Airtel New Prepaid Plans : ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ డేటా ప్లాన్.. హైస్పీడ్ డేటా కోసం ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!

Airtel New Prepaid Plans : ఎయిర్‌టెల్ రోజువారీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత అదనంగా హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటా అవసరమయ్యే యూజర్ల కోసం ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ డేటా ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

Airtel New Prepaid Plans : ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ డేటా ప్లాన్.. హైస్పీడ్ డేటా కోసం ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!

Airtel introduces new prepaid plan with 6GB bundled data benefits

Airtel New Prepaid Plans Data Benefits : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ (Bharati Airtel) తన లైనప్‌కు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్ 6GB ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. రోజువారీ డేటా లిమిట్ దాటిన తర్వాత ఇంటర్నెట్ డేటాను ఈ డేటా వోచర్‌ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. వోడాఫోన్ ఐడియా (Vodafone idea) ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఇలాంటి డేటా వోచర్‌ను రిలీజ్ చేసిన కొద్ది రోజులకే ఎయిర్‌టెల్ ఈ కొత్త డేటా ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కొత్తగా వచ్చిన ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ డేటా వోచర్, ఆఫర్‌లను వివరంగా పరిశీలిద్దాం.

ఎయిర్‌టెల్ రూ. 49 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ అందించే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ 1 రోజు వ్యాలిడిటీతో 6GB డేటాను అందిస్తుంది. టెలికాం టాక్ ప్రకారం.. కొత్త ప్రీపెయిడ్ డేటా వోచర్ స్వతంత్ర ప్లాన్ కాదని గమనించాలి. కొత్తగా చేర్చిన డేటా ప్లాన్ బెనిఫిట్స్ పొందాలంటే యూజర్లు యాక్టివ్ బేస్ ప్లాన్ కలిగి ఉండాలి. ఈ ప్లాన్ నిర్దిష్ట కాలానికి అదనపు డేటా అవసరమయ్యే యూజర్లకు WiFi యాక్సెస్ లేని సమయాల్లో ప్రత్యేకంగా అందిస్తోంది.

Read Also : Artificial intelligence : AIతో తీవ్ర పరిణామాలు, మనుషుల్ని చంపే ఘోరమైన ఆయుధాల్ని కూడా తయారు చేస్తుందంటూ వార్నింగ్

ఎయిర్‌టెల్ యూజర్లు సరికొత్త ప్లాన్ కోసం చూస్తున్నారా? ఈ ప్లాన్ ధరను రూ. 58 డేటా ప్లాన్‌గా పొడిగించింది. ప్రీపెయిడ్ వోచర్ ప్రస్తుత బేస్ ప్లాన్ వరకు వ్యాలిడిటీతో 3GB డేటాను అందిస్తుంది. డేటా, వ్యాలిడిటీ అవసరమైతే.. ఎయిర్‌టెల్ రూ.98 ప్లాన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌తో యూజర్లు (Wynk Music) ప్రీమియం అదనపు బెనిఫిట్స్‌తో పాటు ప్రస్తుత ప్లాన్ వ్యాలిడిటీతో 5GB డేటాను అందుకోవచ్చు.

Airtel introduces new prepaid plan with 6GB bundled data benefits

Airtel New Prepaid Plans with 6GB bundled data benefits

ఎయిర్‌టెల్ తన 5G నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా సర్వీసులను అందిస్తోంది. టెలికాం ఆపరేటర్ ప్రస్తుతం భారత మార్కెట్లో 3వేల కన్నా ఎక్కువ నగరాలు/పట్టణాల్లో 5G NSA (స్వతంత్రం కాని నెట్‌వర్క్) నెట్‌వర్క్‌ను అందిస్తోంది. డిసెంబర్ 2023 చివరి నాటికి ముఖ్యమైన నగరాలు/పట్టణాలను కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 5G సపోర్టు గల స్మార్ట్‌ఫోన్‌ను కలిగిన ఎయిర్‌టెల్ యూజర్లు తమ ప్రస్తుత రూ. 239, అంతకంటే ఎక్కువ ప్లాన్‌పై అన్‌లిమిటెడ్ Airtel 5G డేటాను పొందవచ్చు.

ఎయిర్‌టెల్ (Airtel 5G)ని యాక్టివేట్ చేసేందుకు (Airtel Thanks) యాప్‌ని సందర్శించి 5G డేటా ఆఫర్‌ను పొందండి. అందుబాటులో ఉన్న 5G నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయ్యేందుకు Device Settings > Cellular Network>కి వెళ్లి Airtel SIM కోసం చెక్ చేయండి> 5G నెట్‌వర్క్‌ను ON చేయండి.

ఈ సమయంలో, (Reliance Jio) స్వతంత్ర నెట్‌వర్క్‌ను ముఖ్యమైన నగరాలు/పట్టణాలలో కూడా విస్తరిస్తోంది. రిలయన్స్ జియో (Reliance Jio) రూ. 239, అంతకంటే ఎక్కువ యాక్టివ్ బేస్ ప్లాన్‌తో యూజర్లకు 5G డేటాను ఉచితంగా అందిస్తోంది. జియో యూజర్లు రూ. 239 లోపు ప్లాన్‌ తీసుకుంటే.. 5G నెట్‌వర్క్‌కు యాక్సెస్ పొందడానికి రూ.61 డేటా రీఛార్జ్‌ని పొందవచ్చు.

Read Also : Pan-Aadhaar Linking Deadline : పాన్-ఆధార్ లింక్ డెడ్‌లైన్ ఇదిగో.. ఈ తేదీలోగా లింక్ చేయలేదంటే.. ఏం జరుగుతుందో తెలుసా?