుంటారో చెప్పక్కర్లేదు. సొంత మనిషిలా చూసుకుంటారు.

Prabhas : సింహం.. తిమింగలం.. ప్రభాస్ ఫ్యాన్స్ బ్యానర్స్ అదుర్స్..

అందుకు చిన్న ఉదాహరణ ఏంటంటే.. కృష్ణంరాజు ఇంట్లో పాతికేళ్లుగా పద్మ అనే ఆవిడ పనిచేస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా తమ బాగోగులు చూసుకుంటూ నమ్మకంగా ఉన్న పద్మ తమ వద్ద పని చెయ్యడం మొదలు పెట్టి పాతిక సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు కృష్ణంరాజు కుటుంబ సభ్యులు.

Prabhas : బర్త్‌డే సర్‌ప్రైజెస్ వచ్చేస్తున్నాయ్ డార్లింగ్స్..

25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటూ ఆమె చేత కేక్ కట్ చేయించి కృతజ్ఞతలు తెలిపారు కృష్ణంరాజు దంపతులు. పద్మ వారి ఆశీర్వాదం తీసుకున్నారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి, పద్మకు గోల్డ్ ఛైన్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇన్నేళ్లుగా తమకు తోడుగా ఉన్న పద్మకు థ్యాంక్స్ చెబుతూ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ప్రభాస్ సోదరి ప్రసీద ఉప్పలపాటి.

×