Artificial intelligence : AIతో తీవ్ర పరిణామాలు, మనుషుల్ని చంపే ఘోరమైన ఆయుధాల్ని కూడా తయారు చేస్తుందంటూ వార్నింగ్

మనిషి తన మేథస్సుతో సృష్టించిన టెక్నాలజీ ఆ మనిషి మనుగడకే ముప్పు తెస్తుందా? మనిషి రూపొందించిన టెక్నాలజీ ఆ మనిషిని అంతమొందించటానికి ఆయుధాలను తయారు చేస్తుందా? అంటే నిజమేనంటున్నారు. కృత్రిమ మేథ (Artificial intelligence) ఏకంగా మనుషుల్ని అంతమొందించే ఘోరమైన ఆయుధాన్ని ఉత్పత్తి చేస్తుందట..!

Artificial intelligence : AIతో తీవ్ర పరిణామాలు, మనుషుల్ని చంపే ఘోరమైన ఆయుధాల్ని కూడా తయారు చేస్తుందంటూ వార్నింగ్

Artificial intelligence

Artificial intelligence : మనిషి తన మేథస్సుతో సృష్టించిన టెక్నాలజీ ఆ మనిషి మనుగడకే ముప్పు తెస్తుందా? టెక్నాలజీ మనిషి మనుగడకు ప్రశ్నార్థకంగా మారుతుందా? మనిషి రూపొందించిన టెక్నాలజీ ఆ మనిషిని అంతమొందించటానికి ఆయుధాలను తయారు చేస్తుందా? అంటే నిజమేనంటున్నారు. కృత్రిమ మేథ (Artificial intelligence) వల్ల మనుషుల ఉపాధి తగ్గిపోయే అవకాశాలున్నాయనే అనుకుంటున్నాం గానీ ఏకంగా అదే (Artificial intelligence)టెక్నాలజీ  మనుషుల్ని అంతమొందించే ఘోరమైన ఆయుధాన్ని ఉత్పత్తి చేస్తుందని హెచ్చరిస్తున్నారు. మనుషుల్ని చంపే ఆయుధాలను ఏఐ (AI)సృష్టించగలదు..అంటూ బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్‌ సలహాదారు క్లిఫర్డ్‌ హెచ్చరించారు. దీంతో టెక్నాలజీ అంటేనే ఆందోళన చెందాల్సి పరిస్థితులు వచ్చాయా?అనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

 

AIకు మానవుల ప్రాణాలు తీయగల సైబర్‌, బయోలాజికల్‌ ఆయుధాలను సృష్టించే సామర్థ్యం ఉందని రిషి సునాక్‌ సలహాదారు క్లిఫర్డ్‌ హెచ్చరించారు. AI చాలా శక్తివంతమైనదనీ..దీన్ని నియంత్రించకపోతే కష్టమంటున్నారు. Artificial intelligenc ను నియంత్రించకపోతే కేవలం వచ్చే రెండేళ్లలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంతర్జాతీయ నిపుణులు, టెక్‌ దిగ్గజ అధినేతలు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఇవి అనేక మందిని చంపే శక్తిమంతమైన ఆయుధాలను ఉత్పత్తి చేయడంలో దోహదపడతాయని బ్రిటన్‌ ప్రధాని సలహాదారుడు మ్యాట్‌ క్లిఫర్డ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Hytech Marriages : ఇవేం హైటెక్ పెళ్లిళ్లురా బాబూ..?! ఏఐ చాట్‌బాట్‌ను పెళ్లాడిన యువతి, వర్చువల్ క్యారెక్టర్‌ను పెళ్లి చేసుకున్న యువకుడు..

అంతర్జాతీయ స్థాయిలో (Artificial Intelligence) నియంత్రించకుంటే.. మానవుడు నియంత్రించలేని శక్తివంతమైన వ్యవస్థ ఏర్పాటుకు దారితీస్తాయని..ఏఐతో స్వల్ప, దీర్ఘకాలికంగా ఎన్నో రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయని అన్నారు. జీవాయుధాలు లేదా భారీ సైబర్‌ దాడులను చేసేందుకు అవసరమైన సాంకేతికత కోసం ఏఐను ఇప్పుడు వాడుకోవచ్చు. ఇవన్నీ చాలా ప్రమాదకరమైనవి’ అని ఓ ఇంటర్వ్యూలో మ్యాట్‌ క్లిఫర్డ్‌ హెచ్చరించారు.

బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ సాంకేతిక సలహాదారుగా వ్యవహరిస్తున్న క్లిఫర్డ్‌.. ChatGPT, Google Bard వంటి కృత్రిమ మేధ మోడల్స్‌పై పరిశోధన కోసం ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌ మోడల్‌ టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తున్నారు. అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఇన్వెన్షన్‌ ఏజెన్సీ ఛైర్మన్‌గానూ ఉన్నారు.

 

మరోవైపు, ఏఐ సాంకేతికతో వస్తోన్న వ్యవస్థలు (ChatGPTవంటివి) ప్రపంచ మానవాళికి తీవ్ర ప్రమాదాన్ని తలపెడతాయని అంతర్జాతీయంగా టెక్‌ దిగ్గజ సంస్థల అధిపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వ్యవస్థల డెవలప్ మెంట్ ను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తూ అనేక మంది నిపుణులు బహిరంగ లేఖ రాశారు.

 

దాంట్లో ఎలాన్‌ మస్క్‌ వంటి కీలక వ్యక్తులు సంతకాలు కూడా చేశారు. ఇటువంటి వ్యవస్థలను సరైన రీతిలో ఉపయోగించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని గూగుల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) హెచ్చరించారు. కృత్రిమ మేధ దుష్ర్పభావాలను తలచుకుంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని అన్నారు. ఈ కృత్రిమ మేధస్సును ప్రయోజనకరంగా ఉపయోగించడంపై ప్రభుత్వాలు వెంటనే దృష్టి పెట్టాలని సందర్ పిచాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతు ఆయా ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు.

 

‘కృత్రిమ మేధస్సు సరిగ్గా ఉపయోగించకపోతే చాలా ప్రమాదమని అన్నారు. అవి ఎటువంటివి అని క్లియర్ గా చెప్పటానికి ప్రస్తుతం మా వద్ద సమాధానాలు లేకపోయినా..AI గురించి ఆలోచిస్తూ రాత్రి నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని ఆందోళన వ్యక్తంచేశారు. కొత్త టెక్నాలజీని అత్యంత వేగంగా బయటకు తీసుకురావడానికి కంపెనీలు పోటీపడుతున్నాయి. కానీ అదే సమయంలో చాలా చాలా నియంత్రణ అవసరం అని అన్నారు. ఏఐ సమాజానికి ప్రమాదకరం అని సూచించారు.